New Kia Sonet Facelift: మరికొద్ది రోజుల్లో కొత్త కియా సోనెట్ - డిజైన్‌లో భారీ మార్పులు!
New Kia Sonet: కొత్త కియా సోనెట్ ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్ డిసెంబర్ 14వ తేదీన లాంచ్ కానుంది.
2024 Kia Sonet Facelift Teaser: 2024 కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ డిసెంబర్ 14వ తేదీన భారతదేశంలో లాంచ్ కానుంది. అధికారిక లాంచ్‌కు ముందు కియా ఇండియా ఈ సబ్ 4 మీటర్ ఎస్‌యూవీ కొత్త టీజర్ వీడియోను (2024 Kia Sonet Facelift Teaser) విడుదల చేసింది. తాజా టీజర్‌లో అనేక కీలక వివరాలు వెల్లడయ్యాయి. కొత్త మోడల్‌లో అప్‌డేట్ చేసిన స్టైలింగ్, ఫీచర్ లోడెడ్ క్యాబిన్ ఉన్నాయి. అయితే ఇంజన్ ఆప్షన్లు మాత్రం ఇంతకు ముందు లాగానే ఉండే అవకాశం ఉంది.
డిజైన్ ఎలా ఉంది? (2024 Kia Sonet Facelift Design)
కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ రెడ్ కలర్ ఆప్షన్‌లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తుంది. ఈ ఎస్‌యూవీకి ముందు భాగాన్ని బాగా అప్‌డేట్ చేశారు. ఇందులో అప్‌డేటెడ్ స్లిమ్మర్ గ్రిల్, కొత్త ఎల్ ఆకారపు ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు, కొత్త ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. అప్‌డేటెడ్ బంపర్... ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్, సిల్వర్ ఫాక్స్ స్కిడ్ ప్లేట్‌తో వస్తుంది.
ఫీచర్లు ఇలా... (2024 Kia Sonet Facelift Features)
2024 కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ అప్‌డేటెడ్ డాష్‌బోర్డ్ లేఅవుట్‌ను పొందుతుంది. ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, అప్‌డేటెడ్ హెచ్‌వీఎసీ ప్యానెల్, ఎయిర్‌కాన్ వెంట్‌లతో కూడిన పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుతుంది. దీంతో పాటు ఆటో డిమ్మింగ్ ఐఆర్వీఎం, బోస్ సోర్స్డ్ మ్యూజిక్ సిస్టమ్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఛార్జర్‌తో సహా హై ఎండ్ ఫీచర్లతో రానుంది.
ఈ ఎస్‌యూవీ ఆల్ బ్లాక్ ఇంటీరియర్ స్కీమ్‌తో లాంచ్ అయింది. కొత్త ఎస్‌యూవీలో పరిమిత ఫీచర్లతో పాటు ఏడీఏఎస్ టెక్నాలజీ కూడా అందించారు. అయితే ఈ ఫీచర్ హై ట్రిమ్‌లలో మాత్రమే కనిపిస్తుంది. స్టాండర్డ్‌గా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీ, ఈఎస్పీతో పాటు ఏబీఎస్ వంటి అనేక ఇతర ఫీచర్లను కలిగి ఉంటుంది.
2024 కియా సోనెట్ ప్రస్తుతం ఉన్న ఇంజిన్ ఆప్షన్లతోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో 1.2 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్, 1.0 లీటర్ 3 సిలిండర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో డీజిల్ ఉన్నాయి. నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ 83 బీహెచ్‌పీ, 115 ఎన్ఎం పీక్ టార్క్ అవుట్‌పుట్‌లను జనరేట్ చేస్తుంది. అయితే టర్బో యూనిట్ 120 బీహెచ్‌పీ పవర్, 172 ఎన్ఎం పీక్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. అలాగే డీజిల్ ఇంజన్ 116 బీహెచ్‌పీ పవర్, 250 ఎన్ఎం పీక్ టార్క్ అందిస్తుంది. ఇందులో మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. 2024 కియా సోనెట్... టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, మారుతి బ్రెజా కార్లతో పోటీపడనుంది.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply
Also Read: సూపర్ హిట్ టయోటా కామ్రీ అప్‌డేటెడ్ వెర్షన్ త్వరలో - ఈసారి హైబ్రిడ్ ఇంజిన్‌తో!
Also Read: లాంచ్‌కు రెడీ అవుతున్న కొత్త స్విఫ్ట్ - సరికొత్త ఇంజిన్, సూపర్ లుక్‌తో!