అన్వేషించండి

Bajaj Pulsar NS400Z Price Slashed: బజాజ్ ధమాకా ఆఫర్ - పవర్ ఫుల్ బైక్ పై భారీగా తగ్గిన ధర.. జీఎస్టీ ప్రయోజనంతో రైడర్లకు పండగే..  ఫీచర్లు మాత్రం నెక్స్ట్ లెవల్!

బజాజ్ ఎన్ఎస్400జెడ్ బైక్ ధర గణనీయంగా తగ్గింది. 18 శాతం జీఎస్టీ ప్రయోజనం వల్ల ఈ 40 హెచ్‌పీ పవర్ కలిగిన మోటార్ సైకిల్ ఇప్పుడు దేశంలోనే అత్యంత చౌకైన హై పర్ఫార్మెన్స్ బైక్ గా మారింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • బజాజ్ NS400Z బైక్ ధర రూ.1.80 లక్షలకు తగ్గింది.
  • 18% GST ప్రయోజనంతో కస్టమర్లకు రూ.24,500 ఆదా.
  • 4 రైడ్ మోడ్స్, క్విక్ షిఫ్టర్, ABS వంటి అత్యాధునిక ఫీచర్లు.
  • సామాన్యులకు హై-పెర్ఫార్మెన్స్ బైకులను అందుబాటులోకి తేవడమే లక్ష్యం.

Bajaj Pulsar NS400Z Price Slashed Due to 18 Percent GST Benefits:జాజ్ ఆటో తన శక్తివంతమైన ఎన్ఎస్400జెడ్ (NS400Z) మోటార్ సైకిల్ విషయంలో ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ బైక్ ధరను భారీగా తగ్గిస్తూ వాహనదారులకు తీపి కబురు అందించింది. ప్రస్తుతం ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర (ఢిల్లీ) రూ. 1.80 లక్షలకు చేరుకుంది. ఈ ధర తగ్గింపు వెనుక ప్రధాన కారణం జీఎస్టీ (GST) నిబంధనలే. ఈ మోటార్ సైకిల్ పై 18 శాతం జీఎస్టీ మాత్రమే వర్తించడం వల్ల కంపెనీ ఈ భారీ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేసింది. దీనివల్ల 40 హెచ్‌పీ (HP) పవర్ కేటగిరీలో దేశంలోనే అత్యంత సరసమైన ధర కలిగిన బైక్ గా ఇది సరికొత్త రికార్డు సృష్టించింది. తక్కువ ధరలో ఎక్కువ పవర్ కోరుకునే యువతకు ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి.

కస్టమర్లకు రూ. 24,500 వరకు ఆదా..

ఈ ధర తగ్గింపు వల్ల కొనుగోలుదారులకు భారీగా డబ్బు ఆదా అవుతుంది. ఎక్స్-షోరూమ్ ధర తగ్గడంతో పాటు, ఇన్సూరెన్స్ ప్రీమియం అలాగే రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా తగ్గుతాయి. వెరసి ఒక కస్టమర్ దాదాపు రూ. 24,500 వరకు ఆదా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. 349 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ తో వచ్చే ఈ బైక్, టన్నుకు 247 హెచ్‌పీ పవర్ టు వెయిట్ రేషియోను అందిస్తుంది. అంటే రైడర్లకు ఒక థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ గ్యారంటీ. పర్ఫార్మెన్స్ విషయంలో రాజీ పడకుండా తక్కువ ఖర్చుతో బైక్ కొనాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్.

Also Read: పల్సర్ 180 కమ్‌బ్యాక్ – క్లాసిక్ లుక్, మోడర్న్ టెక్నాలజీతో బజాజ్ కొత్త మాస్టర్ ప్లాన్!

ఫీచర్ల సునామీ..

ఎన్ఎస్400జెడ్ కేవలం పవర్ లోనే కాదు, ఫీచర్ల లోనూ ఈ సెగ్మెంట్ లో రారాజుగా నిలుస్తోంది. ఇందులో రైడర్ల కోసం 4 రకాల రైడ్ మోడ్స్ ఉన్నాయి. స్మూత్ గా గేర్లు మార్చడానికి క్విక్ షిఫ్టర్, భద్రత కోసం ట్రాక్షన్ కంట్రోల్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ (ABS) వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు జోడించారు. మెరుగైన గ్రిప్ కోసం రేడియల్ టైర్లు, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ కోసం బ్లూటూత్ కన్సోల్ వంటివి రైడింగ్ అనుభవాన్ని మరో స్థాయికి తీసుకెళ్తాయి. అగ్రెసివ్ లుక్ తో పాటు షార్ప్ హ్యాండ్లింగ్ ఉండటం వల్ల సిటీ ట్రాఫిక్ లోనూ, లాంగ్ రైడ్స్ లోనూ ఈ బైక్ చాలా కంఫర్ట్ గా ఉంటుంది.

Also Read: సేఫ్టీ ఫస్ట్ - డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ఉన్న చౌకైన బైకుల లిస్ట్ ఇదే!

డెమొక్రటైజింగ్ పర్ఫార్మెన్స్..

