అన్వేషించండి

Maruti Suzuki Grand Vitara లో ఫ్యూయల్‌ ఇండికేటర్‌ లోపం - 39,506 కార్లను వెనక్కు పిలిచిన కంపెనీ

గ్రాండ్‌ విటారా ఫ్యూయల్‌ ఇండికేటర్‌లో లోపం బయటపడడంతో 39,506 యూనిట్స్‌ను మారుతి సుజుకి రీకాల్‌ చేసింది. డిసెంబర్‌ 2024 నుంచి ఏప్రిల్‌ 2025 మధ్య తయారైన కార్లు ఈ లిస్ట్‌లో ఉన్నాయి.

Maruti Grand Vitara Recalled 39,506 Units: మారుతి సుజుకి గ్రాండ్‌ విటారా యజమానులు, డ్రైవర్లకు బిగ్‌ అలెర్ట్‌. భారత మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉన్న ఈ మిడ్‌సైజ్‌ SUVలో ఫ్యూయల్‌ లెవల్‌ ఇండికేటర్‌ వ్యవస్థలో లోపం బయటపడింది. దీంతో, కంపెనీ భారీగా 39,506 యూనిట్స్‌ను (కార్లను) రీకాల్‌ చేస్తోంది. డిసెంబర్‌ 9, 2024 నుంచి ఏప్రిల్‌ 29, 2025 మధ్యలో తయారైన గ్రాండ్‌ విటారా మోడల్స్‌ ఈ రీకాల్‌లో ఉన్నాయి.

ఏంటి సమస్య?
కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, గ్రాండ్‌ విటారా స్పీడోమీటర్‌ అసెంబ్లీలో ఉన్న ఫ్యూయల్‌ లెవల్‌ ఇండికేటర్‌ & లో ఫ్యూయల్‌ వార్నింగ్‌ లైట్‌ సరిగ్గా పని చేయకపోవచ్చు. అంటే ట్యాంకులో ఎంత పెట్రోల్‌ ఉందో డ్రైవర్‌కు నిజమైన సమాచారం అందకపోవచ్చు. ఈ పరిస్థితిలో, కార్‌ అకస్మాత్తుగా ఇంధనం అయిపోయే అవకాశం ఉంది. హైవే ప్రయాణాల్లో లేదా దూర ప్రాంతాల్లో ఇది చాలా సమస్యలను తెచ్చి పెడుతుంది, ఒక్కోసారి ప్రమాదకరంగా కూడా మారుతుంది.

కారు యజమానులు ఏమి చేయాలి?
మారుతి సుజుకి ఇండియా ఈ సమస్య కనిపించిన కార్ల యజమానులకు వ్యక్తిగతంగా మెసేజ్‌ లేదా కాల్‌ చేస్తుంది. అఫెక్ట్‌ అయిన కారు ఉన్న యజమానులు తమ సమీపంలోని అథరైజ్డ్‌ మారుతి వర్క్‌షాప్‌ను సందర్శించాలి. వర్క్‌షాప్‌లో ఫ్యూయల్‌ సూచిక భాగాన్ని పూర్తిగా చెక్‌ చేసి, లోపం కనపడితే ఉచితంగా రీప్లేస్‌ చేస్తారు. అదే విధంగా, యజమానులు తమ కార్‌ VIN నంబర్‌ను మారుతి అధికారిక వెబ్‌సైట్‌లో ఎంటర్‌ చేసి, తమ వాహనం రీకాల్‌లో ఉందో లేదో చెక్‌ చేసుకోవచ్చు.

గ్రాండ్‌ విటారా ధరలు (ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణ)
హైదరాబాద్‌, విజయవాడ షోరూమ్‌లలో గ్రాండ్‌ విటారా ధరలు ₹10.77 లక్షల నుంచి ₹19.72 లక్షల వరకు (ఎక్స్‌-షోరూమ్‌) ఉన్నాయి. ఆన్‌-రోడ్‌ ధర సుమారు రూ. 13.43 లక్షల నుంచి రూ. 24.46 లక్షల వరకు ఉంటుంది. మిడ్‌సైజ్‌ SUV సెగ్మెంట్‌లో ఇవి ప్రస్తుతం అత్యంత అందుబాటు ధరలు.

ఇంజిన్‌ ఆప్షన్లు - Mild Hybrid & Strong Hybrid

గ్రాండ్‌ విటారాలో రెండు ఇంజిన్‌ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి:

1. 1.5 లీటర్‌ K15C పెట్రోల్‌ మైల్డ్‌ హైబ్రిడ్‌

పవర్‌: 103hp

గేర్‌ బాక్స్‌: 5-స్పీడ్‌ మాన్యువల్‌ / 6-స్పీడ్‌ ఆటోమేటిక్‌

ఆల్‌గ్రిప్‌ AWD ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంది

2. 1.5 లీటర్‌ స్ట్రాంగ్‌ హైబ్రిడ్‌ (Toyota-sourced)

ఇంజిన్‌ పవర్‌: 92hp

ఎలక్ట్రిక్‌ మోటార్‌ పవర్‌: 79bhp / 141Nm

కంబైన్డ్‌ అవుట్‌పుట్‌: 109hp

ట్రాన్స్‌మిషన్‌: e-CVT

ఈ వెర్షన్‌ ఎక్కువ కంఫర్ట్‌, మంచి రెస్పాన్స్‌ & అద్భుతమైన మైలేజ్‌కు పాపులర్‌.

