By: ABP Desam | Updated at : 15 Aug 2021 12:58 AM (IST)
ఆగస్టు 15 నుంచి 21 వరకూ వారఫలాలు
మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలున్నాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండండి. కార్యాలయంలో మీ ప్రత్యర్థులు మీ పనిలో అడ్డంకులు సృష్టించవచ్చు. అప్రమత్తంగా వ్యవహించడం అవసరం. ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. చికిత్సకు ఎక్కువ ఖర్చు అవుతుంది. బాధ్యతను నిర్వర్తించడంలో సోమరితనం వద్దు. ఆహారం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. పెట్టుబడి పెట్టేందుకు శుభసమయం.
వృషభరాశివారు ఈ వారం బిజీబిజీగా ఉంటారు. ఆర్థికంగా అనుకూలతో పాటూ...ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఉద్యోగస్తులు శుభవార్త వింటారు. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం క్షీణించవచ్చు. కార్యాలయంలో సహోద్యోగులతో సామరస్యం ఉంటుంది. మీ పైస్థాయి అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. మీ ఇష్టదైవాన్ని పూజించడంతో పాటూ...అవసరమైన వారికి సహాయం చేయడానికి ప్రయత్నించండి. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.
మిథునరాశివారికి ఈ వారం పనిసాగదు. సకాలంలో పనులు పూర్తిచేయలేకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంటుంది. విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. పెళ్లి సంబంధాలు వెతికే వారికి అనుకూల సమయం. మీ ఇష్టదైవంపై మనసు పెట్టండి. జీవిత భాగస్వామి సహాయంతో సమస్యలను అధిగమిస్తారు. పిల్లల అవసరాలను తీర్చగలుగుతారు. వివాదాల్లో తలదూర్చొద్దు. తెలియని వ్యక్తులకు దూరంగా ఉండండి.
Also Read:ఈ రాశులవారి ఆలోచనలు డబ్బుచుట్టూనే తిరుగుతాయ్…డబ్బు-పరపతి చూశాకే ప్రేమలో పడతారు…https://telugu.abplive.com/lifestyle/zodiac-signs-their-thoughts-on-these-constellations-revolve-around-money-and-fall-in-love-with-people-1604
Also Read: ఈ ఐదు రాశులవారు ప్రేమ వివాహలకే ఆసక్తి చూపిస్తారు, ఆరు నూరైనా సరే!
కర్కాటక రాశివారు మానసింకగా దృఢంగా ఉండాలి. స్నేహితుల సహాయంతో కొన్ని పనులు పూర్తవుతాయి. చట్టపరమైన విషయాలు ముందుకు సాగుతాయి. ఆర్థిక పరిస్థితి బావుంటంది. వ్యాపారులకు అనుకూల సమయం. వారం మధ్యలో కొన్ని సమస్యలు ఎదరవుతాయి. ఏదో తెలియని భయం మిమ్మల్నివెంటాడుతుంది. బంధువులను కలుస్తారు... ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి.
మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అసభ్యకరమైన పదాలు ఉపయోగించవద్దు. వ్యాపారం బాగా జరుగుతుంది. స్నేహితులను కలుస్తారు. చట్టపరమైన విషయాల్లో పురోగతి నెమ్మదిగా ఉంటుంది. సామాజిక సేవలో పాల్గొంటారు. ఎక్కడైనా బయటకు వెళ్లాల్సి రావచ్చు. ఆధ్యాత్మికత వైపు ఎక్కువ దృష్టి సారిస్తారు. మీ పనులు సమయానికి పూర్తవుతాయి. ఇంట్లో ఒకరి ఆరోగ్యం క్షీణించవచ్చు. జీవిత భాగస్వామితో సామరస్యం ఉంటుంది.
కుటుంబ బాధ్యతలు నెరవేర్చాల్సి ఉంటుంది. ఈ వారం ఎవరితోనైనా వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. మీ మాటపై సంయమనం పాటించండి. ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. యువత ఉత్సాహంగా ఉంటారు. అప్పులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వ్యాపారులకు శుభసమయం. పెట్టుబడులు పెరుగుతాయి. వ్యసనాలకి దూరంగా ఉండండి. స్థిరాస్తి కొనుగోలుకు మంచి సమయం...
Also Read: ఈ రాశులవారు ప్రేమను కోరుకుంటారు…ఈ రాశుల వారు ఎంజాయ్ చేయాలనుకుంటారు
Also Read: ఆగస్టు నెలలో ఏ రాశివారికి ఎలా ఉందంటే…. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారమే….
ఉద్యోగస్తులకు బదిలీ ఉండే అవకాశం. ఖర్చులు అధికంగా ఉంటాయి..ధనం దుర్వినియోగానికి దూరంగా ఉండండి.. పై అధికారుల ప్రవర్తన మిమ్మల్ని బాధిస్తుంది. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. పనిలో పురోగతి ఉంటుంది. ఈ వారం మీకు ఆహ్లాదకరమైన సమాచారం లభిస్తుంది. పాత స్నేహితులను కలుస్తారు. పని ముందుకు సాగుతుంది. కొత్త వ్యాపారం ప్రారంభించవచ్చు. ఎవరితోనైనా భిన్నాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది. అప్పులు తిరిగి చెల్లించండి.
