Tata New Car: బాలెనో, i20, గ్లాంజాకు ధమ్కీ ఇవ్వబోతున్న 'టాటా కొత్త ప్రీమియం హ్యాచ్‌బ్యాక్' - బుకింగ్స్ ప్రారంభం
Tata Altroz Facelift Version: టాటా బ్రాండ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. రూ. 6.89 లక్షల రేటుతో ప్రారంభమయ్యే ఈ కారు బాలెనో, ఐ20, గ్లాంజాకు గట్టి పోటీ ఇవ్వగలదు.

Tata Altroz Facelift Price And Features: టాటా మోటార్స్, తన పాపులర్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కోసం అధికారికంగా బుకింగ్స్ ఓపెన్ చేసింది. ఈ కారును డీలర్‌షిప్స్ & టాటా వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు. ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.89 లక్షలు. కొత్త ఫీచర్లు, డిజైన్ ఎలిమెంట్స్ & అదనపు వేరియంట్స్‌తో ఈ అప్‌డేటెట్ మోడల్ జనం ముందుకొచ్చింది. ఇది.. Maruti Suzuki Baleno, Hyundai i20 & Toyota Glanzaకు పోటీగా, వాటికి ప్రత్నామ్నాయ కారుగా నేరుగా దూసుకొచ్చింది.
టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను మొత్తం 5 ట్రిమ్స్‌లో (స్మార్ట్, ప్యూర్, క్రియేటివ్, అకంప్లిష్డ్ S & అకంప్లిష్డ్+ S) తీసుకొచ్చారు.
టాటా ఆల్ట్రోజ్ స్మార్ట్ (Tata Altroz Facelift Smart)
టాటా ఆల్ట్రోజ్ స్మార్ట్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర (Tata Altroz Facelift ex-showroom price) రూ.6.89 లక్షల నుంచి రూ.7.89 లక్షల మధ్య ఉంది. దీనిలో పెట్రోల్ మాన్యువల్ & CNG ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఈ వేరియంట్‌లో 16-అంగుళాల స్టీల్ వీల్స్, LED టెయిల్‌ల్యాంప్స్ & ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, రిమోట్ కీలెస్ ఎంట్రీ, అన్ని డోర్లపై పవర్ విండోస్, ఐడిల్ స్టార్ట్-స్టాప్ (పెట్రోల్ వెర్షన్‌లో మాత్రమే), 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESC & 3-పాయింట్ సీట్ బెల్ట్‌లు వంటి సేఫ్టీ ఫీచర్లను అందించారు.
టాటా ఆల్ట్రోజ్ ప్యూర్ (Tata Altroz Facelift Pure)
టాటా ఆల్ట్రోజ్ ప్యూర్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.69 లక్షల నుంచి రూ.8.99 లక్షల మధ్య ఉంటుంది. ఇది పెట్రోల్ మాన్యువల్, పెట్రోల్ AMT, డీజిల్ మాన్యువల్ & CNG ఎంపికలలో వచ్చింది. ఆటో LED హెడ్‌ల్యాంప్స్, ఆటో ఫోల్డింగ్ ORVMs, రెయిన్-సెన్సింగ్ వైపర్స్, 7-అంగుళాల టచ్‌స్క్రీన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ డీఫాగర్, 360 డిగ్రీ కెమెరా & క్రూయిజ్ కంట్రోల్ వంటి బ్యూటిఫుల్ ఫీచర్లు ఈ ట్రిమ్ సొంతం.
టాటా ఆల్ట్రోజ్ క్రియేటివ్ (Tata Altroz Facelift Creative)
టాటా ఆల్ట్రోజ్ క్రియేటివ్ వేరియంట్ రూ.8.69 లక్షల నుంచి రూ.9.79 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు అందుబాటులో ఉంది. పెట్రోల్ MT/AMT & CNG ఇంజిన్ ఆప్షన్స్‌లో ఈ ఎడిషన్‌ను కొనవచ్చు. 16-అంగుళాల డ్యూయల్-టోన్ హైపర్‌స్టైల్ వీల్స్, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, యాంబియంట్ లైటింగ్, పుష్ స్టార్ట్ బటన్, రియర్ AC వెంట్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, వన్-టచ్ ఆటో విండో, 360 డిగ్రీ కెమెరా & ప్యాడిల్ షిఫ్టర్స్ వంటి ప్రీమియం ఫీచర్లను దీనిలో చూడవచ్చు.
టాటా ఆల్ట్రోజ్ అకాంప్లిష్డ్ ఎస్ (Tata Altroz Facelift Accomplished S)
టాటా ఆల్ట్రోజ్ అకాంప్లిష్డ్ S ఎక్స్-షోరూమ్ ధర రూ.9.99 లక్షల నుంచి రూ.11.29 లక్షల మధ్య ఉంటుంది. పెట్రోల్ MT/DCT, డీజిల్ MT & CNG ఇంజిన్ ఆప్షన్స్ దీనిలో ఉన్నాయి. 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, 7-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సింగిల్ పాన్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, కనెక్టెడ్ LED టెయిల్‌ల్యాంప్స్, LED ఫాగ్ ల్యాంప్స్ & డ్యూయల్-టోన్ బాడీ కలర్ వంటి ఫీచర్లు ఈ వేరియంట్‌లో అందుబాటులో ఉన్నాయి.
టాటా ఆల్ట్రోజ్ అకాంప్లిష్డ్+ ఎస్ (Tata Altroz Facelift Accomplished+ S)
టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్‌లో టాప్-ఎండ్ ట్రిమ్ అకాంప్లిష్డ్+ S. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.49 లక్షలు. ఈ వెర్షన్‌ను పెట్రోల్ DCT ఇంజిన్ ఆప్షన్‌లో కొనవచ్చు. క్యాబిన్‌లో 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎయిర్ ప్యూరిఫైయర్, బ్లైండ్ స్పాట్ మానిటర్, ఎక్స్‌ప్రెస్ కూల్ ఫంక్షన్, బిల్ట్-ఇన్ నావిగేషన్, కస్టమైజ్డ్ ఆడియో మోడ్ & టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.
కలర్ ఆప్షన్స్ (Tata Altroz Facelift Colour Options)
టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను 5 రంగుల్లో కొనుగోలు చేయవచ్చు - ప్రిస్టైన్ వైట్, ప్యూర్ గ్రే, రాయల్ బ్లూ, అంబర్ గ్లో & డ్యూన్ గ్లో.
మీరు రూ.7 లక్షల నుంచి రూ. 11.5 లక్షల బడ్జెట్‌లో ఫీచర్-ప్యాక్డ్, సేఫ్ & స్టైలిష్ హ్యాచ్‌బ్యాక్ కొనుగోలు చేయాలనుకుంటే టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ 2025ని ఓసారి పరిశీలించవచ్చు.





















