అన్వేషించండి

Weekly Horoscope 08- 14 January 2024: ఈ వారం ఈ ఒక్క రాశివారికి మినహా మిగిలిన అందరకీ అనుకూల ఫలితాలే - జనవరి 08 to14 వారఫలాలు

Weekly Horoscope January 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....

Weekly Horoscope 08- 14 January 2024: జనవరి 08 నుంచి 14  వరకూ మేష రాశి నుంచి మీన రాశి వారఫలాలు

మేష రాశి (Aries Weekly Horoscope )

ఈ వారం ప్రారంభం నుంచి అనుకున్న పనులు నెరవేరుతాయి. వారం మొత్తం ఉత్సాహంగా ఉంటారు. జీవనోపాధికి సంబంధించిన రంగాలలో గొప్ప విజయం సాధిస్తారు.  ఉద్యోగులకు పదోన్నతులు లభించే అవకాశం ఉంది. చంద్రుడి సంచారం మీకు వ్యాపారంలో మెరుగైన ఫలితాలను అందిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులు చదువుపై పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తేనే మంచి ఫలితాలు పొందుతారు. బంధువులను కలిసేందుకు దూరం ప్రాంతాలకు వెళతారు. ఆరోగ్యం బలహీనంగా అనిపిస్తుంది.

వృషభ రాశి (Taurus Weekly Horoscope )

ఈ వారం వృషభ రాశి వారు భవిష్యత్ ప్రణాళికలు వేసుకునేందుకు మంచి సమయం. రాజకీయ జీవితాన్ని అద్భుతంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తారు. ఈ వారం గ్రహసంచారం మీకు ఆనందాన్ని, అదృష్టాన్ని ఇస్తుంది. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారులు నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగులు అద్భుతమైన ఫలితాలు పొందుతారు. విద్యార్థులు మరింత కష్టపడాలి. పోటీ పరీక్షలో ఆశించిన ఫలితాలు సాధించడం కష్టమే. వారం ఆరంభంలో కన్నా చివర్లో ఆర్థికంగా మంచి ఫలితాలు పొందుతారు. వైవాహిక జీవితం బావుంటుంది. ప్రేమ సంబంధాలు కలిసొస్తాయి. వారం చివర్లో అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. మనోధైర్యంతో ఉండాలి ముందస్తు ప్రణాళికతో ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. 

Also Read: సంక్రాంతికి మీరు పాటించాల్సిన 5 విషయాలు!

మిథున రాశి (Gemini Weekly Horoscope ) 

ఈ వారం మిథున రాశి వారికి నూతన పెట్టుబడులు కలిసొస్తాయి. స్థిరాస్తి విషయంలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు..కోర్టుల వరకూ వ్యవహారం వెళ్లే అవకాశం ఉంటుంది. వారం ప్రారంభం నుంచి ఏదో అనారోగ్యం వెంటాడుతుంది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చేసుకోవడం మంచిది . వారం ద్వితీయార్ధంలో వ్యాపారానికి సంబంధించిన పరిశ్రమలు మంచి లాబాలు ఆర్జిస్తారు.కుటుంబంలో ఏదైనా శుభ కార్య నిర్వహణపై దృష్టి సారిస్తారు . తల్లిదండ్రుల కారణంగా ఉత్సాహంగా ఉంటారు. ప్రేమ సంబంధాలలో కొన్ని సమస్యలుంటాయి.  చురుగ్గా తీసుకునే నిర్ణయాలు లక్ష్యాన్ని చేరువ చేస్తాయి. కొందరి ప్రవర్తన మిమ్మల్ని ఇబ్బందిపెడుతుంది. ఏకాగ్రతతో బాధ్యతలను పూర్తిచేయండి. 

