అన్వేషించండి

Bajaj Chetak 2026: కొత్త అవతార్‌లో బజాజ్‌ చేతక్‌ ఎలక్ట్రిక్ స్కూటర్! ఫీచర్లు, రేంజ్‌, ధరల వివరాలు ఇవే

Bajaj Chetak 2026: బజాజ్‌ చేతక్‌ 2026 నుంచి మరింత శక్తిమంతమైన స్కూటర్ వచ్చింది. ఐదు వేరియంట్లలో లభిస్తున్న ఈ స్కూటర్ గరిష్టంగా 153 కిలోమీటర్ల రేంజ్ కలిగి ఉంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త వేగంతో, దూరం, సాంకేతికతతో వచ్చింది.
  • ఐదు వేరియంట్లలో 153 కి.మీ. రేంజ్; ప్రారంభ ధర రూ. 1.11 లక్షలు.
  • 5-అంగుళాల TFT డిస్‌ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్, సులభ ఫైనాన్స్‌ అందుబాటులో.

Bajaj Chetak 2026: దేశంలో అత్యంత ఐకానిక్ స్కూటర్ బ్రాండ్‌ చేతక్ ఇప్పుడు ఎలక్ట్రిక్ రూపంలో తన సత్తాను చాటుకుంటోంది. సరికొత్త రికార్డులు సృష్టించేందుకు డిజిటల్ యుగంలో కూడా తన స్థానాన్ని పదిలం చేసేందుకు లేటెస్ట్ అప్‌గ్రేడ్‌తో ఈవీని తీసుకొచ్చింది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వేగం, దూరం, టెక్నాలజీ మిక్స్ చేసి చేతక్‌  C3501 పేరుతో మార్కెట్‌లోకి వచ్చింది. 

నేటి తరం వాహదారులు కేవలం ప్రయాణం కోసం మాత్రమే కాకుండా, నాణ్యత, నమ్మకాన్ని ఆశిస్తున్నారు. ప్లాస్టిక్ బాడీ కలిగిన ఇతర స్కూటర్ల కంటే చేతక్‌ మెటల్ బాడీ వారిని ఆకట్టుకోనుంది. 

పెట్రోల్ ధరలు పెరుగుతున్న తరుణంలో రోజుకు 30 కిలోమీటర్లు ప్రయాణించే వారికి నెలకు కేవలం 472 ఖర్చుతో ది ప్రత్యామ్నాయంగా మారనుంది. బజాజ్‌ ఇప్పుడు చేతక్‌ ఐదు ప్రధాన వేరియంట్లలో అందిస్తోంది.  C3501, C3502,  C3503, C2501 మోడల్స్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. వీటిలో టాప్‌ ఎండ్‌  C3501 బైక్ గరిష్టంగా 153 కిలోమీటర్ల రేంజ్‌, 80 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతోంది. ఇది ప్రీమియం అనుభూతి ఇస్తుంది. 

బేస్‌ మోడల్‌ C3001 ధర 1,11,006గా ఉంది. ఫీచర్లు పెరిగే కొద్దీ ధర 1,47,507 వరకు మారుతుంది. మీ బడ్జెట్, అవసరాలకు తగినట్టుగా ఈ వేరియంట్‌లో ఏదైనా ఒకదానిని ఎంచుకునే వీలును బజాజ్ కల్పించింది. 

టెక్నాలజీలో బారీ మార్పులు 

కొత్త చేతక్‌లో 5 అంగుళాల కలర్‌ టీఎఫ్‌టీ డిస్‌ప్లే ప్రధాన ఆకర్షణ. దీని ద్వారా మీరు ప్రయాణంలో కాల్ అలర్ట్స్, మ్యూజిక్ కంట్రోల్‌ చేయవచ్చు. టెక్‌ప్యాక్‌ యాడ్ ఆన్‌ ద్వారా గూగుల్‌ మ్యాప్స్‌ నావిగేషన్, హిల్-హోల్డ్‌ అసిస్ట్‌, స్పోర్ట్ మోడల్‌ను పొందవచ్చు. 

ఛార్జింగ్‌- రేంజ్

C3501మోడ్‌ 3 గంటల్లోనే 0-80 శాతం ఛార్జ్ అవుతుంది. ఇంటి దగ్గరే సులభంగా చార్జ్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. సాధారణ సిటీ ట్రాఫిక్‌లో ఇది 120 నుంచి 140 కిలోమీటర్ల వరకు వాస్తవ రేంజ్ ఇస్తుందని వినియోగదారులు పేర్కొంటున్నారు. 

చేతక్‌ కొనుగోలును సులభతరం చేసేందుకు బజాజ్ ఆకర్షణీయమైన ఫైనాన్స్‌ ఆఫర్లను అందిస్తోంది. ప్రారంభ డౌన్‌ పేమెంట్‌ కేవలం రూ. 10,000 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. 9 శాతం వడ్డీ రేటుతో 36 నెలల కాలపరిమితికి నెలకు సుమారు 3,347ఈఎంఐతో ఈ స్కూటర్‌ మీ సొంతం చేసుకోవచ్చు. మీరు మీ క్రెడిట్ స్కోర్‌ను బట్టి 90 శాతం వరకు లోన్ పొందే ఛాన్స్ ఉంటుంది. డీలర్ల వద్ద దీనిపై సమగ్ర సమాచారం ఉంటుంది. 

చేతక్‌ సీటు 775 ఎంఎం ఎత్తులో ఉంటుంది. దీని వల్ల తక్కువ ఎత్తు ఉన్న వారు కూడా సులభంగా డ్రైవ్ చేయవచ్చు. స్కూటర్ కింద ఉన్న 35 లీటర్ల స్టోరేజ్ స్పేస్‌ హెల్మెట్‌ లేదా ఇతర వస్తువులను భద్రపరుచుకోవడానికి వీలుగా ఉంటుంది. 

ప్రస్తుతం చేతక్‌ ఏథర్‌ 450ఎక్స్‌,టీవీఎస్‌ ఐక్యూబ్  ఓలా ఎస్‌1ప్రో వంటి స్కూటర్లతో పోటీ పడుతుంది.అయితే దాని మెటల్ బాడీ, క్లాసిక్‌ డిజైన్ దానిని మిగతా కంటే భిన్నంగా ఉంటుంది. చాలా మంది వినియోగదారులు దీనిని స్మూత్ రైటింగ్, సర్వీస్‌ సెంటర్ల లభ్యత పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హిల్‌ ఏరియాల్లో కూడా దీని డైరెక్ట్‌ డైరెక్ట్‌ డ్రైవ్‌ మోటార్‌ అద్భుతమైన పనితీరును కనబరుస్తుందని రైడర్లు చెబుతున్నారు. 

Frequently Asked Questions

కొత్త చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రధాన లక్షణం ఏమిటి?

చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ మెటల్ బాడీతో, నాణ్యత, నమ్మకంతో పాటు ఆధునిక టెక్నాలజీతో వస్తుంది. ఇది పెట్రోల్ స్కూటర్లకు ప్రత్యామ్నాయంగా ఉంటుంది.

చేతక్ C3501 మోడల్ ఎంత దూరం ప్రయాణించగలదు మరియు దాని గరిష్ట వేగం ఎంత?

C3501 మోడల్ గరిష్టంగా 153 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్లు.

చేతక్ C3501 మోడల్ ఎంత సమయంలో ఛార్జ్ అవుతుంది?

C3501 మోడల్ 0-80 శాతం ఛార్జ్ అవ్వడానికి 3 గంటలు పడుతుంది. దీనిని ఇంటి దగ్గరే సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు.

చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో నెలవారీ ఖర్చు ఎంత తగ్గించుకోవచ్చు?

రోజుకు 30 కిలోమీటర్లు ప్రయాణించే వారికి, చేతక్ నెలకు కేవలం 472 రూపాయల ఖర్చుతో ప్రత్యామ్నాయంగా ఉంటుంది. ఇది పెట్రోల్ ధరల పెరుగుదల నుండి ఉపశమనం ఇస్తుంది.

చేతక్ కొనుగోలుకు అందుబాటులో ఉన్న ఫైనాన్స్ ఆఫర్లు ఏమిటి?

చేతక్ కొనుగోలుకు రూ. 10,000 డౌన్ పేమెంట్ నుంచి ప్రారంభమయ్యే ఫైనాన్స్ ఆఫర్లు ఉన్నాయి. 9% వడ్డీ రేటుతో 36 నెలల కాలానికి నెలకు రూ. 3,347 ఈఎంఐ ఉంటుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Brezza vs Venue EMI Comparison: Brezza vs Venue EMIల మధ్య తేడా ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి!
Brezza vs Venue EMIల మధ్య తేడా ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి!
Safest Cars Of India: ఇండియాలో 15 అత్యంత సురక్షితమైన కార్లు ఇవే! బెస్ట్‌ రేటింగ్ పొందినవి ఏవో చూడండి!
ఇండియాలో 15 అత్యంత సురక్షితమైన కార్లు ఇవే! బెస్ట్‌ రేటింగ్ పొందినవి ఏవో చూడండి!
Hybrid SUV: 1000 కిలోమీటర్ల రేంజ్‌, మంచి మైలేజీతో వస్తున్న 4 హైబ్రిడ్ SUVలు! 
1000 కిలోమీటర్ల రేంజ్‌, మంచి మైలేజీతో వస్తున్న 4 హైబ్రిడ్ SUVలు! 
Car Coolant: కారులో కూలెంట్ అయిపోతే ఏం చేయాలి? లేకుంటే జరిగే నష్టమేంటి?
కారులో కూలెంట్ అయిపోతే ఏం చేయాలి? లేకుంటే జరిగే నష్టమేంటి?
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
Telugu Movies OTT : ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
Brezza vs Venue EMI Comparison: Brezza vs Venue EMIల మధ్య తేడా ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి!
Brezza vs Venue EMIల మధ్య తేడా ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి!
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Embed widget