అన్వేషించండి

ఈవీ మార్కెట్లో చతికిలబడ్డ BaaS విధానం: తక్కువ ధర ఉన్నా బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్‌పై విముఖత!

Battery as a Service BaaS | ఇండియ‌న్ ఈవీ మార్కెట్లో ప్రారంభ ధరలను తగ్గించేందుకు తెచ్చిన బ్యాటరీ-యాస్-ఏ-సర్వీస్ (BaaS) ఆశించిన స్థాయిలో కస్టమర్లను ఆకట్టుకోలేకపోతోంది.

ఎలక్ట్రిక్ వాహనాల (EV) అమ్మకాలను పెంచడానికి, వాటి భారీ ప్రారంభ ధరలను తగ్గించడానికి ప్రవేశపెట్టిన సరికొత్త ఫైనాన్సింగ్ విధానం 'బ్యాటరీ-యాస్-ఏ-సర్వీస్' (BaaS). ఇది అందుబాటులోకి వచ్చి దాదాపు 18 నెలలు కావస్తున్నా, కేవలం 2 నుండి 3 శాతం మంది కొనుగోలుదారులు మాత్రమే దీనిపై ఆసక్తి చూపుతున్నారు. ధరల విషయంలో చాలా సున్నితంగా ఉండే భారతీయ మార్కెట్లో ఈ మోడల్ ఒక గేమ్-ఛేంజర్ అవుతుందని భావించినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఇది ఒక చిన్న స్థాయికే పరిమితమైందని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు.

ధర తగ్గినా ఎందుకు కొనడం లేదు?
సాధారణంగా ఒక ఎలక్ట్రిక్ కారు ధరలో బ్యాటరీ వాటా సుమారు 35 నుండి 40 శాతం వరకు ఉంటుంది. ఈ బాస్ (BaaS) విధానంలో కారు కొనేటప్పుడు బ్యాటరీని కొనాల్సిన అవసరం లేదు. కేవలం కారు బాడీని కొని, బ్యాటరీని అద్దెకు వాడుకోవచ్చు. కిలోమీటరు వాడకం ఆధారంగా నెలవారీ అద్దె చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల ఈవీ కార్ల ధరలు నేరుగా పెట్రోల్ కార్ల ధరలతో సమానంగా తగ్గుతాయి. అయినప్పటికీ ప్రజలు దీనిని పెద్దగా ఇష్టపడటం లేదు. భారతదేశంలో బాస్ మార్కెట్ వాటా 5 శాతం కంటే తక్కువగా ఉందని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ ఎండీ శైలేష్ చంద్ర తెలిపారు. ఇదొక విజువలైజేషన్ టూల్ మాత్రమేనని ఆయన అభిప్రాయపడ్డారు.

మార్కెట్లో పోటీ, కంపెనీల స్పందన రియాక్షన్
భారత్‌లో ఈ బాస్ కాన్సెప్ట్‌ను జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా మొదటగా 'విండ్సర్ ఈవీ' (Windsor EV) ద్వారా పరిచయం చేసింది. బ్యాటరీ లేకుండా దీని ధర రూ. 9.99 లక్షలు కాగా, బ్యాటరీతో కలిపి రూ. 13.5 లక్షలుగా ఉంది. ఈ వ్యూహం వల్ల 2025 నాటి ఈవీ సేల్స్‌లో విండ్సర్ 25 శాతం వాటాను సొంతం చేసుకుంది. దీనిని చూసి ఇతర కంపెనీలు కూడా ఈ ప్లాన్‌ను అమలు చేశాయి. మారుతి సుజుకి ఫిబ్రవరి 2026లో లాంచ్ చేసిన 'ఈ విటారా' (eVitara) ను బ్యాటరీ లేకుండా రూ. 10.99 లక్షలకు, బ్యాటరీతో కలిపి రూ. 15.99 లక్షలకు ఆఫర్ చేస్తోంది. టాటా మోటార్స్ కూడా తమ పాపులర్ 'పంచ్ ఈవీ' (Punch EV) బేస్ వేరియంట్‌ను బాస్ స్కీమ్ కింద రూ. 6.49 లక్షలకే అందుబాటులో ఉంచింది. సాధారణంగా దీని ధర రూ. 9.69 లక్షలుగా ఉంది.

ఫైనాన్స్ సాధనంగానే గుర్తింపు
ఆటోమొబైల్ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు బాస్ విధానాన్ని ఒక సేవల కంటే కేవలం ఫైనాన్స్ సాధనంగానే చూస్తున్నారు. వినియోగదారులు ఇతర పెట్రోల్ కార్లతో పోల్చి చూసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని శైలేష్ చంద్ర పేర్కొన్నారు. ఎంజీ మోటార్స్ విషయానికి వస్తే, వారి మొత్తం ఈవీ అమ్మకాలలో 12 నుండి 15 శాతం వరకు ఈ బాస్ విధానం ద్వారానే జరుగుతున్నాయి. ఎంజీ కామెట్, విండ్సర్, జెడ్ఎస్ ఈవీ వంటి మోడళ్లలో దీనికి మంచి ఆదరణ లభిస్తోందని ఎంజీ ప్రతినిధి వినయ్ రైనా తెలిపారు. తక్కువ బడ్జెట్ ఉన్న వారికి ఇది మేలు చేస్తుంది.

భారత వినియోగదారులు నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ఫీజుల కంటే పూర్తి ఓన‌ర్ షిన్ ను (Full Ownership) కోరుకుంటున్నారు. ప్రారంభంలో ఎక్కువ డబ్బు చెల్లించడానికైనా సిద్ధపడుతున్నారు తప్ప, ప్రతి నెలా అద్దె కట్టేందుకు ఇష్టపడటం లేదు. రాబోయే రోజుల్లో కస్టమర్ల ఆలోచనా విధానంలో మార్పు వస్తే తప్ప బాస్ తన పట్టును నిరూపించుకోలేదు.

టాప్ హెడ్ లైన్స్

హైడ్రోజన్ కారుతో JCB సంచలనం.. గంటకు 654 కి.మీ. వేగంతో ప్రపంచ రికార్డు!
ఈ కారు స్పీడ్‌ గంటకు 654km, బుల్లెట్‌ ట్రైన్‌ కూడా ఈ వేగం ముందు బలాదూర్‌!
పెరిగింది రూ.15 వేలే.. కానీ కొత్త Ducati Monsterలో వచ్చిన మార్పులు ఇవీ!
కొత్త ఇంజిన్‌తో Ducati Monster V2.. పాత మోడల్‌కు దీనికి ఇంత తేడానా?
సింగిల్‌ ఛార్జ్‌తో 145 కి.మీ. హ్యాపీగా తిరిగిరావచ్చు.. కొత్త BGauss OoWah MAX Plus‌లో స్పెషల్ ఫీచర్లు!
145km రేంజ్ ఇచ్చే కొత్త BGauss ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్‌.. ఛార్జర్‌ పూర్తిగా ఉచితం
E20 ఇంధనంతో వాహనాల ఇంజిన్లకు ముప్పే! కార్‌ కంపెనీల తనిఖీల్లో సంచలన విషయాలు
E20 పెట్రోల్‌ మీద మళ్లీ రచ్చ.. ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధిక తేమ, రాష్ట్రాలవారీ వివరాలు లీక్‌

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
Embed widget