Virat Kohli Luxury Car: విరాట్ కోహ్లీ కార్ కలెక్షన్ నిజంగా మైండ్ బ్లోయింగ్ - అత్యంత ఖరీదైన కారు ఇదే
Virat Kohli Car Collection: విరాట్ కోహ్లీ ఆడి కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు కాబట్టి అతని దగ్గర ఆడి కార్లు ఉన్నాయి. బెంట్లీ, లాంబోర్గినీ, పోర్చే వంటి కార్లు కూడా విటార్ గరాజ్‌లో కొలువుదీరాయి.

Virat Kohli Luxury Car Collection: భారత క్రికెట్ జట్టులో సూపర్ స్టార్, కింగ్ కోహ్లీ ఇటీవల టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ నిర్ణయం విరాట్ కోహ్లీ అభిమానులకు పెద్ద షాక్. విరాట్‌కు క్రికెట్‌తో పాటు లగ్జరీ కార్లంటే కూడా చాలా ఇష్టం. విరాట్ కోహ్లీ కార్ గరాజ్‌లో చాలా లగ్జరియస్, కాస్ట్‌లీ కార్లు పార్క్ చేసి ఉన్నాయి.
క్రికెట్ మ్యాచ్‌లు లేనప్పుడు లేదా బాడీని, మైండ్‌ను రీఛార్జ్ చేసుకోవడానికి విరాట్ కోహ్లీ దిల్లీ & ముంబై రోడ్లపై తన లగ్జరీ కార్లను నడుపుతాడు. లగ్జరీ కార్లను డ్రైవ్ చేస్తూ చాలాసార్లు కెమెరాల కంట పడ్డాడు. విరాట్ దిల్లీలో ఉన్నప్పుడు, అరుణ్ జైట్లీ స్టేడియానికి వెళ్లడానికి తన సొంత కారునే ఉపయోగించేవాడు. కింగ్ కోహ్లీ కార్ కలెక్షన్ అతని వ్యక్తిత్వాన్ని, అభిరుచిని మాత్రమే కాదు, ఈ రిచ్ క్రికెటర్ విలాసవంతమైన లైఫ్‌స్టైల్‌ను కూడా ప్రతిబింబిస్తుంది.
విరాట్ కోహ్లీ లగ్జరీ కార్ల కలెక్షన్
విరాట్ కోహ్లీ చాలాకాలంగా ఆడి ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. కాబట్టి, అతని కార్ గరాజ్‌లో Audi R8 LMX & Audi R8 V10 ప్లస్ వంటి సూపర్ లగ్జరీ స్పోర్ట్స్ కార్లు ఉన్నాయి. వీటి రేటు రూ. 3 కోట్ల కంటే ఎక్కువే ఉంటుంది. అంతేకాదు, కోహ్లీ దగ్గర Audi A8 L, Audi Q8, RS5, Q7 & S5 వంటి ఇతర మోడళ్లు కూడా ఉన్నాయి, వీటి ధరలు రూ. 1 కోటి నుంచి రూ. 2 కోట్ల మధ్య ఉంటుంది.
విరాట్ కోహ్లీ కార్ల కలెక్షన్‌లో, లగ్జరీ కార్ Bentley Flying Spur కూడా ఉంది, దీని విలువ రూ. 3 కోట్లకు పైగా ఉంటుంది. Lamborghini Aventador S కూడా విరాట్ కోహ్లీ దగ్గర ఉన్న అత్యంత ఖరీదైన కార్లలో ఒకటి, దీని ధర రూ. 5 కోట్ల పైమాటే. విరాట్ కార్ల కలెక్షన్‌లో Aston Martin DB11 కూడా ఉంది, దీని ధర రూ. 4 కోట్ల కంటే ఎక్కువ, ఈ కార్ అతని స్టైలిష్ & ప్రీమియం అభిరుచిని గుర్తు చేస్తుంది.
ఈ కార్లు కూడా గరాజ్‌లో ఉన్నాయి...
కోహ్లీ కార్ కలెక్షన్ అప్పుడే ఐపోలేదు. Porsche 911 Turbo S అతని కార్ కలెక్షన్‌లో పెర్ఫార్మెన్స్ డ్రైవ్ స్పోర్ట్స్ కారు, దీని ధర దాదాపు రూ. 3.4 కోట్లు. దీనితో పాటు, Ferrari 488 GTB కూడా విరాట్ కోహ్లీ దగ్గర ఉన్న మరొక హై-స్పీడ్ స్పోర్ట్స్ కారు, దీని ధర రూ. 4 కోట్లకు పైగా ఉంటుంది. ఈ కార్లు విరాట్ వేగాన్ని & స్పోర్ట్స్ కార్లపై ఉన్న ఇష్టాన్ని ప్రతిబింబిస్తాయి.
2 కోట్ల రూపాయలకు పైగా ఖరీదు చేసే BMW M5, దాదాపు 2 కోట్ల రూపాయల ఖరీదు చేసే Range Rover Vogue వంటి స్పోర్ట్స్ సెడాన్లు విరాట్ డైలీ లగ్జరీ & ఆఫ్-రోడింగ్ పాషన్‌ను అద్దంలో చూపిస్తాయి. ఇంకా.. విరాట్ కోహ్లీ దగ్గర Toyota Fortuner SUV కూడా ఉంది, దీని ధర దాదాపు రూ. 40 లక్షలు. ఈ కారును విరాట్ కోహ్లీ తన సాధారణ ప్రయాణాలకు ఉపయోగిస్తాడు.





















