Bajaj : స్పెషల్ ఎడిషన్ లో బజాజ్ చేతక్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్.. అమెజాన్ లో కొంటే భారీ డిస్కౌంట్
Bajaj Chetak 3201 Special Edition Launch బజాజ్ చేతక్ సరికొత్త స్పెషల్ ఎడిషన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని బజాజ్ ఆటో లాంచ్ చేసింది. రూ .1.30 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరతో దీనిని కొనుగోలు చేయవచ్చు.
Bajaj Chetak 3201 Special Edition Launched: బజాజ్ ఆటో తన కొత్త చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ మోడల్‌కు చేతక్ 3201 అని పేరు పెట్టారు. వినియోగదారులు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అమెజాన్‌లో కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోల్చితే, ఇది కొన్ని ప్రత్యేక మార్పులతో మార్కెట్‌లోకి వచ్చింది.
ఈ చేతక్ 3201 స్పెషల్ ఎడిషన్‌ను ఇప్పుడు అధికారికంగా విడుదల చేశారు. ప్రస్తుతం చేతక్ స్కూటర్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి అర్బన్, ప్రీమియం అనే వేరియంట్లుగా ఉన్నాయి. కొత్త చేతక్ 3201 వీటికంటే ప్రీమియం స్కూటర్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం దీని ప్రారంభ ధరను రూ .1.30 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఈ స్కూటర్‌లో చేసిన మార్పులు ఇందులో కొత్తగా చేర్చిన ఫీచర్లు తదితర విషయాలు ఈ కథనంలో..
చేతక్ 3201 ఫీచర్లు
ఈ కొత్త స్పెషల్ ఎడిషన్ ప్రీమియం వేరియంట్ కావడంతో, సాధారణ చేతక్‌ల కంటే ఎక్కువ ఫీచర్లతో వస్తుంది. సైడ్ ప్యానెల్స్‌లో 'చేతక్' అనే పేరు ఉంది. ఇది కేవలం బ్రూక్లిన్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. స్కూటర్ చుట్టూ స్టీల్ కోటింగ్‌తో కూడిన స్కఫ్ ప్లేట్లు ఉన్నాయి. ఇది స్కూటర్‌కి అదనపు లుక్‌ని అందిస్తుంది. ఈ స్పెషన్ ఎడిషన్ సీటుని రెండు కలర్ ఆప్షన్‌లలో అందించారు. చేతక్ ప్రీమియం వేరియంట్ మాదిరిగానే, ఈ కొత్త స్పెషల్ ఎడిషన్ కూడా TFT డిస్ప్లేను కలిగి ఉంది. ఇందులో నావిగేషన్, మొబైల్ ఫోన్ మ్యూజిక్ కంట్రోల్స్, ఫోన్ కాల్ అలర్ట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కస్టమర్లు తమకు నచ్చిన థీమ్ ఆప్షన్లను మార్చుకోవచ్చు.
బ్యాటరీ & రేంజ్
కొత్త చేతక్ 3201 స్పెషల్ ఎడిషన్ స్కూటర్ 3.2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఇది గంటకు 73 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. ఈ మోడల్ 136 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది. ఇది ప్రీమియం వేరియంట్ ఇచ్చే 127 కి.మీ రేంజ్ కంటే 9 కి.మీ ఎక్కువ కావడం గమనార్హం.ఈ స్కూటర్‌లో చేతక్ అందించే టెక్‌ప్యాక్ సాఫ్ట్‌వేర్ ప్యాకేజీని అందించారు. ఇది స్పోర్ట్ రైడ్ మోడ్, హిల్ హోల్డ్ కంట్రోల్ వంటి ఆప్షన్లు కలిగి ఉంటుంది.
ధర & పోటీ
ప్రస్తుతం ఈ స్కూటర్ ప్రారంభ ఆఫర్ కింద రూ .1.30 లక్షలకు మాత్రమే అందుబాటులో ఉంది. అయితే తర్వాత రూ .10,000 పెంచి రూ .1.40 లక్షలుగా విక్రయించనున్నారు. ఈ ఆఫర్ ముగిసిన తర్వాత ధరను పెంచనున్నట్లు కంపెనీ ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే ప్రస్తుత ఆఫర్ ఎన్ని రోజులు కొనసాగుతుందో వెల్లడించలేదు. ఇక ఈ బజాజ్ చేతక్ 3201 ఎలక్ట్రిక్ స్కూటర్ రిజ్టా జెడ్, ఓలా ఎస్ 1 ప్రో, టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ వంటి వాటికి గట్టి పోటీ ఇస్తుంది. రిజ్టా జెడ్ ధర రూ .1.45 లక్షలు, ఎస్1 ప్రో ధర రూ .1.34 లక్షలు, ఐక్యూబ్ ఎస్ ధర రూ .1.46 లక్షలుగా ఉన్నాయి. ఇవి అన్ని (ఎక్స్-షోరూమ్) ధరలు. అమెజాన్‌లో ఈ స్కూటర్‌ని కొనుగోలు చేస్తే ఎక్కువ డిస్కౌంట్ లభించనుంది.
Also Read: మరింత కొత్తగా వస్తున్న మహీంద్రా థార్.. ఆగస్టు 15 కోసం అభిమానుల ఎదురుచూపులు
Also Read: ఆఫర్ అంటే ఇదీ! ఫేమస్ ఎలక్ట్రిక్ బైక్‌పై ఏకంగా రూ. 25 వేలు డిస్కౌంట్