బజాజ్ ఆటో మోటార్ సైకిల్స్ బిజినెస్ ప్రెసిడెంట్ సారంగ్ కనాడే ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. బజాజ్ పల్సర్ సిరీస్ ఎప్పుడూ అందుబాటులో ఉండే పర్ఫార్మెన్స్ కు మారుపేరుగా ఉంటుందని, 18 శాతం జీఎస్టీ అడ్వాంటేజ్ తో కస్టమర్ల యాజమాన్య ఖర్చును తగ్గించడం తమకు సంతోషంగా ఉందని అన్నారు. దీనివల్ల ఎక్కువ మంది రైడర్లు హై పర్ఫార్మెన్స్ బైకులను సొంతం చేసుకోగలుగుతారని, పల్సర్ బ్రాండ్ ను మరింత మందికి చేరువ చేయడమే తమ లక్ష్యమని ఆయన వివరించారు.

Also Read: 180 సీసీ సెగ్మెంట్‌లో మళ్ళీ మొదలైన పోరు - పల్సర్ రీ-ఎంట్రీతో అపాచీకి చెక్!

ఇండియ‌న్ మార్కెట్లో స్పోర్ట్స్ బైకుల విభాగాన్ని సామాన్యులకు సైతం చేరువ చేయాలనే బజాజ్ వ్యూహం ఈ ధర తగ్గింపుతో స్పష్టమవుతోంది. స్టైల్, పవర్, లేటెస్ట్ టెక్నాలజీతో పాటు ఇప్పుడు తక్కువ ధర కూడా తోడవడంతో ఎన్ఎస్400జెడ్ తన ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. బడ్జెట్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ బైక్ కోసం వెయిట్ చేసే రైడర్లకు ఇదొక గుడ్ న్యూస్.

Frequently Asked Questions

బజాజ్ పల్సర్ NS400Z ధర ఎందుకు తగ్గింది?

మోటార్ సైకిల్ పై 18 శాతం జీఎస్టీ మాత్రమే వర్తించడం వల్ల కంపెనీ ధర తగ్గింపు ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేసింది.

ధర తగ్గింపు వల్ల కస్టమర్లకు ఎంత ఆదా అవుతుంది?

ఎక్స్-షోరూమ్ ధరతో పాటు ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా తగ్గుతాయి, దీనివల్ల కస్టమర్లు దాదాపు రూ. 24,500 వరకు ఆదా చేసుకోవచ్చు.

బజాజ్ పల్సర్ NS400Z ఇంజిన్ మరియు పవర్ వివరాలు ఏమిటి?

ఈ బైక్ 349 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ తో వస్తుంది మరియు 40 HP పవర్ కేటగిరీలో అత్యంత సరసమైన బైక్ గా నిలుస్తుంది.

బజాజ్ పల్సర్ NS400Z లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి?

ఇందులో 4 రైడ్ మోడ్స్, క్విక్ షిఫ్టర్, ట్రాక్షన్ కంట్రోల్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, బ్లూటూత్ కన్సోల్ వంటి అడ్వాన్స్డ్ ఫీచర్లు ఉన్నాయి.

టాప్ హెడ్ లైన్స్

BS6 కార్ల యజమానులకు భారీ ఊరట.. కాలుష్య ధ్రువీకరణ గడువు మూడేళ్లకు పెంచనున్న కేంద్రం!
కార్ ఓనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఇక మూడేళ్లకు ఒకసారి 'పొల్యూషన్‌ సర్టిఫికెట్‌!'
E20 పెట్రోల్‌ను దేశమంతా అందుబాటులోకి తెచ్చినా.. అనుకూల వాహనాలపై కేంద్రం వద్దే డేటానే లేదట!
హవ్వ.. దేశంలో ఎన్ని E20 వాహనాలున్నాయో సర్కారుకే తెలియదట - షాకింగ్ న్యూస్‌
EVలకు తగ్గని డిమాండ్ - జులైలో 32 వేలకుపైగా అమ్మకాలు, ఏ కంపెనీ ఎన్ని కార్లను విక్రయించిందంటే..?
జులైలోనూ జోరు తగ్గని ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు.. జనం ఏ కంపెనీ కార్లను ఎక్కువగా కొన్నారంటే..?
వర్షంలోనే టూవీలర్‌ నడుపుతున్నారా..? ఈ తప్పులు చేస్తే మీ బండి మధ్య రోడ్డులోనే ఆగిపోవచ్చు!
వర్షంలో తడిచిన టూవీలర్‌ స్టార్ట్ కావట్లేదా? వీటిని ఒకసారి చెక్‌ చేయండి, ప్రోబ్లెం సాల్వ్‌!

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Uravakonda latest News: ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
Auqib Nabi Selection: జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
Eesha Rebba : గోల్డ్ కలర్ డ్రెస్‌లో అందాల ఈషా - సరస్సు ఒడ్డున దేవకన్యలా...
గోల్డ్ కలర్ డ్రెస్‌లో అందాల ఈషా - సరస్సు ఒడ్డున దేవకన్యలా...
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
CWG India Analysis: గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
Embed widget