మైలేజ్‌ వివరాలు

మారుతి తెలిపిన ప్రకారం: 

స్ట్రాంగ్‌ హైబ్రిడ్‌: 27.97 kmpl

మైల్డ్‌ హైబ్రిడ్‌ మాన్యువల్‌: 21.1 kmpl, 

AWD వర్షన్‌: 19.38 kmpl

ఆటోమేటిక్‌: 20.58 kmpl

తెలుగు రాష్ట్రాల్లో దీర్ఘ ప్రయాణాలు చేసే కుటుంబాలు, డైలీ ఆఫీస్‌ కమ్యూట్‌ చేసే వారు ఈ మైలేజ్‌లను బట్టి తమ అవసరాలకు సరిపోయే వేరియంట్‌ను ఎంపిక చేసుకోవచ్చు.

మారుతి సుజుకి, రీకాల్‌ ప్రకటించడం ద్వారా తమ కస్టమర్ల భద్రతపైన దృష్టి పెట్టినట్లు మరోసారి స్పష్టమైంది. ఫ్యూయల్‌ ఇండికేటర్‌ లోపం చిన్న సమస్యలా కనిపించినా, డ్రైవింగ్‌ సమయంలో ఇది పెద్ద ఇబ్బందులకు దారి తీసే అవకాశం ఉంది.
గ్రాండ్‌ విటారా యజమానులు తప్పకుండా తమ కార్‌ VIN చెక్‌ చేసి, అవసరమైతే వెంటనే మారుతి వర్క్‌షాప్‌ను సంప్రదించడం మంచిది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Royal Enfield Himalayan 440: తక్కువ ధరలో అడ్వెంచర్ టూరర్.. కొనేముందు తెలుసుకోవాల్సిన 5 విషయాలు
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్‌ 440 కొనాలా, వద్దా? 3 ప్లస్ పాయింట్లు.. ఈ 2 మైనస్‌లు!
2027 KTM 200 Dukeలో రైడింగ్ మోడ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్ సహా కొత్త ఫీచర్లు.. మీరు తెలుసుకోవాల్సిన 7 విషయాలు
KTM 200 Duke మరోసారి అప్‌డేట్.. ఈసారి కొత్తగా వచ్చిన ఫీచర్లు ఏంటి?
Skoda Kodiaq vs Volkswagen Tayron.. ఏ SUV ఎక్కువ మైలేజీ ఇస్తుంది? రియల్ వరల్డ్ టెస్ట్‌లో ఆసక్తికర ఫలితాలు
రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌ టెస్ట్‌: స్కోడా కొడియాక్‌, వోక్స్‌వ్యాగన్ టైరాన్‌లో ఏది బెస్ట్‌?
LLR Online Test: ఇంటి నుంచే లెర్నర్ లైసెన్స్ పొందొచ్చు.. ఏఐ టెక్నాలజీతో ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్.. రవాణా శాఖ కీలక నిర్ణయం
ఇంటి నుంచే లెర్నర్ లైసెన్స్ పొందొచ్చు.. ఏఐ టెక్నాలజీతో ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్.. రవాణా శాఖ కీలక నిర్ణయం

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Conductor Dies: చిల్లర వివాదం.. ప్రయాణికురాలు నెట్టేయడంతో గాయపడిన RTC కండక్టర్ మృతి, మంత్రి పొన్నం సంతాపం
చిల్లర వివాదం.. ప్రయాణికురాలు నెట్టేయడంతో గాయపడిన RTC కండక్టర్ మృతి, మంత్రి పొన్నం సంతాపం
Bandi Sanjay Kumar: ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
GVMC Mayor ముక్కా శ్రావణి.. వైసీపీ అభ్యర్థిపై ఘన విజయం, ఎవరెన్ని స్థానాలు నెగ్గారంటే
జీవీఎంసీ మేయర్‌‌గా ముక్కా శ్రావణి.. వైసీపీ అభ్యర్థిపై ఘన విజయం, ఎవరెన్ని స్థానాలు నెగ్గారంటే
AP Municipal Election Results: ఏపీ పుర ఫలితాల్లో కూటమి గాలి - వైఎస్సార్‌సీపీ వ్యూహాత్మక పొరపాటు.. పులివెందులే ముంచిందా?
ఏపీ పుర ఫలితాల్లో కూటమి గాలి - వైఎస్సార్‌సీపీ వ్యూహాత్మక పొరపాటు.. పులివెందులే ముంచిందా?
Murala Jyothi: నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. స్ఫూర్తినింపుతున్న దళిత బిడ్డ మురాల జ్యోతి ప్రస్థానం
నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. దళిత బిడ్డ మురాల జ్యోతిని ఉన్నతస్థానంలో నిలిపిన పవన్ కల్యాణ్
YS Jagan: చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
Pocket Rockkets Teaser : గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
Nandikotkuru Municipal Elections: కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
Embed widget