కర్కాటక రాశి (Cancer Weekly Horoscope  )  

ఈ వారం కర్కాటక రాశి వారి వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. గతంలో ఉండే విభేధాలను పరిష్కరించుకుంటారు. రాజకీయ నాయకులు తమ పరిధి పెంచుకునేందుకు కలిసొచ్చే సమయం ఇది. వారం ఆరంభంలో కన్నా ద్వితీయార్థంలో పని ఒత్తిడి పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. నూతన పెట్టుబడులు కలిసొస్తాయి. ఆహారాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.  వారాంతంలో శుభకార్యాల నిర్వహణపై ఆలోచిస్తారు. విదేశాలకు వెళ్లాలి అనుకునేవారికి ఎదురైన అడ్డుంకులు ఈ వారం తొలగిపోతాయి.  ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. ఖర్చులు అదుపులోకి వస్తాయి. 

Also Read: సంక్రాంతి వచ్చేస్తోంది - మీకు పట్టిన శనిని ఇలా వదిలించేసుకోండి!

సింహ రాశి (Leo Weekly Horoscope  )

ఈ వారం సింహ రాశి  ప్రభుత్వ ఉద్యోగులు బదిలీకి సంబంధించిన సమాచారం వినే అవకాశం ఉంది. చేపట్టే ప్రయత్నాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. ఈ వారం ఆరంభంలో ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ద్వితీయార్థంలో వైవాహిక బంధంలో సంతోషం ఉంటుంది. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. అవివాహితులకు వివాహం నిశ్చయమయ్యే సూచనలున్నాయి. ఈ రాశి రాజకీయనాయకులు ప్రత్యర్థులను కరెక్టుగా టార్గెట్ చేయగలరు. వారాంతంలో ఆనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి.  పూర్తిస్థాయిలో అవగాహన లేకుండా ఏ పనీ తలపెట్టవద్దు.  సకాలంలో పనులు ప్రారంభిస్తే ఉత్తమ ఫలితాలు పొందుతారు. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. 

కన్యా రాశి  (Virgo Weekly Horoscope  ) 

ఈ వారం కన్యా రాశి వారు తమ సామాజిక,   రాజకీయ జీవితంలో పురోగతి కోసం కొన్ని ఆకర్షణీయమైన ప్రణాళికలను ప్రారంభిస్తారు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల సమయం ఇది. ఆర్థిక పరిస్థితి గతవారం కన్నా మెరుగుపడుతుంది. ఉద్యోగంలో మీ పనితీరుకి ప్రశంసలు అందుకుంటారు.  శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది.  ఏ విషయంలోనూ చెడు ఊహించవద్దు. బంధువులను కలవాల్సి వస్తుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ప్రేమ జీవితంలో ఉండేవారు పెళ్లి దిశగా అడుగేసేందుకు మంచి సమయం ఇది. ఈ వారం ఆరోగ్యంలో హెచ్చుతగ్గులుంటాయి. అనవసర వివాదాలకు దూరంగా ఉండడం మంచిది . 

Also Read: ధనస్సులోకి శుక్రుడు, 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి!

తులా రాశి (Libra Weekly Horoscope  ) 

ఈ వారం తుల రాశి రాజకీయ నాయకులు ఏదో ఒత్తిడి మధ్య బిజీబిజీగా ఉంటారు. ఈ వారం గ్రహాల సంచారం అంత అనకూల ఫలితాలను ఇవ్వడం లేదు. ఫలితంగా వ్యాపారులు సవాళ్లు ఎదుర్కోక తప్పదు. కుటుంబంలో సమస్యలు పెరుగుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి.  అవగాహన లేని విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. వారం మధ్యలో కొన్ని పనులు పూర్తిచేయడంలో ఇబ్బంది పడతారు. కాస్త తెలివిగా ఆలోచించండి. వారం చివర్లో వైవాహిక జీవితంలో కొంత ప్రశాంతత ఉంటుంది. పిల్లల సానుకూల ప్రవర్తన మీలో సంతోషాన్ని నింపుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.  ప్రణాళిక ప్రకారం పనులు చేస్తేనే పూర్తవుతాయి. 

