AGV K7 Helmet Review: స్టైల్, సేఫ్టీ, కంఫర్ట్ కలిపిన కొత్త స్పోర్ట్ టూరింగ్ హెల్మెట్ - క్వాలిటీ ఎలా ఉంది?
AGV నుంచి వచ్చిన కొత్త K7 హెల్మెట్ స్టైల్, సేఫ్టీ, కంఫర్ట్ కలయికగా నిలుస్తోంది. సిటీలోనూ, హైవే పైనా టెస్ట్ చేసిన ఈ హెల్మెట్ ప్రాక్టికల్ ఫీచర్లతో రైడర్స్‌ను ఆకట్టుకుంటోంది.

AGV K7 Sport Touring Helmet Review: రైడింగ్ అంటే యూత్‌కు ఎంత ఇష్టమో చెప్పాల్సిన పని లేదు. రైడ్ థ్రిల్ పంచడంతో పాటు కంఫర్ట్‌గా, సేఫ్‌గా ఉండాలంటే మంచి హెల్మెట్ ధరించడం తప్పనిసరి. ఈ మధ్య మార్కెట్లో స్పోర్ట్ టూరింగ్ సెగ్మెంట్‌లో కొత్తగా వచ్చిన AGV K7 చాలా మంది రైడర్ల దృష్టిని ఆకర్షిస్తోంది. సిటీ కమ్యూట్ కావచ్చు, హైవే రన్స్ కావచ్చు - ఏదైనా హ్యాండిల్ చేయగల ఈ హెల్మెట్‌ను ఒక రైడర్ 6 నెలల పాటు ఉపయోగించి చూసాడు. ఆ అనుభవం ఆధారంగా పూర్తి రివ్యూ ఇది.
స్టైల్‌తో పాటు స్ట్రాంగ్ బిల్డ్
AGV K7 బయట నుంచి చూస్తేనే ఒక ప్రీమియం ఫీలింగ్ ఇస్తుంది. దీని కంపోజిట్ ఫైబర్ షెల్ చాలా సాలిడ్‌గా ఉంటుంది. వెయిట్ మాత్రం కొంచెం ఎక్కువ, సుమారు 1,450 గ్రాములు. AGV K6 S (1,220g)తో పోలిస్తే కాస్త హెవీ అయినా, రోడ్డు మీద రైడ్ చేసేటప్పుడు ఆ వెయిట్ పెద్దగా ఇబ్బంది పెట్టదు. AGV మూడు షెల్ సైజులు, నాలుగు EPS సైజులు ఇస్తోంది. అంటే.. ఫిట్ విషయంలో చాలా ఆప్షన్స్ ఉంటాయి.
సేఫ్టీ లెవెల్ టాప్ క్లాస్
ఇది ECE 22.06 సర్టిఫైడ్ హెల్మెట్, అలాగే AGV “Extreme Safety” ప్రోటోకాల్‌తో డిజైన్ చేశారు. హెల్మెట్ కింద వైపు ఉన్న ప్రత్యేక కటౌట్ వల్ల కాలర్ బోన్‌పై ప్రభావం (గాయాలు) పడే అవకాశం తక్కువ. హైవే స్పీడ్స్‌లో కూడా హెల్మెట్ స్టేబుల్‌గా ఉండేందుకు విండ్‌టన్నెల్ టెస్టింగ్ చేశారు. హెల్మెట్ వెనుక భాగంలో ఉన్న స్పాయిలర్, హై స్పీడ్‌లో బఫెటింగ్ తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.
ఇన్‌సైడ్ ఫిట్ & కంఫర్ట్
రైడర్ ఉపయోగించిన సైజ్ M, అది 'ట్రూ టు సైజ్'గా ఫిట్ అయింది. చీక్ ప్యాడ్స్ & క్రౌన్ లైనింగ్‌లో వేర్వేరు ఫాబ్రిక్స్ ఉపయోగించారు, అవి ప్రీమియంగా అనిపించే ఫాబ్రిక్స్. తడిని త్వరగా పీల్చుకునే ప్రత్యేక ఏర్పాటు కూడా ఉంది. కళ్లజోడు పెట్టుకునే వాళ్ల కోసం చెవుల దగ్గర ప్యాడింగ్ కాస్త సాఫ్ట్‌గా ఉంటుంది. అందుకే గ్లాసెస్ పెట్టుకుని రైడ్ చేయడంలో ఎలాంటి ఇబ్బంది లేదు.
