రూ.9.99 లక్షల్లో బీస్ట్ రిటర్న్ - 2026 Kawasaki Z900 కొత్త స్టైల్, కలర్స్‌తో వచ్చేసింది
948cc ఇన్‌లైన్-4 ఇంజిన్, 125hp పవర్, 98.6Nm టార్క్‌తో కొత్త 2026 Kawasaki Z900 భారత్‌లో రూ. 9.99 లక్షల ఎక్స్‌షోరూమ్ ధరకు లాంచ్ అయింది. రెండు కొత్త కలర్స్‌తో బైక్ మరింత స్టైలిష్‌గా మారింది.

2026 Kawasaki Z900 launched at Rs 9.99 lakh: రేసర్ బైక్ ప్రేమికులకు శుభవార్త. జపాన్ దిగ్గజం కవాసాకి, తన ఫేమస్ నేకెడ్ బైక్ Z900 2026 ఎడిషన్‌ని భారత్‌లో లాంచ్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో కొత్త మోడల్ ధరను రూ. 9.99 లక్షలు (ఎక్స్‌షోరూమ్ ఇండియా) గా నిర్ణయించారు. అంటే, గత మోడల్‌తో పోలిస్తే మరింత ఎక్కువ స్టైల్ & ఎక్కువ పవర్‌లో, దాదాపు రూ. 19,000 వేల తక్కువకే ఇది లభిస్తోంది.
పవర్‌ఫుల్ ఇంజిన్
2026 Kawasaki Z900లోని 948cc ఇన్‌లైన్-4 లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ ఇప్పుడు మరింత బెటర్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది, రోడ్డుపై రేసుగుర్రంలా పరుగులు తీయిస్తుంది. ఇది 125 హార్స్‌పవర్ (HP) శక్తితో పాటు 98.6 న్యూటన్ మీటర్ (Nm) టార్క్ ఇస్తుంది. అంటే, 2025 మోడల్‌తో పోలిస్తే ఇది 1 HP & 1.2Nm ఎక్కువ శక్తిని అందిస్తోంది. ఈ పవర్ డెలివరీనే యువ రైడర్లను బాగా ఆకట్టుకుంటోంది.
అప్‌డేట్ అయిన ఎలక్ట్రానిక్స్
Kawasaki Z900లో బైక్‌లో అందించే ఫీచర్లలో కూడా టాప్ లెవెల్ టెక్నాలజీ ఉంది. రైడ్-బై-వైర్ థ్రాటిల్, క్రూయిస్ కంట్రోల్, బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్, మల్టిపుల్ పవర్ మోడ్స్, రైడింగ్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్, డ్యూయల్-చానల్ ABS వంటి సేఫ్టీ ఫీచర్లు యథాతథంగా కొనసాగుతున్నాయి.
కొత్త కలర్స్‌తో మరింత స్టైలిష్
2026 మోడల్‌లో ప్రధాన ఆకర్షణ కొత్త కలర్స్. బాగా పాపులర్ అయిన క్యాండీ గ్రీన్ షేడ్ మళ్లీ తిరిగి వచ్చింది. మరోవైపు, కొత్తగా వచ్చిన బ్లాక్ గోల్డ్ ఫ్రేమ్ కలర్ స్కీమ్ కూడా బైక్‌కి మరింత అగ్రెసివ్ లుక్ ఇస్తోంది. ఈ కలర్స్ యువతను బాగా ఆకట్టుకునేలా డిజైన్ చేశారు.
ధర & మార్కెట్ మూడ్
350cc కంటే ఎక్కువ ఇంజిన్ ఉన్న బైకులపై ఇటీవలి GST రేటు పెరుగుదలతో... Kawasaki Z900 ధర రూ. 9.52 లక్షల నుంచి రూ. 10.18 లక్షలకు పెరిగింది. అయితే, కవాసాకి తన కస్టమర్ల కోసం దానిని మళ్లీ రూ. 10 లక్షల దిగువకు తీసుకువచ్చింది. ఈ నిర్ణయం బ్రాండ్‌కి మంచి మార్కెట్ బూస్ట్ ఇస్తుందని స్పష్టంగా కనిపిస్తోంది.
సారాంశం చెప్పాలంటే - 2026 Kawasaki Z900 స్టైల్, పవర్, సౌండ్, కంఫర్ట్ అన్నీ కలిపిన పర్ఫెక్ట్ మిక్చర్ ప్యాక్. నగరంలోనైనా, హైవేలోనైనా ఇది చూపులు తిప్పుకోనివ్వని బీస్ట్. రూ. 9.99 లక్షల ధరలో ఇంత పవర్ ప్యాక్డ్ బైక్ అందుకోవడం యువ రైడర్లకు ఒక బిగ్ బోనస్.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - ABP దేశం ఆటో సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