వృశ్చికరాశి వారికి ఈ వారం అద్భుతంగా ఉంటుంది. దేవుని ఆరాధనలో మనసు లగ్నం చేస్తారు. అనుకున్న సమయానికి పనులు పూర్తిచేస్తారు. సంక్షోభ పరిస్థితుల నుంచి బయటపడగలరు. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. వివాదాస్పద పరిస్థితులకు దూరంగా ఉండండి. కొత్త ప్రారంభించిన పనుల్లో అనుకూల ప్రయోజనాలుంటాయి. బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు.
ధనస్సు రాశివారు సంతోషంగా ఉంటార. వ్యాపారంలో కలిసొస్తుంది. ఆరోగ్యానికి సంబంధించి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. స్నేహితుల మద్దతు లభిస్తుంది. వివాహితులు సంతోషంగా ఉంటారు. వివాదాలు తొలగిపోతాయి. సోమరితనం వద్దు. విలువైన వస్తువులను జాగ్రత్త చేయండి. మీ ప్రతిష్ట పెరుగుతుంది. బంధువులతో ఆనందంగా ఉంటారు. యువతకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది.
Also Read: Astrology Tips: ఈ రాశుల వాళ్లు సీతయ్యలు…ఎవ్వరి మాటా వినరు
Also Read: మీ నక్షత్రం...మీ రాశి....ఏ నక్షత్రానికి ఏ అక్షరాలో ఇలా తెలుసుకోండి...
మకరరాశివారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇబ్బందులు ఉంటాయి...ఆహ్లాదకర సమాచారమూ అందుకుంటారు. ఈ వారం కుటుంబ కార్యక్రమాలకు ఎక్కువ ఖర్చు చేస్తారు. ప్రమాదకర పనులు చేయొద్దు...గాయపడే అవకాశం ఉంది. ఈ వారం ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. కార్యాలయంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారం బాగా జరుగుతుంది. స్నేహితులను కలుస్తారు.
మీరు ఈ వారం ఖర్చులను నియంత్రించగలరు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. విలువైన వస్తువుల విషయంలో నిర్లక్ష్యం వద్దు. కొత్త పనులు ప్రారంభించేందుకు ఈ వారం మంచి సమయం. మీ ప్రవర్తనతో అందర్నీ ఆకట్టుకుంటారు. ఎక్కువ రిస్క్ తీసుకోకండి. కార్యాలయ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు ముందుకు సాగుతాయి. శుభవార్త వింటారు. వైవాహిక జీవితంలో సంతోషకరమైన క్షణాలు ఉంటాయి. స్నేహితులతో సమయం గడపవచ్చు. పెద్దల సలహాల నుంచి ప్రయోజనం పొందుతారు.
భగవంతుడిని పూజించడంపై ఆసక్తి ఉంటుంది. దినచర్యలో మార్పులుంటాయి. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆకస్మిక పర్యటనకు వెళ్లాల్సి రావచ్చు. ఆఫీసులో పని ఒత్తిడి ఉంటుంది. వివాదాలు జరిగే అవకాశం ఉంది... మాటలు అదుపులో ఉంచుకోండి. న్యాయపరమైన చిక్కుల్లో పడొచ్చు. కుటుంబ సభ్యుడికి ఆర్థిక సహాయం అందిస్తారు. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది
Also Read: మీ పిల్లలు ఈ రాశుల్లో పుట్టారా?...అయితే చాలా తెలివైన వాళ్లు…
https://telugu.abplive.com/astro/children-of-these-zodiac-signs-are-really-intelligent-94
Horoscope 6th August 2022: ఆగస్టు 6 రాశిఫలాలు - ఈ రాశులవారికీ ఈ రోజు చాలా బ్యాడ్ డే!
Horoscope 5th August 2022: ఈ రాశుల వారు మాటలు తగ్గించడం మంచిది, ఖర్చులు కూడా ఎక్కువే, ఆగస్టు 5న మీ రాశిఫలితం ఇలా ఉంది
Varalakshmi Vratham 2022: గణపతి ఆరాధన అనంతరం వరలక్ష్మీ వ్రతం విధానం part-2
Varalakshmi Vratham 2022: వరలక్ష్మీ వ్రతం ఇలా చేసుకోండి part-1
Horoscope 4th August 2022 Rashifal : ఈ రాశులవారు సమస్యలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు, ఆగస్టు 4 రాశిఫలాలు
Nikhat Zareen Gold Medal : నిఖత్ జరీన్ కు సీఎం కేసీఆర్ ఫోన్, స్వర్ణ పతకం సాధించడంపై సంతోషం వ్యక్తం
CM Jagan : వ్యవసాయం, విద్యా రంగాలకు అత్యంత ప్రాధాన్యత- సీఎం జగన్
Nikhat Zareen Wins Gold: తెలంగాణ అమ్మాయి పంచ్ పవర్ - బాక్సర్ నిఖత్కు స్వర్ణం
Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్