ఒక విషయం మాత్రం కాస్త ఇబ్బందిగా ఉంటుంది, ఈ హెల్మెట్‌లో రాచెట్ స్ట్రాప్ ఉంది. డబుల్ D రింగ్ కోరుకునే రైడర్లకు ఇది ఇష్టం కాకపోవచ్చు.
వైజర్ & సన్‌షీల్డ్ అనుభవం
190° ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఇచ్చే పనోరమిక్ వైజర్ నిజంగా బాగుంటుంది. UV ప్రొటెక్షన్, యాంటీ స్క్రాచ్, పిన్‌లాక్ 120 మాక్స్‌విజన్ ఇన్సర్ట్ కూడా ఉంది. ఫాగింగ్ అసలు ఇబ్బంది పెట్టదు. వైజర్ లాక్ మొదట్లో కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా అనిపించినా కొన్ని రోజుల్లోనే అలవాటు పడతారు. ఇంకా, సన్ వైజర్ ఉండటం మంచి ఫీచర్, కానీ అది కొంచెం లైట్‌గా ఉంది, మరింత డార్క్‌గా ఉండాల్సింది అనిపించింది. ఎండలో రైడ్ చేసేటప్పుడు దీనిని స్పష్టంగా ఫీలవుతారు.
వెంటిలేషన్ ఎలా ఉందంటే?
ముందు ఐదు వెంట్స్, వెనుక రెండు ఎగ్జాస్ట్ వెంట్స్ ఉన్నాయి, దీనివల్ల కూలింగ్ ఉంటుంది. హైవే స్పీడ్‌లో వెంటిలేషన్ పనితీరు బాగుంటుంది. అయితే స్లో ట్రాఫిక్‌లో కావాల్సినంత కూలింగ్ రాదు. హెల్మెట్ ఇన్నర్ భాగం కొంచెం వెచ్చగా అనిపిస్తుంది.
కమ్యూనికేషన్ సిస్టమ్ రెడీ
AGV ఇన్‌సైడ్ ఇంటర్‌కామ్ కోసం ప్రత్యేకంగా స్లాట్ ఇచ్చారు. యాడ్ చేసిన తర్వాత కూడా అవుట్‌షేప్‌గా కనిపించదు, హెల్మెట్‌తో కలిసిపోయినట్టే ఉంటుంది.
హైవే పెర్ఫార్మెన్స్
హైవేలో 90-120 km/h స్పీడ్స్‌లో ఈ హెల్మెట్ చాలా స్థిరంగా ఉంది. శబ్దం ఈ క్లాస్‌లో సాధారణమే. ఇయర్ ప్లగ్స్ వేశాక మరింత కంఫర్ట్‌గా ఉంటుంది. అయితే, హెల్మెట్ వెయిట్ కారణంగా లాంగ్ రైడ్స్‌లో మెడపై కాస్త ఇబ్బంది ఉంటుంది, ఇంటర్‌కామ్ పెట్టిన తర్వాత వెయిట్ మరింత పెరుగుతుంది.
ఫైనల్‌గా...
AGV K7 ఒక 'డూ-ఇట్-ఆల్ స్పోర్ట్ టూరింగ్ హెల్మెట్'. బిల్డ్, సేఫ్టీ, ఫీచర్లు, విజిబిలిటీ... అన్నింటిలో ఆల్ రౌండ్ బ్యాలెన్స్ ఉంది. సన్ వైజర్ మరింత డార్క్‌గా ఉండాలి, ఇన్నర్ హీట్ కొద్దిగా ఎక్కువ ఉంది - ఇవే రెండు కీలక మైనస్ పాయింట్లు. అయితే, ప్రీమియం స్పోర్ట్ టూరింగ్ హెల్మెట్ కావాలనుకునే రైడర్లకు ఇది మంచి ఆప్షన్‌గా చెప్పాలి.
ధర: సుమారు ₹50,000 (ఇండియా). agv.com లో బుక్ చేసుకోవచ్చు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















