Best Cruiser Bikes: ఇండియన్ రోడ్లకు ఫ్రెండ్లీగా ఉండే టాప్ 5 క్రూజర్ బైక్స్, కో-రైడర్‌కూ ఫుల్ కంఫర్ట్ - ధరలు & ఫీచర్లు
భారతీయ రోడ్లపై పిలియన్‌కు కూడా అత్యుత్తమ కంఫర్ట్ ఇచ్చే టాప్ 5 క్రూజర్ బైక్‌లు ఇవే. Meteor 350 నుంచి Avenger 220, Honda CB350 వరకు - ధరలు, ఫీచర్లు, కంఫర్ట్ వివరాలు మీ కోసం.

Best Cruiser Bikes India 2025: భారతదేశంలో క్రూజర్ బైక్‌లకు క్రేజ్ రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఇద్దరు రైడర్లు ఉన్నప్పుడు, అంటే ప్రధాన రైడర్‌తో పాటు పిలియన్ (కో-రైడర్) కూడా ప్రయాణిస్తుంటే, కంఫర్ట్‌కి చాలా ప్రాధాన్యత ఇస్తారు. క్రూజర్ బైక్‌లంటే విశాలమైన సీట్లు, లాంగ్ ఫుట్‌పెగ్స్, నిలకడగా ఉండే సస్పెన్షన్, సాఫ్ట్ కుషన్ - ఇవన్నీ సహజంగా కనిపిస్తాయి. పిలియన్‌కి ఇలా సరైన భంగిమ, మెత్తని కుషన్ దొరకడం వల్ల లాంగ్ డ్రైవ్‌లు సులభంగా మారతాయి. ఇప్పుడు, మన మార్కెట్‌లో, పిలియన్‌కి కూడా అత్యుత్తమంగా కంఫర్ట్ ఇచ్చే 5 బెస్ట్ క్రూజర్ బైక్‌లను మీ కోసం ఈ కథనంలో అందిస్తున్నాం.
1. Royal Enfield Meteor 350 (ఎక్స్-షోరూమ్ ధర: రూ. 1.91 లక్షలు)
Meteor 350 క్రూజర్ సెగ్మెంట్‌లో బెస్ట్-సెల్లింగ్ మోడళ్లలో ఇది ఒకటి. ఈ బైక్‌లో రైడర్‌తో పాటు పిలియన్ సీట్ కూడా వెడల్పుగా ఉండటం పెద్ద ప్లస్ పాయింట్. 1,400 mm వీల్‌బేస్ ఉండటం వల్ల బైక్ రోడ్డుపై చాలా స్టేబుల్‌గా అనిపిస్తుంది. గట్టిగా ఉన్న సస్పెన్షన్, డ్యుయల్-టోన్ సీటింగ్ సెటప్, వెడల్పాటి ఫుట్‌పెగ్స్... ఇవన్నీ పిలియన్‌కు ఎక్కువ కంఫర్ట్‌ని ఇస్తాయి. హైదరాబాద్, విజయవాడ రోడ్లలో వచ్చే చిన్నపాటి గుంతలు, బంప్‌లు కూడా పెద్దగా ఇబ్బంది పెట్టవు.
2. Bajaj Avenger Cruise 220 (ఎక్స్-షోరూమ్ ధర: రూ. 1.37 లక్షలు)
ఇండియాలో అతి చవకగా దొరికే క్రూజర్ బైక్‌లో ఇదొకటి. Avenger 220లో పిలియన్ సీట్ చాలా తగినంత వెడల్పుగా, ఫ్లాట్‌గా ఉంటుంది. పిలియన్‌కు కాళ్లను సౌకర్యవంతంగా పెట్టుకునే లాంగ్ ఫుట్‌పెగ్స్ కూడా ఈ బైక్‌లో ప్రత్యేకమైన అంశం. నగర ప్రయాణాలు, వీకెండ్ ట్రిప్‌లు, ఔటర్ రింగ్ రోడ్ రైడ్స్... ఏ పరిస్థితుల్లోనైనా పిలియన్‌కి సౌకర్యంగా ఉంటుంది. బడ్జెట్‌లో మంచి క్రూజర్ కావాలనుకునే వాళ్లకు ఇది బెస్ట్ ఆప్షన్.
