Maruti New Electric Car: ఎంతోమంది కొనేందుకు ఎదురుచూస్తున్న 'కలల కార్' ఇది - త్వరలోనే లాంచింగ్
Maruti e-Vitara Launching: మారుతి సుజుకి తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ SUVని రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్‌తో, మరో నాలుగు నెలల్లో లాంచ్ చేయబోతోంది. దీనిలో చాలా ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.

Maruti e-Vitara Launching Date, Price, Mileage And Features: మారుతి సుజుకీ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్ "ఇ-విటారా SUV" త్వరలో లాంచ్ కాబోతోంది. ఈ కార్ కోసం దేశవ్యాప్తంగా ప్రజలు, ముఖ్యంగా ఎగువ మధ్య తరగతి ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మారుతి సుజుకి చైర్మన్ చెప్పిన ప్రకారం, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న e-విటారా ఎలక్ట్రిక్ కారును ఈ ఏడాది సెప్టెంబర్‌లో (సెప్టెంబర్ 2025) లాంచ్ చేయనున్నారు. నెక్సా డీలర్‌షిప్ నుంచి దీనిని అమ్ముతారు.
మారుతి సుజుకి మొట్టమొదటి Electric SUV e-Vitara రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో మార్కెట్‌లోకి రాబోతోంది, అవి - 49kWh & 61kWh. ఈ ఎలక్ట్రిక్ SUV సిగ్మా, డెల్టా & జీటా/ఆల్ఫా అనే మూడు ట్రిమ్‌ల్లో లాంచ్ అవుతుంది, కస్టమర్లు తమ అభిరుచి & అవసరానికి అనుగుణంగా ఒక ట్రిమ్ ఎంచుకోవచ్చు.
ఏ వేరియంట్ ధర ఎంత?
రేటు విషయానికి వస్తే... సిగ్మా వేరియంట్ (49kWh) ఎక్స్-షోరూమ్ ధర (Maruti e-Vitara ex-showroom price) రూ. 18 లక్షలు; డెల్టా వేరియంట్ (49kWh) ధర రూ. 19.50 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. జీటా వేరియంట్ (49kWh) ధర రూ. 21 లక్షలుగా ఉంటుంది.
జీటా వేరియంట్‌లో మరొక ఆప్షన్ కూడా ఉంది, అది 61kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. దీని ధర రూ. 22.50 లక్షలు. టాప్ వేరియంట్ ఆల్ఫా (61kWh) రేటు రూ. 24 లక్షలు. రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో జీటా వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంటుంది, ఈ వేరియంట్‌లోనూ ఎక్కువ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.
ఎన్ని రంగుల్లో లాంచ్ అవుతోంది?
మారుతి సుజుకి ఈ-విటారాను రంగుల్లో ముంచెత్తింది. మొత్తం 10 ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్స్‌తో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ రంగుల్లో 6 మోనో-టోన్ & 4 డ్యూయల్-టోన్ కలర్స్ కనిపిస్తాయి. మోనో-టోన్ ఆప్షన్స్‌లో నెక్సా బ్లూ, స్ప్లెండిడ్ సిల్వర్, ఆర్కిటిక్ వైట్, గ్రాండియర్ గ్రే, బ్లూయిష్ బ్లాక్ & ఒపులెంట్ రెడ్ వంటి రంగులను చూడవచ్చు.
అదిరిపోయే ప్రీమియం ఫీచర్లు
e-Vitara ను ప్రీమియం కార్‌లా లాంచ్ చేయడానికి మారుతి సుజుకీ దానికి చాలా అడ్వాన్స్‌డ్ ఫీచర్లను జోడించింది. LED హెడ్‌లైట్లు, DRLs & టెయిల్‌ల్యాంప్‌లు ఈ బండికి ఆకర్షణీయమైన & ఆధునిక రూపాన్ని ఇస్తాయి. ఈ SUVకి 18-అంగుళాల చక్రాలను బిగించారు. యాక్టివ్ ఎయిర్ వెంట్ గ్రిల్ కూడా దీనిలో ఉంది, ఇది ఏరోడైనమిక్ ఎఫిషియన్సీని పెంచుతుంది. ఇంకా... పనోరమిక్ సన్‌రూఫ్, మల్టీ-కలర్ యాంబియంట్ లైటింగ్ & 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ & 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి డిజిటల్ ఫీచర్లను చేర్చారు. ఈ సిస్టమ్ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లేకు సపోర్ట్ చేస్తుంది.
భద్రతలో తగ్గేదేలే..
భద్రత విషయంలోనూ మారుతి ఇ-విటారా తక్కువేమీ కాదు. ఈ SUVని లెవల్ 2 ADAS టెక్నాలజీతో డిజైన్ చేశారు, ఇందులో లేన్ కీప్ అసిస్ట్ & అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి. ఈ SUVలో డ్రైవర్ & మిగిలిన ప్రయాణీకుల కోసం 7 ఎయిర్‌బ్యాగ్‌లు అమర్చారు. బ్లైండ్ స్పాట్ మానిటర్, టైర్ ప్రెజర్ మానిటర్, 360-డిగ్రీ కెమెరా, ముందు & వెనుక పార్కింగ్ సెన్సార్లు వంటి ఫీచర్లు కూడా ఈ బండి సేఫ్టీని పెంచుతాయి.



















