ఈ 10 క్లాసిక్ క్రేజీ బైక్స్ మీ చిన్నప్పుడు చూసుంటారు - ఇప్పుడు మాయమైపోయాయి!
ఒకప్పుడు మంచి క్రేజ్ ఉండి తర్వాత మాయం అయిపోయినా బైక్స్ ఇవే.
మనదేశంలో ముఖ్యంగా యువతకు బైక్స్ అంటే ఉండే క్రేజే వేరు. స్కూల్ నుంచి కాలేజ్‌కి రావడం ఆలస్యం బైక్ ఎప్పుడు కొనాలనే తొందరలో ఉంటారు. అయితే ఒక బైక్ ఇంకా మిడిల్ క్లాస్ కు కూడా అందుబాటులో ఉంటే సూపర్ హిట్ అవటం దాదాపు ఖాయమే. 90వ దశకం రెండో భాగం, 2000వ దశకం మొదటి భాగంలో కొన్ని బైక్స్ ఇండియన్స్ రోడ్స్ ను హోరెత్తించాయి. కానీ పరిస్థితుల కారణంగా అర్థంతరంగా మార్కెట్స్ నుంచి మాయమయ్యాయి. అలాంటి వాటిలో టాప్-10 బైక్స్ (TOP 10 Disappeared Crazy Bikes on Indian Roads) ఏంటో ఓసారి చూద్దాం
1. రాజ్‌దూట్ జీటీఎస్ 175 (Rajdoot GTS 175)
రాజ్ కపూర్ బాబీ మూవీలో ఏమంటూ ఈ బండి వాడారో కానీ అప్పటి నుంచి తెగ పాపులర్ అయిపోయింది. ఇది మామూలు రాజ్ దూత్ బండికి మినీ వెర్షన్. 175 CC టూ స్టోక్ ఇంజిన్ తో విడుదలైన ఈ బండిని కొనటం అప్పట్లో చాలా మందికి డ్రీమ్. కానీ ఆ తర్వాత ఎందుకో ఫేడ్ అవుట్ అయిపోయింది మార్కెట్ నుంచి.
2. హీరో - బీఎండబ్ల్యూ ఫన్‌డ్యురో 650 (Hero - BMW FunDuro 650)
మారుతి ఎస్టీమ్ కి పోటీకి బైక్ ను దింపింది హీరో. అది కూడా BMW తో కలిసి. 1996 లో మార్కెట్ లోకి ఫన్ డ్యూరో 650 రేట్ అప్పట్లో టాప్. ఐదులక్షల రూపాయలు బండికి పెట్టాలంటే ఎంత ఆలోచించాలో అర్థం చేసుకోండి. 652 సీసీ ఇంజిన్, స్పోర్ట్ బైక్ లుక్ ఉండటం, పైగా అప్పట్లోనే డ్యుయల్ డిస్క్ బ్రేక్స్ అబ్బో ఫన్ డ్యూరో 650 రేంజ్ ఓ రకం కాదు లేండీ. కానీ ఇండియన్ మార్కెట్ ను అంత రేట్ తో అట్రాక్ట్ చేయలేకపోయింది ఈ బైక్.
3. బజాజ్ బాక్సర్ 150 (Bajaj Boxer 150)
ఆఫ్రికన్ మార్కెట్స్ కోసం బజాజ్ తయారు చేసిన బైక్ బజాజ్ బాక్సర్ 150. ఇండియాకు ఈ బండిని తీసుకువద్దామనే ఉద్దేశంతో ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో ఉపయోగపడాలని బాక్సర్ 150 ను ఇక్కడ మార్కెట్ లోనూ విడుదల చేసింది బజాజ్. బట్ అది అంతగా వర్కవుట్ కాలేదు. కానీ ఈ బండిని వాడిన వాళ్లు చెప్పేది ఏంటంటే బజాజ్ నుంచి బాక్సర్ బండులలో ఇదే ది బెస్ట్.
4. రాయల్ ఎన్‌ఫీల్డ్ మోఫా (Royal Enfield Mofa)
రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి ఇంత చిన్న బైక్ వస్తుందని కూడా ఎవరూ ఊహించి ఉండరు. రఘువరన్ బీటెక్ సినిమాలో ధనుష్ నడిపే చిన్న బైక్ ఇదే. కేవలం 22సీసీ ఇంజిన్ తో వచ్చిన ఈ మోఫా అప్పటివరకూ వచ్చిన రాయల్ ఎన్ ఫీల్డ్ భీకరమైన, పెద్ద బైక్ లతో పోలిస్తే చాలా సర్ ప్రైజ్ ప్యాక్ అని చెప్పుకోవాలి. కేవలం 30 కిలోలు మాత్రమే బరువుండే ఈ బైక్ లీటర్ పెట్రోల్ కు 90 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చేది. ఇంకో విషయం ఏంటంటే ఈ బైక్ నడపటానికి లైసైన్స్ కానీ, ఆర్టీవో పర్మిషన్ కానీ అవసరం లేకపోవటంతో చాలా మంది అప్పట్లో ఇంట్రెస్ట్ చూపించేవారని చెబుతుంటారు.
