అన్వేషించండి

Air Purifier Cars: ఎయిర్ ఫ్యూరిఫయర్ ఉన్న బడ్జెట్ కార్లు ఇవే - కాలుష్య నగరాల్లో బెస్ట్ ఆప్షన్లు!

Cars With Air Purifier Feature: మనదేశంలో ఎయిర్ ప్యూరిఫయర్ ఫీచర్‌తో మంచి కార్లు కొన్ని అందుబాటులో ఉన్నాయి. వాటిలో హోండా అమేజ్, టాటా నెక్సాన్ వంటి కార్లు ఉన్నాయి.

Cars With Air Purifier: దేశంలోని ప్రముఖ నగరాల్లో గాలి నిరంతరం కాలుష్యపూరితం అవుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు రోడ్లపైకి రావడమే కష్టంగా మారింది. బైక్‌పై ప్రయాణించే వారికి ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా కార్లలో ప్రయాణించే వారు కూడా ఈ కాలుష్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. నేటి కాలంలో మీరు కారును కొనుగోలు చేసేటప్పుడు, అందులో ఎయిర్ ప్యూరిఫైయర్ ఫీచర్ ఉందా లేదా అని ఖచ్చితంగా చెక్ చేయండి. ఎయిర్ ప్యూరిఫైయర్‌లను ఇన్‌స్టాల్ చేసిన కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీటిలో కొన్ని కార్లు తక్కువ ధరలోనే అందుబాటులో ఉన్నాయి.

హోండా అమేజ్ (Honda Amaze)
ఎయిర్ ప్యూరిఫైయర్‌తో వస్తున్న కార్ల జాబితాలో హోండా అమేజ్ కూడా ఉంది. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ.7,62,800 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ కారు ఐదు కలర్ వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ హోండా కారు 1199 సీసీ 1.2-లీటర్ i-VTEC పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఈ ఇంజన్ 6,000 ఆర్పీఎం వద్ద 90 పీఎస్ పవర్‌ని, 4,800 ఆర్పీఎం వద్ద 110 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో 18.6 కిలోమీటర్లు, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో 18.3 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.

Also Read: టాటా అల్ట్రోజ్ రేసర్‌పై భారీ డిస్కౌంట్ - ఎంత తగ్గుతుందో తెలుసా?

టాటా నెక్సాన్ (Tata Nexon)
టాటా నెక్సాన్ కూడా మంచి కారు అని చెప్పవచ్చు. ఈ కారు మొత్తం 100 వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ కారులో ఐదు కలర్ ఆప్షన్లు కూడా అందించారు. టాటా నెక్సాన్‌లో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ కూడా అందుబాటులో ఉంది. గాలి నాణ్యతను మెరుగుపరచడానికి, ఈ కారులో ఎయిర్ ప్యూరిఫైయర్ ఫీచర్ కూడా ఉంది. భద్రత కోసం కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు కూడా అందించారు. టాటా నెక్సాన్ ఎక్స్ షోరూమ్ ధర రూ.7.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ700 (Mahindra XUV700)
మహీంద్రా ఎక్స్‌యూవీ700 అనేది 5 సీటర్ కారు. ఈ కారులో ఎంహాక్ సీఆర్డీఐ ఇంజన్ చూడవచ్చు. ఈ ఇంజన్ 3,750 ఆర్పీఎం వద్ద 152.87 కేడబ్ల్యూ పవర్‌ని, 1,500-2,000 ఆర్పీఎం వద్ద 360 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారులో ఎయిర్ ప్యూరిఫైయర్ ఫీచర్ కూడా ఉంది. ఈ మహీంద్రా కారు ఎక్స్ షోరూమ్ ధర రూ. 13.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

మనదేశంలో ఉన్న ప్రధాన నగరాల్లో కాలుష్యం క్రమంగా పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పుడు కాలుష్యం గురించి టాపిక్ వచ్చినా ఢిల్లీ పేరు గుర్తుకు వస్తుంది. కేవలం ఢిల్లీ మాత్రమే కాకుండా ముంబై, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల్లో కూడా కాలుష్యం పెరుగుతోంది. ముఖ్యంగా కోవిడ్ సమయంలో చాలా మంది సొంత వాహనాలు కొనుగోలు చేశారు. ఈ కాలుష్యానికి అది కూడా ఒక కారణమే. రోడ్లపై కారులో ప్రయాణించేటప్పుడు ఇటువంటి కార్లు కాలుష్యం బారిన పడకుండా కాపాడతాయి.

Also Read: మాకు సీఎన్‌జీ కార్లే కావాలంటున్న ప్రజలు - భారీగా పెరుగుతున్న డిమాండ్!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
Vaammo Vaayyo Song Lyrics : ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
Vaammo Vaayyo Song Lyrics : ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
Venezuela : వెనిజులా రాజధాని కారకాస్‌పై క్షిపణి దాడి! పలు చోట్ల విధ్వంసం!
వెనిజులా రాజధాని కారకాస్‌పై క్షిపణి దాడి! పలు చోట్ల విధ్వంసం!
Maoist Latest News: ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
Hyundai Creta నుంచి Tata Sierra వరకు - కొత్త Seltos ముందు బలంగా నిలబడే కారు ఏది?
కొత్త Kia Seltos - ధర, స్పెసిఫికేషన్లలో ఇతర కార్ల కంటే బెటర్‌గా ఉందా?
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Embed widget