అన్వేషించండి

రూ.4.53 లక్షలకే 2026 Renault Kwid లాంచ్‌ - కొత్త స్టీరింగ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, CNG ఆప్షన్‌

2026 Renault Kwid భారత మార్కెట్లో రూ.4.53 లక్షల ప్రారంభ ధరతో విడుదలైంది. కొత్త స్టీరింగ్, కొత్త బ్యాడ్జ్‌లు, 6 Airbags, AMT, CNG ఆప్షన్ ఉన్నాయి. పూర్తి వివరాలు తెలుసుకోండి.

2026 Renault Kwid Price And Features: సామాన్యుల కోసం తక్కువ ధరలకే మంచి కార్లను అందిస్తున్న Renault, ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ Renault Kwidలో 2026 వెర్షన్‌ను అధికారికంగా లాంచ్‌ చేసింది. ఈ కొత్త మోడల్ ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధరను రూ.4.53 లక్షలుగా నిర్ణయించింది. ఈ తాజా అప్‌డేట్‌ వెర్షన్‌లో కారు ఎక్స్‌టీరియర్ & ఇంటీరియర్‌లో కొన్ని మార్పులు వచ్చాయి. అలాగే ఇకపై ఈ కారు కేవలం Evolution & Climber అనే రెండు వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. గతంలో ఉన్న Authentic & Techno వేరియంట్లను కంపెనీ నిలిపివేసింది.

కొత్త Renault Kwidలో పెద్ద మెకానికల్ మార్పులు లేకపోయినా, డిజైన్ పరంగా ఆకర్షణీయమైన అప్‌డేట్‌లు కనిపిస్తున్నాయి. ముందు & వెనుక భాగాల్లో కొత్త 3D Renault లోగోలు అమర్చారు. టెయిల్‌గేట్‌పై Kwid బ్యాడ్జ్‌కు కొత్త ఫాంట్‌తో పాటు సిల్వర్ ఫినిష్ ఇచ్చారు. అలాగే 14 అంగుళాల స్టీల్ వీల్స్‌కు కొత్త డ్యూయల్ టోన్ వీల్ కవర్లు అందించారు. అయితే LED DRLs, హాలోజన్ హెడ్‌ల్యాంప్స్, బంపర్లు & టెయిల్‌ల్యాంప్స్ మాత్రం పాత మోడల్‌లాగే కొనసాగుతున్నాయి.

కొత్త Kwid ఇంటీరియర్‌లో ప్రధాన ఆకర్షణ Kiger SUV నుంచి తీసుకొచ్చిన కొత్త 3-స్పోక్ స్టీరింగ్ వీల్. దీనిపై ఇన్ఫోటైన్‌మెంట్ కంట్రోల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. గేర్ లివర్ డిజైన్ కూడా Kiger తరహాలోనే ఉంది. మిగిలిన క్యాబిన్ లేఅవుట్‌లో పెద్దగా మార్పులు చేయలేదు. ఇందులో 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్డ్‌ ఆండ్రాయిడ్‌ ఆటో & ఆపిల్‌ కార్‌ప్లే, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మాన్యువల్‌ AC, నాలుగు పవర్ విండోలు కొనసాగుతున్నాయి. బ్లాక్ ఫ్యాబ్రిక్ సీట్లకు పసుపు రంగు హైలైట్స్ కూడా యథాతథంగా ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Tata Sierra EVని ఏ ప్రాతిపదికన కొంటారు? - ఇలా సింపుల్‌గా కంపేర్‌ చేస్తే మీకో క్లారిటీ వస్తుంది!

భద్రత విషయంలో కూడా Renault కొన్ని కీలక మార్పులు చేసింది. Evolution వేరియంట్‌లో 2 ఎయిర్‌ బ్యాగ్‌లు అందిస్తుండగా, Climber వేరియంట్‌లో 6  ఎయిర్‌ బ్యాగ్‌లు అందిస్తోంది. వీటితో పాటు రియర్‌ పార్కింగ్‌ కెమెరా, పార్కింగ్‌ సెన్సార్లు, TPMS, AMT వేరియంట్‌లలో హిల్‌ స్టార్ట్‌ అసిస్ట్, కీలెస్‌ ఎంట్రీ, సెంట్రల్‌ లాకింగ్, EBD తో ABS & సీట్‌ బెల్ట్‌ రిమైండర్‌ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఇంజిన్ విషయానికి వస్తే, పాత మోడల్‌లో ఉన్న 1.0 లీటర్ 3 సిలిండర్ NA పెట్రోల్‌ ఇంజిన్‌నే కొనసాగించారు. ఇది 69 hp పవర్ & 92.5 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 5-స్పీడ్‌ మాన్యువల్‌ లేదా 5-స్పీడ్‌ AMT గేర్‌బాక్స్ ఎంపికలు ఉన్నాయి.

మాన్యువల్‌ వేరియంట్ కొనుగోలు చేసేవారికి Renault ప్రత్యేకంగా రెట్రోఫిట్టెడ్‌ CNG కిట్‌ను కూడా అందిస్తోంది. దీని కోసం అదనంగా రూ.70,450 చెల్లించాలి. ఈ CNG కిట్‌ను కంపెనీ అధీకృత వర్క్‌షాప్‌లలోనే అమర్చుతుంది. దీనిపై 3 సంవత్సరాలు లేదా 1 లక్ష కిలోమీటర్ల వరకు వారంటీ కూడా లభిస్తుంది.

ఇది కూడా చదవండి: 160 km రేంజ్‌, రూ.1.40 లక్షల రేటు - ఇదే కాదు, Revolt RVX గురించి మీకు ఇంకా తెలియాలి!

కొత్త Renault Kwid ధరలు కూడా ప్రకటించారు. Evolution మాన్యువల్‌ ధర రూ.4.53 లక్షలు కాగా, Evolution AMT ధర రూ.4.90 లక్షలు. Climber Manual ధర రూ.5.15 లక్షలు & Climber AMT ధర రూ.5.61 లక్షలుగా నిర్ణయించారు. Authentic వేరియంట్ నిలిపివేయడంతో ప్రారంభ ధర రూ.22 వేల వరకు పెరిగింది. అయితే Evolution & Climber వేరియంట్ల ధరలు గతంతో పోలిస్తే వరుసగా రూ.14 వేల వరకు & రూ.32 వేల వరకు తగ్గాయి.

కొత్త Renault Kwid పొడవు 3,731 మి.మీ., వెడల్పు 1,579 మి.మీ., ఎత్తు 1,474 మి.మీ., వీల్‌బేస్ 2,422 మి.మీ.గా ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ 184 మి.మీ. కాగా, బూట్ స్పేస్ 279 లీటర్లు అందుబాటులో ఉంది.

ధర పరంగా చూస్తే Renault Kwidకు ప్రధాన పోటీగా Maruti S-Presso & Maruti Alto K10 ఉన్నాయి. అయితే కొత్త డిజైన్, మెరుగైన భద్రతా ఫీచర్లు, CNG ఆప్షన్ & ఆకర్షణీయమైన ధరలతో 2026 Renault Kwid భారత మార్కెట్లో వినియోగదారులను ఆకట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

2026 Honda Elevate facelift లో ఇవి లేవు! ప్రత్యర్థి కార్లలో ఉన్న 6 ఫీచర్లు ఈ కారులో మిస్!
కొత్తగా వచ్చినప్పటికీ Honda Elevate Facelift లో మిస్‌ అయిన ఫీచర్లు ఇవే
2026 Honda Elevate Faceliftలో ఏ వేరియంట్ బెస్ట్? రూ.11.80 లక్షల నుంచి ధరలు.. ఫీచర్లలో భారీ తేడాలు!
2026 Honda Elevate Faceliftలో 5 వేరియంట్లు.. మీ డబ్బుకు విలువ ఇచ్చేది మాత్రం ఇదే!
Triumph Bonneville T40 వర్సెస్‌ Bonneville T4: ఏది కొనాలి?, ధర దగ్గర నుంచి ఫీచర్ల వరకు తేడాలు
Triumph Bonneville T40లో ఉన్నదేంటి? Bonneville T4లో లేనిదేంటి? రూ.25,000 తేడాలో మారిందేంటి?
776cc స్పోర్ట్స్ బైక్ Suzuki GSX-8R.. రూ.80,000 డిస్కౌంట్ ఆఫర్.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే!
Suzuki బైక్‌పై ఏకంగా రూ.80,000 డిస్కౌంట్.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ దొరకదు!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget