అన్వేషించండి

Bajaj Upcoming Bikes: చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త మోడల్, దేశంలోనే మొదటి సీఎన్‌జీ బైక్ - బజాజ్ సూపర్ ప్లాన్!

First CNG Bike in India: బజాజ్ త్వరలో చేతక్ ఎలక్ట్రిక్ కొత్త స్కూటర్, దేశంలోనే మొదటి సీఎన్‌జీ బైక్‌ను లాంచ్ చేయనుందని వార్తలు వస్తున్నాయి.

Bajaj Chetak: బజాజ్ ఆటో రాబోయే నెలల్లో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ (Bajaj Chetak Electric) లైనప్‌లో అధునాతన వేరియంట్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోందని వార్తలు వస్తున్నాయి. కొత్త వేరియంట్‌లో పెద్ద బ్యాటరీ, మరింత ఎక్కువ రేంజ్‌ను ఆశిస్తున్నారు. కొత్త బజాజ్ చేతక్ 4.25 కేడబ్ల్యూహెచ్ బీఎల్డీసీ ఎలక్ట్రిక్ మోటారుతో అమర్చబడి ఉంటుందని, ఇది మెరుగైన పనితీరుతో మరింత ఎక్కువ రేంజ్‌ను అందిస్తుందని తెలుస్తోంది.

అధునాతన వేరియంట్ ఎలా ఉంటుంది?
ప్రీమియం ట్రిమ్ ఆధారంగా అడ్వాన్స్‌డ్ వేరియంట్ పెద్ద 3.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను పొందుతుంది. ఇది ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 126 కిలోమీటర్ల రేంజ్‌ను అందించగలదని తెలుస్తోంది. ప్రధాన మార్పుల గురించి చెప్పాలంటే ఇందులో ఐదు నుంచి ఏడు అంగుళాల టీఎఫ్‌టీ కలర్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్ గురించి సమాచారాన్ని చూపుతుంది.

రేంజ్ ఎక్కువగా...
కొత్త బజాజ్ చేతక్ అర్బన్ వేరియంట్ ఇప్పటికే ఉన్న ప్రీమియం ట్రిమ్‌ స్థానాన్ని భర్తీ చేయనుందని వార్తలు వస్తున్నాయి. ఇది 2.9 కేడబ్లూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ని పొందుతుందని భావిస్తున్నారు. ఇది 113 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత మోడల్ కంటే ఇది 5 కిలోమీటర్లు ఎక్కువ. 1894 మిల్లీమీటర్ల పొడవు, 725 మిల్లీమీటర్ల వెడల్పు, 1132 మిల్లీమీటర్ల ఎత్తు, 1330 మిల్లీమీటర్ల వీల్ బేస్ ఉన్న స్కూటర్ సైజులో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. అయితే కొత్త ప్రీమియం వేరియంట్ బరువు మాత్రం దాదాపు మూడు కిలోల వరకు తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.

బజాజ్ మిగతా అప్‌డేట్ల గురించి చెప్పాలంటే... బజాజ్ ఆటో (Bajaj Auto) కొత్త బైక్‌ను పరీక్షిస్తోందని తెలుస్తోంది. ఇది భారతదేశపు మొట్టమొదటి సీఎన్‌జీ పవర్డ్ మోటార్‌సైకిల్ అని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక టెస్ట్ మ్యూల్ బజాజ్ సీటీ నుంచి ప్రేరణ పొందిన డిజైన్‌తో కనిపించింది. ఇది షేప్ లెస్ ఫ్యూయల్ ట్యాంక్‌తో పాటు ట్యాంక్ సెక్షన్, అంచుల చుట్టూ బలమైన బాడీవర్క్‌ను పొందుతుంది. ఈ బైక్ బహుశా బజాజ్ పల్సర్ ఎన్ఎస్125 ఛాసిస్ ఫ్రేమ్‌పై రూపొంది ఉండవచ్చు. దీనిలో పెద్ద సైజు సీఎన్‌జీ సిలిండర్ ఉంటుంది. సీఎన్‌జీ ట్యాంక్‌తో కూడిన 150సీసీ ఇంజిన్‌ ఉన్న ఈ మోటార్‌సైకిల్‌లో టెలిస్కోపిక్ ఫోర్క్, మోనోషాక్ రియర్ సస్పెన్షన్ ఉంటుంది. కొత్త బజాజ్ సీఎన్‌జీ బైక్‌ను 2024లో ఎప్పుడైనా లాంచ్ చేయవచ్చని మీడియా నివేదికలు సూచిస్తున్నాయి.