3. Royal Enfield Classic 350 (ఎక్స్-షోరూమ్ ధర: రూ. 1.81 లక్షలు)
Classic 350 అనేది కంఫర్ట్ కోసమే రూపొందిన క్లాసిక్-స్టైల్ బైక్. ఇద్దరికి సరిపోయే వెడల్పాటి బెంచ్ సీట్ ఉండటం, సంప్రదాయ క్రూజర్ స్టైల్ ఫుట్‌పెగ్స్, 195 kg సమతౌల్య బరువు... అన్నీ పిలియన్ ప్రయాణాన్ని మరింత సాఫ్ట్‌గా మారుస్తాయి. భారతీయ రోడ్లలో వచ్చే ప్యాచ్‌లు, బ్రేక్‌లు, బంప్‌లను సస్పెన్షన్ బాగా హ్యాండిల్ చేస్తుంది. అందుకే Classic 350 ఇప్పటికీ పిలియన్ ఫ్రెండ్లీ బైక్‌గా ప్రజలు ఇష్టపడుతుంటారు.
4. Honda H’ness CB350 (ఎక్స్-షోరూమ్ ధర: రూ. 1.92 లక్షలు)
Honda CB350 పూర్తిగా క్రూజర్ కిందికి రాకపోయినా, దీని సీటింగ్ కంఫర్ట్ మాత్రం టాప్-లెవెల్. పిలియన్ కోసం ఇచ్చిన స్ప్లిట్ సీట్స్ చాలా ప్యాడింగ్‌తో ఉంటాయి. ఫుట్‌పెగ్ పొజిషన్ కూడా పర్ఫెక్ట్‌గా ఉండటం వల్ల సుదీర్ఘ ప్రయాణాలు కూడా ఇబ్బంది లేకుండా సాగుతాయి. ఇంజిన్ నుంచి వచ్చే వైబ్రేషన్స్ తక్కువగా ఉండటం CB350ని పిలియన్ ఫ్రెండ్లీ బైక్‌గా నిలబెడుతుంది. హైదరాబాద్–బెంగళూరు హైవేకి లేదా విజయవాడ–హైదరాబాద్ రూట్‌కి ఇది మంచి ఎంపిక.
5. Harley-Davidson X440 (ఎక్స్-షోరూమ్ ధర: రూ. 2.40 లక్షలు)
ప్రీమియం సెగ్మెంట్‌లో X440 పిలియన్ కంఫర్ట్ విషయంలో అద్భుతం. డీప్ బెంచ్ సీట్, వెడల్పాటి ఫుట్‌పెగ్స్, బలమైన సస్పెన్షన్, హై-క్వాలిటీ చాసిస్... ఇవన్నీ పిలియన్‌కు విలాసవంతమైన కంఫర్ట్‌ని ఇస్తాయి. హైవేలో కూడా పిలియన్‌కు సురక్షితంగా, సౌకర్యంగా అనిపిస్తుంది.
రైడర్‌తో పాటు కో-రైడర్ (పిలియన్) కంఫర్ట్ మీకు ప్రాధాన్యత అయితే, ఈ ఐదు బైక్‌లు మన మార్కెట్‌లో అత్యుత్తమ ఎంపికలు. మీ బడ్జెట్, రైడింగ్ స్టైల్, సీటింగ్ ప్రాధాన్యతలను చూసుకుని Meteor 350, Avenger 220, Classic 350, Honda CB350 లేదా X440లో ఏదైనా ఒకటి ఎంపిక చేసుకోవచ్చు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















