అన్వేషించండి

BMW iX Review: స్పేస్‌షిప్ లాంటి కారు.. అదిరిపోయే ఫీచర్లు!

బీఎండబ్ల్యూ లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ కారు ఐఎక్స్ రివ్యూ..

బీఎండబ్ల్యూ ఎట్టకేలకు ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేసిన బ్రాండ్లలో చేరింది. తన కొత్త కారు ఐఎక్స్‌తో బీఎండబ్ల్యూ ఇందులో ఎంట్రీ ఇచ్చింది. ఐఎక్స్ కొత్త ఎస్‌యూవీ కాదు కానీ సాధారణ బీఎండబ్ల్యూ కార్లకు కాస్త భిన్నంగా ఉంది. ఇది ఒక ఫ్లాగ్ షిప్ ఎస్‌యూవీ కారు. ఈ కారును చాలా తెలివిగా రూపొందించారు. దీని ఇంటీరియర్ కూడా చాలా ఎకో ఫ్రెండ్లీగా ఉండనుంది.

ఈ కారు ఎక్స్5 సైజులో ఉంది. కానీ దీని లుక్ మాత్రం చాలా బాగుంది. ఇందులో పెద్ద గ్రిల్ కూడా ఉంది. ఈ గ్రిల్ కెమెరా, సెన్సార్లు, రాడార్లను కూడా కవర్ చేయనుంది. ఫ్లష్ డోర్ హ్యాండిల్స్‌ను ఇందులో అందించారు. సన్నని ఎల్ఈడీ హెడ్‌ల్యాంపులు, టెయిల్ ల్యాంపులు ఇందులో ఉన్నాయి.

ఇంతకుముందు మీరు బీఎండబ్ల్యూలో కూర్చుంటే.. దాని అనుభవానికి, దీని అనుభవానికి చాలా తేడా ఉంటుంది. ఇంటీరియర్‌ను అద్భుతంగా డిజైన్ చేశారు. ఎక్స్5తో ఏమాత్రం సంబంధం లేకుండా కొత్తగా దీన్ని డిజైన్ చేశారు. దీని హెక్సాగోనల్ స్టీరింగ్ వీల్ చూడటానికి చాలా కొత్తగా ఉంది. ఫ్లోటింగ్ సెంటర్ కన్సోల్, పెద్ద డిస్‌ప్లేలు కూడా ఇందులో ఉన్నాయి.

ఇందులో రా మెటీరియల్స్ కానీ, అరుదైన లోహాలను కానీ బీఎండబ్ల్యూ ఉపయోగించలేదు. పూర్తిగా రీసైకిల్ చేసిన చేసిన మెటీరియల్‌తోనే దీన్ని రూపొందించారు. ఇంటీరియర్‌లో సహజమైన లెదర్‌ను ఉపయోగించారు. ఇక టెక్నాలజీ విషయానికి వస్తే.. ఇందులో 12.3 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను ఉపయోగించారు. దీంతోపాటు మధ్యలో 14.9 అంగుళాల పెద్ద డిస్‌ప్లే కూడా ఉంది. కస్టమైజబుల్ మెనూలు, ఎన్నో ఆప్షన్లు కూడా ఈ డిస్‌ప్లేలో ఉన్నాయి. 

హెడ్స్ అప్ డిస్‌ప్లే, రివర్స్ అసిస్టెంట్, 18 స్పీకర్ల హర్మాన్ కార్డన్ ఆడియో సిస్టంను ఇందులో అందించారు. ఈ కారు గెస్చర్లను కూడా గుర్తిస్తుంది. ఇందులో పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్ కూడా ఉంది. యాంబియంట్ లైటింగ్ ఫీచర్ కూడా ఇందులో అందించారు.