మరోవైపు టీవీఎస్ (TVS) నవంబర్ అమ్మకాల వివరాలు వెల్లడించింది. టీవీఎస్ మోటార్ కంపెనీ 2023 నవంబర్‌లో 364,231 యూనిట్ల విక్రయాలను నమోదు చేసినట్లు ప్రకటించింది. 2022 నవంబర్‌లో అమ్మకాలు 277,123 యూనిట్లు కాగా, 2023 నవంబర్‌లో 31 శాతం గ్రోత్ కనిపించింది. ఇందులో దేశీయ అమ్మకాలు, ఎగుమతులు రెండూ కలిపి ఉన్నాయి.

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply

Also Read: సూపర్ హిట్ టయోటా కామ్రీ అప్‌డేటెడ్ వెర్షన్ త్వరలో - ఈసారి హైబ్రిడ్ ఇంజిన్‌తో!

Also Read: లాంచ్‌కు రెడీ అవుతున్న కొత్త స్విఫ్ట్ - సరికొత్త ఇంజిన్, సూపర్ లుక్‌తో!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
Pawan Kalyan: మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
MBBS Student Dies: పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
Best Gun Combinations in BGMI: బీజీఎంఐలో చికెన్ డిన్నర్ కొట్టాలంటే ఈ గన్ కాంబినేషన్స్ బెస్ట్ - మీ కాంబోలో ఏం ఉన్నాయి?
బీజీఎంఐలో చికెన్ డిన్నర్ కొట్టాలంటే ఈ గన్ కాంబినేషన్స్ బెస్ట్ - మీ కాంబోలో ఏం ఉన్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
Pawan Kalyan: మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
MBBS Student Dies: పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
Best Gun Combinations in BGMI: బీజీఎంఐలో చికెన్ డిన్నర్ కొట్టాలంటే ఈ గన్ కాంబినేషన్స్ బెస్ట్ - మీ కాంబోలో ఏం ఉన్నాయి?
బీజీఎంఐలో చికెన్ డిన్నర్ కొట్టాలంటే ఈ గన్ కాంబినేషన్స్ బెస్ట్ - మీ కాంబోలో ఏం ఉన్నాయి?
NBK 109 Title Teaser: 'డాకు మహారాజ్'గా గుర్రంపై వచ్చిన బాలయ్య... ఎన్‌బికే 109 టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ చెప్పేశారోచ్
'డాకు మహారాజ్'గా గుర్రంపై వచ్చిన బాలయ్య... ఎన్‌బికే 109 టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ చెప్పేశారోచ్
Thaman: నిన్న చూపు లేని యువకుడికి గాయకుడిగా అవకాశం... నేను కిడ్నీ పేషెంట్‌కు సాయం- తమన్‌పై నెటిజన్ల ప్రశంసలు
నిన్న చూపు లేని యువకుడికి గాయకుడిగా అవకాశం... నేను కిడ్నీ పేషెంట్‌కు సాయం- తమన్‌పై నెటిజన్ల ప్రశంసలు
Andhra Pradesh News: 29న ఆంధ్రప్రదేశ్‌ వస్తున్న పీఎం మోదీ- 80 వేల కోట్ల పెట్టుబడుల పార్క్‌కు శంకుస్థాపన
29న ఆంధ్రప్రదేశ్‌ వస్తున్న పీఎం మోదీ- 80 వేల కోట్ల పెట్టుబడుల పార్క్‌కు శంకుస్థాపన
AP Assembly: ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు అయ్యన్న చురకలు- మొన్న చంద్రబాబు క్లాస్, నేడు స్పీకర్ సీరియస్!
ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు అయ్యన్న చురకలు- మొన్న చంద్రబాబు క్లాస్, నేడు స్పీకర్ సీరియస్!
Embed widget