అన్వేషించండి

Best Electric Scooters: 200 km రేంజ్‌ ఇచ్చే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లలో అప్‌-డౌన్‌ చేయడం మెట్రో ఛార్జీ కంటే చవక!

Affordable Electric Scooters: పెట్రోల్ ఖర్చు కంటే చవకైన ప్రయాణం కావాలా?. ఈ 3 బెస్ట్‌ ఎలక్ట్రిక్ స్కూటర్లు మీ కలను నిజం చేస్తాయి, మెట్రో టిక్కెట్‌ రేటు కన్నా తక్కువ ఖర్చు చేస్తాయి.

2025 Best Affordable Electric Scooters In India: భారతదేశంలో మండిపోతున్న డీజిల్-పెట్రోల్ ధరలు ఇటు జనం జేబును, అటు పర్యావరణాన్ని గుల్ల చేస్తున్నాయి. ఒకే పనితో స్వామి కార్యం & స్వకార్యం నెరవేరినట్లు.. ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కొంటే జేబుపై భారం తగ్గుతుంది & పర్యావరణ పరిరక్షణ కూడా సాధ్యమవుతుంది. కాబట్టి, ఎలక్ట్రిక్ స్కూటర్లు ప్రజల దృష్టిని బాగా ఆకర్షించాయి. ముఖ్యంగా.. ఆఫీస్‌కు వెళ్లిరావడం లేదా ఇతర పనుల కోసం రోజూ అప్‌ అండ్‌ డౌన్‌ చేసేవాళ్లకు ఇవి చవకైన & స్మార్ట్ ఆప్షన్‌గా మారాయి. ఇంకా, ఎలక్ట్రిక్‌ స్కూటర్లు స్టైలిష్‌ రైడ్‌ను కూడా ఇస్తున్నాయి.

ప్రస్తుతం, మార్కెట్‌లో ఎక్కువగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్లు - Bajaj Chetak, TVS iQube & Ather 450X. ఇవి కామన్‌ మ్యాన్‌ బడ్జెట్‌లో ఉండటమే కాకుండా మెట్రోలో ప్రయాణించడం కంటే తక్కువ ఖర్చుతో రైడ్‌ ఇస్తాయి. అంటే, మీ డబ్బును ఆదా చేస్తాయి. భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను చూసి, ఈ కంపెనీలు ఆకర్షణీయమైన ఫీచర్లు & అద్భుతమైన రేంజ్‌తో ఈ ప్రసిద్ధ మోడళ్లను ప్రవేశపెట్టాయి.

1. బజాజ్ చేతక్
బజాజ్ చేతక్ ఒక రెట్రో-లుకింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్. బలమైన నిర్మాణ నాణ్యత & ప్రీమియం డిజైన్‌తో ఇది పాపులర్‌ అయింది. దీనిలో 4 వేరియంట్‌లు ఉన్నాయి - బజాజ్ చేతక్ 2903, బజాజ్ చేతక్ 3501, బజాజ్ చేతక్ 3502 & బజాజ్ చేతక్ 3503. బజాజ్ చేతక్ 2903 ధర రూ. 98,498, బజాజ్ చేతక్ 3502 ధర రూ. 1.22 లక్షలు & బజాజ్ చేతక్ 3503 ధర రూ. 1.02 లక్షలు. 2903 వేరియంట్ 2.9 kWh బ్యాటరీతో 123 కి.మీ. ప్రయాణిస్తుంది. 3501/3502 వేరియంట్‌లు 3.5 kWh బ్యాటరీతో 153 కి.మీ. రైడింగ్‌ రేంజ్‌ ఇస్తాయి. ఈ స్కూటర్‌లో టచ్‌స్క్రీన్ TFT డిస్‌ప్లే, మ్యూజిక్ & కాల్ నోటిఫికేషన్స్‌, రివర్స్ మోడ్, జియో-ఫెన్సింగ్ & 35 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ వంటి స్మార్ట్ ఫీచర్‌లు ఉన్నాయి.

2. టీవీఎస్ ఐక్యూబ్ 
TVS iQube ను మధ్య తరగతి కస్టమర్ల మొదటి ఎంపికగా చూస్తున్నారు. దీని ధర రూ. 1.09 లక్షల నుంచి ప్రారంభమై రూ. 1.60 లక్షల వరకు ఉంటుంది. ఈ స్కూటర్ iQube, iQube S & iQube ST వేరియంట్లలో లభిస్తుంది. iQube పరిధి 94 KM, iQube S పరిధి 145 KM & iQube ST పరిధి 212 KM. ఈ టూవీలర్‌లో 7-అంగుళాల TFT టచ్‌ స్క్రీన్, జాయ్‌స్టిక్ నావిగేషన్, రివర్స్ మోడ్, USB ఛార్జింగ్, LED లైటింగ్ & జియో-ఫెన్సింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సుదూర రోజువారీ వినియోగానికి ఇది బెస్ట్ ఆప్షన్‌ అవుతుంది.

3. ఏథర్ 450X
యువ రైడర్లను దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేసిన హైటెక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏథర్ 450X. దీని రెండు వేరియంట్లు - 2.9 kWh & 3.7 kWh. వాటి ధరలు వరుసగా రూ. 1.49 లక్షలు & రూ. 1.59 లక్షలు. 2.9 kWh బ్యాటరీ ప్యాక్‌ స్కూటర్ 126 KM రేంజ్‌ & 3.7 kWh బ్యాటరీ ప్యాక్‌ స్కూటర్ 161 KM రేంజ్ ఇవ్వగలదు. 7-అంగుళాల టచ్‌ స్క్రీన్ డిస్‌ప్లే, గూగుల్ మ్యాప్స్ ఇంటిగ్రేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ, పార్క్ అసిస్ట్ & OTA అప్‌డేట్స్‌ వంటి అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ సొంతం. టెక్నాలజీ పరంగా అప్‌డేటెడ్‌గా ఉండాలనుకునే వాళ్లకు ఇది సరైన ఎంపిక.

ఈ మూడు స్కూటర్లు వాటి విభాగాలలో గొప్ప పనితీరును, శక్తిమంతమైన లక్షణాలు & తక్కువ ధరతో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. రోజూ ప్రయాణించేవాళ్లకు స్మార్ట్ & రిలయబుల్‌ పార్ట్‌నర్‌ అవుతాయి.

టాప్ హెడ్ లైన్స్

BYD Denza N8 EV: ఒకసారి ఛార్జ్ చేస్తే 1003 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే కారు! కొత్త చర్చ దారి తీస్తున్న డెంజా N8 మైండ్‌బ్లోయింగ్ ఫీచర్స్‌!
ఒకసారి ఛార్జ్ చేస్తే 1003 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే కారు! కొత్త చర్చ దారి తీస్తున్న డెంజా N8 మైండ్‌బ్లోయింగ్ ఫీచర్స్‌!
రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
పాత Monster కంటే Ducati Monster V2 లో ఏంటి ప్రత్యేకత? ఈ 5 హైలైట్స్‌ తెలుసుకోండి
మీరు యూత్‌ అయితే, Ducati Monster V2 గురించి ఈ 5 విషయాలు మీకు తెలుసా?
టెస్లా మోడల్ Y నిజంగానే 500km రేంజ్‌ ఇస్తుందా? రోడ్డుపైకి వస్తే గానీ అసలు సంగతి తెలీలేదు
టెస్లా మోడల్ Y కెపాసిటీ ఇంతేనా? అసలు రేంజ్ తెలిస్తే షాక్‌ అవుతారు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget