అన్వేషించండి

Bajaj Chetak 2026 Price: ఒకసారి ఛార్జ్ చేస్తే 153 కిలోమీటర్లు ఆగాల్సిన పని లేదు! బజాజ్‌ చేతక్‌ ఈవీ పూర్తి వివరాలు ఇవే!

Bajaj Chetak 2026 Price: నాడు భారతీయ రోడ్లను ఏలిన బజాజ్‌ చేతక్‌ అప్‌డేట్‌ వెర్షన్‌తో వచ్చింది. కొత్తగా ఎలక్ట్రిక్‌ మోడ్‌లో వచ్చింది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • బజాజ్ చేతక్ 2026 సరికొత్త ఎలక్ట్రిక్ అవతార్‌లో విడుదలైంది.
  • దృఢమైన మెటల్ బాడీ, మెరుగైన వేగం, రేంజ్ కలిగి ఉంది.
  • 153 కి.మీ. రేంజ్, స్మార్ట్ టెక్ ఫీచర్లు ఆకర్షణీయం.

Bajaj Chetak 2026 Price: ఒకప్పుడు భారతీయ మధ్యతరగతి కుటుంబాలకు చేతక్‌ అంటే కేవలం ఒక స్కూటర్ మాత్రమే కాదు, అదొక సెంటిమెంట్‌. కాలక్రమేణా మాయమైనా ఇప్పుడు ఎలక్ట్రిక్ అవతార్‌లో సరికొత్త హంగులతో మళ్లీ రోడ్లపై హల్చల్ చేస్తోంది. బజాజ్‌ ఆటో తన ఐకానిక్‌ బ్రాండ్‌ను 2026 వెర్షన్‌లో మరింత పవర్‌ఫుల్‌గా, అత్యాధునిక ఫీచర్లతో లాంచ్ చేసింది. మీరు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ అప్‌డేటెడ్‌ బజాజ్‌ చేతక్‌ 2026 గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. 

కేవలం స్టైల్‌‌ మాత్రమే కాదు. పెర్ఫార్మెన్స్‌లోనూ ఈసారి బజాజ్‌ తగ్గేదేలే అంటోంది. గత మోడల్స్‌తో పోలిస్తే ఇప్పుడు టాప్‌ స్పీడ్, రేంజ్ పెరగడం ఆకట్టుకునే అంశం. ఓలా, ఏథ్ వంటి దిగ్గజాలకు గట్టి పోటీనిస్తూ, ప్రీమియం మెట్ బాడీతో వస్తున్న ఈ స్కూటర్ ఈచర్లు మీ మైండ్‌ బ్లాక్ చేయడం ఖాయం. 

మెటల్ బాడీతో అదిరిపోయే లుక్‌

బజాజ్‌ చేతక్ అనగానే మనకు గుర్చొచ్చేది దాని దృఢమైన మెటల్‌ బాడీ. నేటి కాలంలో వస్తున్న ప్లాస్టిక్ స్కూటర్‌కు భిన్నంగా చేతక్ క్లాసిక్‌ రెట్రో లుక్‌, నియో- రెట్రో డిజైన్‌తో వస్తుంది. 2026 మోడల్‌లో ఇండిగో బ్లూ, బ్రూక్లిన్‌ బ్లాక్, పిస్తా గ్రీన్ వంటి ఆకర్షణీయమైన కలర్స్‌లో ఇది అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఇందులో ఉన్న ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్ రింగ్, మెటాలిక్‌ ఫినిషింగ్ దీనికి ప్రీమియం ఫీల్‌ను ఇస్తాయి. 

సాధారణంగా ఎలక్ట్రిక్ స్కూటర్లంటే స్పీడ్ ఉండదని చాలా మంది ఫీలవుతుంటారు. కానీ అప్‌డేట్‌ చేతక్ ఆ అపోహను చెరిపేస్తోంది. ప్లాగ్‌షిప్‌ మోడల్స్ అయిన C3501, C3502 ఇప్పుడు 80 kmph వేగంతో దూసుకపోగలవు. 305kWh బ్యాటరీ సామర్థ్యం ఉన్న వేరియంట్లు సింగిల్‌ ఛార్జ్‌పై 153 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తాయి. కేవలం 2 గంటల 55 నిమిషాల్లోనే 0-80 శాతం ఛార్జింగ్ పూర్తి అవుతుంది. 

