అన్వేషించండి

EV Bikes Offer: ఆఫర్‌ అంటే ఇదీ! ఫేమస్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌పై ఏకంగా రూ. 25 వేలు డిస్కౌంట్‌

Oben Electric: ఒబెన్‌ ఎలక్ట్రిక్‌ రోర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌పై ఫ్రీడమ్‌ ఆఫర్‌ కింద డిస్కౌంట్‌ని అందిస్తుంది. ‘ఫ్రీడమ్ ఆఫర్’ కింద రూ. 1,24,999లకే ఈ బైక్‌ని సొంతం చేసుకోవచ్చు.

Oben Rorr Electric 'Freedom Offer': ఆగస్టు 15న భారతదేశ 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలో పనిచేస్తున్న పలు ఆటోమొబైల్ కంపెనీలు ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. వాటిలో ఒబెన్ ఎలక్ట్రిక్ (Oben Electric) కూడా తన ప్రముఖ ఎలక్ట్రిక్ బైక్ మోడల్ ఒబెన్ రోర్‌పై (Oben Rorr) ప్రత్యేక ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఈ బైక్‌ను ఇప్పుడు రూ.25000 తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు. రూ. 1,49,999 (ఎక్స్‌-షోరూమ్‌)గా ఉన్న ఈ ఎలక్ట్రిక్‌ బైక్‌ని ‘ఫ్రీడమ్ ఆఫర్’ కింద రూ. 1,24,999 (ఎక్స్‌-షోరూమ్‌) లకే ఇంటికి తీసుకెళ్లవచ్చు.  

ఈ ఆఫర్ ఆగస్టు 15 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ మధ్య కాలంలో షోరూమ్‌లలో చేసే కొనుగోళ్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా, భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. అయితే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు అధిక సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రిక్‌ బైక్స్‌ సంఖ్య తక్కువే అని చెప్పాలి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బెస్ట్ ఎలక్ట్రిక్‌ బైక్స్‌లో ఒబెన్ ఎలక్ట్రిక్ నుంచి రోర్ ఎలక్ట్రిక్ బైక్‌ కూడా ఉంది. దీనిని ఆ సంస్థ మార్చి 2022లో విడుదల చేసింది. 


బ్యాటరీ & ఛార్జింగ్

రోర్ ఇ-బైక్ 4.4 kW బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. దీనిని పూర్తిగా ఛార్జ్ చేయడానికి కేవలం రెండు గంటల సమయం పడుతుంది. దీనిలోని 8 kW IBMSM మోటారు సహాయంతో గంటకు 100 km వేగాన్ని అందుకోగలదు. అంతే కాకుండా ఈ బైక్‌ కేవలం మూడు సెకన్లలో గంటకు 0 నుంచి 40 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. ఈ బైక్‌ పూర్తి ఛార్జింగ్‌తో 187 కి.మీ వరకు (Range) ప్రయాణించగలదు.

ఇక ఈ ఒబెన్ రోర్ ఎలక్ట్రిక్ బైక్ అనేక ఫీచర్లను కలిగి ఉంది. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌లో బైక్‌కి సంబంధించిన వివరాలు డిస్ప్లే అవుతాయి. ఇక ఈ బైక్ రౌండ్‌ LED హెడ్‌ల్యాంప్స్‌, LED డేటైమ్ రన్నింగ్ లైట్లు, LED టర్న్ ఇండికేటర్‌లు ఉన్నాయి. భారతీయ మార్కెట్‌లో ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. జనాలు ఎలక్ట్రిక్‌ బైక్స్‌ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. అయినా కానీ ఒబెన్ ఎలక్ట్రిక్ అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్‌ బైక్స్‌కి గట్టి పోటీని ఇస్తుంది.

తక్కువ షోరూమ్స్‌
ప్రస్తుతం, ఒబెన్ ఎలక్ట్రిక్ భారతదేశంలో బెంగళూరు, ఢిల్లీ, కొచ్చి, తిరువనంతపురం మిగతా పేరొందిన నగరాల్లో కేవలం ఎనిమిది షోరూమ్‌లను మాత్రమే కలిగి ఉంది. ఇది కంపెనీ సేల్స్‌కి మైనస్‌ అని చెప్పాలి. ఇక తమ మార్కెట్ ఉనికిని మరింత విస్తరించేందుకు ఈ ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా 50 కొత్త షోరూమ్‌లను ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది.

స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్లతో పాటు, రాబోయే పండుగ సీజన్ కోసం ఆటోమొబైల్ కంపెనీలు సేల్స్‌ పెంచుకునేందుకు భారీ డిస్కౌంట్లు, ఆఫర్లను ప్రకటిస్తాయి. చాలా కంపెనీలు ఇప్పటికే వివిధ రకాల ఆఫర్‌లను ప్రకటించడం ప్రారంభించాయి. ఇక ఒబెన్‌ ఎలక్ట్రిక్‌ ప్రకటించిన ఈ ప్రత్యేక ఆఫర్ కంపెనీ సేల్స్‌ని గణనీయంగా పెంచుతుందని భావిస్తుంది. డిమాండ్‌ని బట్టి ఈ ఆఫర్‌ని పొడిగించే అవకాశం కూడా ఉంటుంది. దీనిపై కంపెనీ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్రట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Hyderabad News: భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
Royal Enfield Flying Flea C6: మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
Pawan Kalyan: ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
Lucky Car: 1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
Embed widget