అన్వేషించండి

Bajaj vs Ola EV Comparison 2026: బజాజ్‌ చేతక్‌ 3001 vs ఓలా ఎస్‌1ఎక్స్‌: మధ్యతరగతి ఫ్యామిలీకి ఎలక్ట్రిక్ స్కూటర్ బెస్ట్!

Bajaj vs Ola EV Comparison 2026: బజాజ్‌ చేతక్‌ 3001, ఓలా ఎస్‌1ఎక్స్‌ మధ్య ఏది మొనగాడు. ధర రేంజ్, ఫీచర్లు, పెర్ఫార్మెన్స్‌ పరంగా పూర్తి స్థాయి విశ్లేషణ చూద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఓలా S1X 3kWh ధర తక్కువ, బజాజ్ చేతక్ ఖరీదైనది.
  • ఓలా S1X అధిక వేగం, రేంజ్; చేతక్ వేగంగా చార్జ్.
  • చేతక్ రెట్రో డిజైన్, ఓలాకు క్రూయిజ్ కంట్రోల్ ప్రత్యేకతలు.
  • తక్కువ ధర, వేగానికి ఓలా; వేగవంతమైన ఛార్జింగ్‌కు బజాజ్ చేతక్.

Bajaj vs Ola EV Comparison 2026: భారత్‌లో ఎలక్ట్రిక్‌ విప్లవం వేగంగా పుంజుకుంటోంది. పెట్రోల్ ధరల సెగ నుంచి తప్పించుకోవడానికి సామాన్యులు ఇప్పుడు ఈవీలవైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా బజాబ్‌ చేతక్‌ 3001, ఓలా ఎస్‌1ఎక్స్‌ 3kWh మోడళ్లు మార్కెట్‌లో హాట్‌టాపిక్‌గా మారాయి. ఈ రెండు స్కూటర్లలో ఏది మీ ఇంటికి రావాలి. ఏది మీ జేబులో డబ్బులు మిగులుస్తుంది. ఈ స్టోరీ ప్రతి అంశాన్ని చర్చిద్దాం. 

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారు మొదట చూసేది ధర ఇక్కడ ఓలా తన మార్క్‌ చూపిస్తోంది. ఓలా ఎస్‌1ఎక్స్‌ 3kWh ఎక్స్‌షోరూమ్‌ ధర 99,021గా ఉంది. మోరవైపు బజాజ్‌ చేతక్‌ 3001 ధర 1,10,006 వద్ద ఉంది. అంటే ఓలా కంటే చేతక్‌ దాదాపు 11వేల ఖరీదైనది. బజాజ్‌ ఇటీవల చేతక్ ధరలను పెంచడం కూడా దీనికి కారణం. 

డిజైన్‌లో ఎవరు ముందంజలో ఉన్నారు?

డిజైన్ విషయంలో ఈ రెండూ వేర్వేరు ధృవాలు, బజాజ్‌ చేతక్‌ నియో రెట్రో వైబ్‌తో వస్తుంది. అంటే పాత కాలపు చేతక్ స్టైల్‌ను ఆధునికంగా మార్చారు. దీని కర్వీ ప్యానెలస్‌ క్లాసిక్‌ లుక్‌ను ఇస్తాయి. 

ఓలా ఎస్‌1ఎక్స్‌ మాత్రం మినిమలిస్ట్‌ డిజైన్‌ను అనుసరిస్తోంది. చూడటానికి చాలా క్లీన్‌గా, సింపుల్‌గా ఉంటుంది. యువతను ఆకట్టుకునేలా దీని రూపకల్పన సాగింది. డైమెన్షన్ విషయానికి వస్తే, చేతక్ గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువగా ఉంది. ఇది మన ఊరిలోని గుంతలు, స్పీడ్ బ్రేకర్లను దాటేందుకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. 

ఓలా వీల్ బేస్‌ కొంచెం ఎక్కువ. దీని వల్ల హైవేలపై వెళ్లేటప్పుడు స్టేబుల్‌గా ఉంటుంది. కానీ సీటు ఎత్తు విషయంలో చేతక్‌ తక్కువగా ఉండటం వల్ల అందరికీ అందుబాటులో ఉంటుంది. 

ఎవరి స్పీడ్‌ ఎక్కువ?  

మీరు వేగాన్ని ఇష్టపడే వారైే ఓలా వైపు మొగ్గు చూపాల్సి ఉంటుంది. ఓలా ఎస్‌1ఎక్స్‌ 3kWhగరిష్ట వేగం గంటకు 115 కిలోమీటర్లు. ఇది చేతక్ కంటే చాలా ఎక్కువ. రేంజ్ విషయంలోనూ ఓలానే ముందు ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే ఓలా 176కిలోమీటర్లు వెళ్తుంది. అదే బజాజ్ చేతక్ విషయానికి వస్తే ఇది 151కిలోమీటర్లకే పరిమితం అవుతుంది. 