స్మార్ట్ ఫోన్ లాంటి స్కూటర్ 

కొత్త చేతక్ కేవలం వాహనం మాత్రమే కాదు. ఒక గ్యాడ్జెట్‌ లాంటిది. ఇందులో 5-ఇంచ్‌లా టీఎఫ్‌టీ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఉంది. మీరు టెక్ ప్యాక్ ఆప్షన్ ఎంచుకుంటే ఇందులో గూగుల్ మ్యాప్‌ నావిగేషన్, కాల్స్, ఎస్‌ఎంఎస్‌ అలర్ట్స్‌, మ్యూజిక్‌ కంట్రోల్‌ వంటి ఫీచర్లు పొందవచ్చు. అంతేకాదు, ట్రాఫిక్‌లో ఉపయోగపడే హిల్‌ హోల్డ్‌ అసిస్టెంట్‌, పెర్ఫార్మెన్స్‌ కోసం స్పోర్ట్స్‌ ఎకో మోడ్స్‌ ఇందులో వస్తున్నాయి. 

వేరియంట్స్‌- స్పెసిఫికేషన్స్‌

మోడల్‌ 

బ్యాటరీ

రేంజ్‌ 

టాప్ స్పీడ్‌ 

ధర 

చేతక్‌ C3501  3.5kWh  153 KM  80kmph  రూ. 1,47,507
చేతక్‌ C3502  3.5kWh  153 KM  80kmph  1,35,306  

చేతక్‌ C3503 

3.5kWh  151 KM  70kmph  1,21,807
చేతక్‌ C3001  3.0kWh  127 KM  70kmph  1,11,006

చేతక్‌ C2501 

2.5kWh  113 KM  60kmph  1,35,306

మీరు స్మార్ట్‌ ఫీచర్లు , గూగుల్‌ మ్యాప్స్‌ నావిగేషన్ కావాలనుకుంటే, అదనంగా 9వేలు చెల్లించి టెక్‌ప్యాక్‌ తీసుకోవడం మర్చిపోవద్దు. ఇది మీ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను పూర్తిగా మార్చేస్తుంది. 

Frequently Asked Questions

బజాజ్ చేతక్ 2026 మోడల్ ప్రధాన ప్రత్యేకతలు ఏమిటి?

ఇది పాత మోడల్స్‌తో పోలిస్తే పెరిగిన టాప్ స్పీడ్, రేంజ్ కలిగి ఉంది. దృఢమైన మెటల్ బాడీ, అధునాతన స్మార్ట్ ఫీచర్లతో వస్తుంది.

కొత్త చేతక్ స్కూటర్ ఎంత వేగంగా వెళ్ళగలదు మరియు దాని రేంజ్ ఎంత?

C3501, C3502 మోడల్స్ 80 kmph వేగంతో వెళ్ళగలవు. 3.5kWh బ్యాటరీ ఉన్న వేరియంట్లు ఒకే ఛార్జ్‌పై 153 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తాయి.

బజాజ్ చేతక్ 2026 స్కూటర్‌ను ఛార్జ్ చేయడానికి ఎంత సమయం పడుతుంది?

కొత్త చేతక్ 3.5kWh బ్యాటరీ వేరియంట్లు కేవలం 2 గంటల 55 నిమిషాల్లో 0-80 శాతం వరకు ఛార్జ్ అవుతాయి.

చేతక్ 2026లో ఏయే స్మార్ట్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి?

5-అంగుళాల TFT టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో పాటు గూగుల్ మ్యాప్స్ నావిగేషన్, కాల్స్, SMS అలర్ట్స్, మ్యూజిక్ కంట్రోల్ వంటివి టెక్ ప్యాక్ ద్వారా పొందవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
PM Modi Chennai Tour: సీఎం విజయ్‌తో కలిసి చెన్నై మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణం- రూ.13 వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం!
సీఎం విజయ్‌తో కలిసి చెన్నై మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణం- రూ.13 వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం!
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
Embed widget