5. యమహా ఆర్ఎక్స్100 (Yamaha RX 100)
ఈ లిస్ట్ లో ఈ బండి లేకపోతే బైక్ లవర్స్ అస్సలు ఒప్పుకోరు. అంత క్రేజ్ ఉండేది Rx 100 అంటే. టూ స్టోక్ ఇంజిన్స్ బైక్స్ లో ఇప్పటికీ ఇదే టాప్ అని చెబుతారు. 98cc తో వచ్చిన ఈ బైక్ ఫర్ ఫార్మెన్స్ పరంగా చాలా మంచి స్టాండర్స్ సెట్ చేసింది. కానీ 1996 లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా టూ స్టోక్ బైక్స్ ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఫలితంగా చాలా మంది బాధగానే Rx 100 ను వదులుకున్నారు. కానీ ఇప్పటికీ రీమోడల్ చేయించుకుని వాడుతున్న వాళ్లు..అప్పట్లో బండి అమ్మిన రేట్ కంటే ఎక్కువ పెట్టి ఇప్పుడు కూడా ఈ బండిని కొంటున్న వాళ్లు కనపడుతూనే ఉంటారు.
6. హీరో హోండా సీడీ 100 (Hero Honda CD 100)
హీరో-హోండా జాయింట్ వెంచర్ ఇండియన్ ఆటో మొబైల్ ఇండస్ట్రీలో చాలా మంచి రికార్డ్స్ సెట్ చేసింది. ఈ జాయింట్ వెంచర్ లో వచ్చిన బైక్స్ లో హీరో హోండా సీడీ 100 చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఫోర్ స్టోక్ ఇంజిన్ 97 సీసీ తో వచ్చిన ఈ బైక్ మైలేజ్ పరంగా ఓ అద్భుతంగా. లీటరుకు 80 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తూ మిడిల్ క్లాస్ కు బాగా చేరువైంది సీడీ 100. తర్వాత సీడీ డీలక్స్, హెచ్ ఎఫ్ డీలక్స్ లాంటివి రావటం, హీరో హోండా నుంచి విడిపోయి సొంతంగా వాహనాలు తయారు చేయటంతో ఈ జాయింట్ వెంచర్ ఆగిపోయింది.
7. బజాజ్ కవాసాకి క్యాలిబర్ (Bajaj Kawasaki Caliber)
బజాజ్- కవాసాకి జాయింట్ వెంచర్ లో వచ్చిన బైక్ క్యాలిబర్. 1998 లో రిలీజైన బైక్ ఎక్కువగా ఇండియా రూరల్ ప్రాంతాలకు బాగా చేరువైన బైక్స్ లో ఒకటి. 111సీసీ ఇంజిన్ తో వచ్చిన ఈబైక్ 2006 వరకూ మార్కెట్ లో కనిపించింది తర్వాత ఆయిల్ ఫిల్టర్స్ తో ఇంప్రూ వ్ చేసి 4S పేరుతో అప్ గ్రేడ్ వెర్షన్ వదలటంతో మెల్లగా బజాబ్ క్యాలిబర్ మార్కెట్ నుంచి మాయమైంది.
8. బీఎస్ఏ బాండ్ 50 (BSA Bond 50)
1980లో BSA నుంచి వచ్చిన Bond 50 చాలా మందికి డ్రీమ్ బైక్. అసలు ఆ కలర్ లోనే ఓ మ్యాజిక్ ఉంది అనే వాళ్లు. చాలా మందికి BSA అనగానే సైకిళ్లే గుర్తొస్తాయి అసలు వాళ్ల నుంచి బైక్స్ కూడా వచ్చాయా అని ఆశ్చర్యపోతారు కానీ అప్పట్లో ఈ బైక్ ను కొనుక్కునేందుకు యూత్ చాలా ఇంట్రెస్ట్ చూపించేవాళ్లంట. 50సీసీ టూ స్టోక్స్ ఇంజిన్ తో రిలీజైన ఈబైక్ లో మోనో షాక్ సస్పెన్షన్ ను తొలిసారిగా వాడారు.
9. ఎల్ఎంఎల్ అడ్రెనో (LML Adreno)
అల్టిమేట్ స్టెబులిటీ అంటే LML Adreno పేరు చెప్పేవాళ్లు. 110 సీసీ 4స్టోక్ బైక్ ఇంజిన్ తో వచ్చిన ఈ బైక్ 100 కిలోమీటర్ల వేగంలోనూ ఎలాంటి వైబ్రేషన్స్ లేకుండా దూసుకెళ్లేది. లీటర్ ఫ్యుయల్ కు 70కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చేది. రేట్ మాత్రం ఎక్కువగా ఉండటం వల్ల ఓ బైక్ ఎల్ఎంల్ అడ్రినో అంతగా జనాల్లోకి వెళ్లలేకపోయింది. కానీ ఇప్పటికీ అడ్రినో పేరు చెబితే అప్పట్లో అడ్రినల్ రష్ అనే వాళ్లు చాలా మందే కనిపిస్తారు.
10. హీరో హోండా కరిజ్మా (Hero Honda Karizma)
హీరో హొండా కరిజ్మా బైక్. స్టన్నింగ్ లుక్ కి కేరాఫ్ అడ్రస్ లో నిలిచింది ఈ బండి. 2003లో లాంచ్ అయిన కరిజ్మా హీరో హోండా జాయింట్ వెంచర్ లోనే వచ్చింది. 223 సీసీ 4స్టోక్ ఇంజిన్ తో వచ్చిన బైక్ యూత్ ను విపరీతంగా అట్రాక్ట్ చేసింది. హీరో అండ్ హోండా విడిపోయిన తర్వాత హీరో మోటోకార్ప్ ఇదే బండిని ఆల్టర్స్ చేసి ZMR నువిడుదల చేయటంతో కరిజ్మా బండి తెరమరుగైపోయింది.
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?