ఇందులో 76.6 kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. ఇది 425 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ అంటోంది. కానీ బయట మాత్రం 300 కిలోమీటర్లకు కొంచెం ఎక్కువ ఇవ్వనుంది. అది మీరు డ్రైవ్ చేసే విధానం మీద ఆధారపడి ఉంటుంది. మీరు 150కేడబ్ల్యూ డీసీ చార్జర్‌ను ఉపయోగిస్తే 10 నిమిషాల్లో, డీసీ చార్జర్‌ను ఉపయోగిస్తే 20 నిమిషాల్లో 100 కిలోమీటర్లకు సరిపడా చార్జ్ కానుంది. స్టాండర్డ్ ఏసీ చార్జర్‌తో అయితే పూర్తిగా చార్జ్ కావడానికి ఏడున్నర గంటలు పట్టనుంది. వాల్ బాక్స్ చార్జర్‌ను కార్‌తో పాటు అందించనున్నారు. బీఎండబ్ల్యూ డీలర్ల వద్ద ఫాస్ట్ చార్జర్లు లభించనున్నాయి.

దీని ధర రూ.1.15 కోట్ల వరకు ఉంది. ఇది ఒక యునిక్ ఎస్‌యూవీ కారు. కేవలం ఎలక్ట్రిక్ మాత్రమే కాకుండా ఎకో ఫ్రెండ్లీ అవుట్‌లుక్ కూడా దీంతోపాటు అందించారు. ఇందులో మంచి ఇంటీరియర్‌ను అందించారు. చూడటానికి స్పేస్‌షిప్ తరహాలో దీని డిజైన్ ఉండటం విశేషం. బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి స్ట్రాంగ్ ఎంట్రీ ఇచ్చిందనే చెప్పవచ్చు.

Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!

Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేస్తుంది.. అదిరిపోయే ఫీచర్లు.. డిజైన్ సూపర్!

Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!

Also Read: New Hyundai Creta: హ్యుండాయ్ క్రెటా కొత్త వేరియంట్.. అదిరిపోయే డిజైన్.. ఎలా ఉందంటే?

Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?

Also Read: Bikes Under Rs.1 Lakh: రూ.లక్షలోపు మంచి బైక్ కొనాలనుకుంటున్నారా.. బెస్ట్ ఇవే.. స్పోర్ట్స్ బైకులు కూడా!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

టాప్ హెడ్ లైన్స్

చూపులకు SUV రఫ్‌నెస్.. క్యాబిన్‌లో టెక్నాలజీ హంగామా.. హ్యుందాయ్ బేయాన్‌లో ఇవే హైలైట్స్!
హ్యుందాయ్ కొత్త SUV వచ్చేస్తోంది, డిజైన్ చూస్తే అదిరిపోవాల్సిందే.. ఇండియాలో లాంచ్‌ ఎప్పుడంటే?
హై మైలేజ్‌ కారు వ్యాగన్‌ ఆర్‌.. నెలకు రూ.8,200 EMIతో! ఎంత లోన్‌ తీసుకోవాలి, ఎంత డౌన్‌పేమెంట్‌ చేయాలి?
మీ చేతిలో రూ.లక్షే ఉందా.. అయినా Maruti Suzuki Wagon R ని కొనేయొచ్చు, ఈజీ EMI స్కీమ్‌ ఉందిగా!
Honda SP 125 EMI: హోండా SP 125 ఆన్‌రోడ్ ధర ఎంత, లోన్‌ ఎంత వస్తుంది, EMI ఎంత కట్టాలి?
నెలకు కేవలం రూ.2500 చాలు, స్టైలిష్‌ బైక్‌ Honda SP 125 మీ ఇంటికొస్తుంది!
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 460km దూరం జర్నీ.. 7 ఎయిర్‌బ్యాగ్స్‌తో కియా కొత్త PV7 ఎలక్ట్రిక్ వ్యాన్!
కియా కొత్త 11-సీటర్‌ ఎలక్ట్రిక్‌ వ్యాన్‌.. ఎయిర్‌ బ్యాగ్స్‌ కూడా, టూర్లకు వెళ్లేవాళ్లకు భలే ఆప్షన్‌

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EPFO Wage Ceiling Hike: ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
Death Sentence For Maoists: జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
KCR Family Assets: కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
CM Chandrababu In Tirumala: వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
Viral News: విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
AP Police Recruitment: ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
YSRCP Vizianagaram: బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
NRI Become IAS: ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
Embed widget