ఛార్జింగ్ కన్వీనియన్స్‌

ఇక్కడ అసలు మలుపు ఉంది. రేంజ్ తక్కువైనా బజాజ్ ఈ విషయంలో ఓలాను అధిగమించింది. ఛార్జింగ్ సమయంలో చేతక్‌ ముందంజలో ఉంది. చేతక్‌ 0-80 ఛార్జ్ అవ్వడానికి కేవలం 2 గంటల 55 నిమిషాలు మాత్రమే పడుతుంది. అదే ఓలా విషయానికి వస్తే 0-80 ఛార్జింగ్ కోసం ఏకంగా 7 గంటల 15 నిమిషాల సమయం పడుతుంది. రోజువారీ వాడకంలో ఈ తక్కువ ఛార్జింగ్ సమయం అనే బజాజ్ యూజర్లకు పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది

ఫీచర్ల ఎలా ఉన్నాయి?

రెండు స్కూటర్‌లలోనూ ఎల్‌ఈడీ లైటింగ్, బ్లూటూత్‌ కనెక్టివిటీ, ఎల్‌సీడీ డిస్‌ప్లే వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. కాల్ అలర్ట్స్, ఎస్‌ఎంఎస్‌ నోటిఫికేషన్లు రెండింటిలోనూ వస్తాయి. ఓలాలో అదనంగా క్రూయిజ్‌ కంట్రోల్ ఉంది. ఇది లాంగ్ రైడ్లలో చేతులకు విశ్రాంతినిస్తుంది. అలాగే ఓలాలో మూడు రైడింగ్ మోడ్స్‌ ఉండగా చేతక్‌లో రెండు మాత్రమే ఉన్నాయి. 

అండర్ సీట్ స్టోరేజ్ విషయంలో రెండూ దాదాపు సమానమే. చేతక్‌లో 35 లీటర్లు, ఓలాలో 34 లీట్ల స్థలం ఉంది. కిరాణా సామాగ్రి, లేదా హెల్మెట్‌ పెట్టుకోవడానికి ఇది సరిపోతుంది. 

మీరు తక్కువ ధరలో ఎక్కువ రేంజ్, ఎక్కువ వేగం, టెక్నాలజీ కోరుకుంటే ఓలా ఎస్‌1ఎక్స్‌ 3kWh ఎంచుకోవచ్చు. కానీ మీకు నమ్మకమైన బ్రాండ్, త్వరగా ఛార్జ్ అయ్యే సౌలభ్యం, ఫ్యామిలీ అంతా సులభంగా నడపగలిగే స్కూటర్‌ కావాలంటే బజాజ్ చేతక్‌ 3001 బెస్ట్ ఛాయిస్. 

Frequently Asked Questions

ఓలా S1X 3kWh మరియు బజాజ్ చేతక్ 3001 స్కూటర్లలో ఏది ఎక్కువ ఖరీదైనది?

బజాజ్ చేతక్ 3001 ధర ₹1,10,006 కాగా, ఓలా S1X 3kWh ధర ₹99,021. చేతక్ ఓలా కంటే సుమారు 11 వేల రూపాయలు ఎక్కువ ఖరీదైనది.

వేగం మరియు రేంజ్ పరంగా ఓలా, చేతక్ స్కూటర్లలో ఏది మెరుగు?

ఓలా S1X 3kWh గరిష్ట వేగం 115 కి.మీ/గం మరియు రేంజ్ 176 కి.మీ. బజాజ్ చేతక్ రేంజ్ 151 కి.మీ. ఓలా వేగం, రేంజ్ రెండింటిలోనూ ముందుంది.

ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ తక్కువ సమయంలో ఛార్జ్ అవుతుంది?

బజాజ్ చేతక్ 0-80% ఛార్జ్ అవ్వడానికి 2 గంటల 55 నిమిషాలు పడుతుంది. ఓలా S1X 3kWh ఛార్జింగ్ కోసం 7 గంటల 15 నిమిషాలు అవసరం. చేతక్ వేగంగా ఛార్జ్ అవుతుంది.

డిజైన్ పరంగా ఓలా ఎస్1ఎక్స్ మరియు చేతక్ లకు ఉన్న ప్రధాన తేడాలు ఏమిటి?

చేతక్ నియో-రెట్రో క్లాసిక్ లుక్‌తో వస్తుంది. ఓలా ఎస్1ఎక్స్ మాత్రం మినిమలిస్ట్, యువతను ఆకట్టుకునే డిజైన్‌ను కలిగి ఉంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

యూత్‌ కోసం కొత్త 4V ఇంజిన్‌తో వచ్చిన Bajaj Pulsar N160.. ఏ వేరియంట్‌ కొనాలి?
కొత్త Bajaj Pulsar N160 లో ఐదు వేరియంట్లు.. మీరు ఏ వేరియంట్‌ కొంటారు?
సింగిల్‌ ఛార్జ్‌తో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లొచ్చు - Avore EX2 ధర, బ్యాటరీ, ఫీచర్లపై పూర్తి వివరాలు!
సింగిల్‌ ఛార్జ్‌తో ఏకంగా 255km ప్రయాణం.. Avore EX2 కొనే ముందు ఈ 5 విషయాలు తెలుసుకోండి!
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
Advertisement

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Embed widget