వృశ్చిక రాశి (Scorpio Weekly Horoscope ) 

ఈ వారం వృశ్చిక రాశివారికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. నూతన పెట్టుబడులు లాభాన్నిస్తాయి. సకాలంలో నిర్ణయాలు తీసుకుని అమలుచేయండి.  అపార్థాలకు అవకాశం ఇవ్వవద్దు. సినిమా, కళ, సంగీతం రంగాల్లో ఉండేవారు కీర్తి పొందుతారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలుంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. బంధువులతో మంచి సమన్వయం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. వారం ద్వితీయార్థంలో భూమి, భవన నిర్మాణ విషయాల్లో ఊహించిన దానికంటే ఎక్కువ విజయం సాధిస్తారు. వారాంతంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి. విద్యార్థులకు శుభ ఫలితాలున్నాయి. వృత్తి జీవితంలో ఇబ్బందులు వచ్చినా సమసిపోతాయి. 

ధనుస్సు రాశి  (Sagittarius Weekly Horoscope) 

గడిచిన వారం కన్నా ఈ వారం ధనస్సురాశివారికి అన్ని విషయాల్లో ఉపశమనం లభిస్తుంది. గందరగరోళ స్థితి నుంచి బయటపడతారు. ఆర్థికపరంగా మంచి ఫలితాలు సాధిస్తారు. చేపట్టిన పనులు పెండింగ్ లేకుండా పూర్తిచేస్తారు. ఆత్మవిశ్వాసంతో ఉంటారు. వృత్తి, ఉద్యోగ జీవితంలో బిజీగా ఉంటారు.చాలా కాలం తర్వాత మీరు గతంలో పనిచేసిన రంగంలో అడుగుపెట్టడంతో ఉత్సాహంగా అనిపిస్తుంది. వారం ఆరంభంలో ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్, ఆర్ట్, మెడిసిన్ మరియు ప్రొడక్షన్ అండ్ సేల్స్ రంగాలలో ఉండేవారికి విజయం ఉంటుంది. ప్రయాణం చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. 

Also Read: 100 ప్రాంతాల మట్టి, 7 కోట్ల వ్యయం - అయోధ్యలో వెలగనున్న అతి పెద్ద దీపం ప్రత్యేకతలివే!

మకర రాశి (Capricorn Weekly Horoscope ) 

ఈ వారం గ్రహ సంచారం వ్యక్తిగత , వ్యాపార జీవితంలో గొప్ప పురోగతికి అవకాశాలను ఇస్తుంది. ఉత్పత్తి మరియు అమ్మకాల రంగమైనా లేదా మరే ఇతర రంగమైనా లాభదాయకమైన పరిస్థితి ఉంటుంది. మీరు ఈ వారం మీ వ్యాపారాన్ని విస్తరించాలని ప్రయత్నిస్తుంటే ఆ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆరోగ్య పరంగా ఈ వారం మొదటి నుంచి అనుకూల ఫలితాలు ఉంటాయి. అయితే వారం ద్వితీయార్థంలో సంబంధిత మూలధన పెట్టుబడులు, విదేశీ పనుల్లో మంచి పురోగతి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేయవలసి ఉంటుంది. వైద్య రంగంలో ఉండేవారు కొన్ని సవాళ్లను ఎదుర్కోక తప్పదు. మీ ప్రవర్తన ప్రశంసలు అందుకుంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు 

కుంభ రాశి  (Aquarius Weekly Horoscope ) 

ఈ వారం కుంభ రాశి వారికి కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల గురించి ఆందోళన పెరుగుతుంది కానీ ఈ వారం ఫలితాలు మీకు అనుకూలంగా మారుతాయి. ఆర్థిక విషయాలలో మీరు పెరుగుతున్న ఖర్చుల భారంతో ఇబ్బంది పడతారు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.  ఆహారపు అలవాట్లపై పూర్తి శ్రద్ధ పెడితే బాగుంటుంది. వారం రెండవ భాగంలో మీ ఆరోగ్యం మళ్లీ మెరుగుపడుతుంది, జీవనోపాధి రంగాల్లో మంచి పురోగతి ఉంటుంది. వివాహ ప్రయత్నాల్లో ఉన్నట్టేతే అవి ఫలించే సూచనలున్నాయి. ఈ వారం పెట్టే పెట్టుబడులు భవిష్యత్ లో కలిసొస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. 

మీన రాశి (Pisces Weekly Horoscope ) 

ఈ వారం ఈ రాశి ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రతిపాదనలు, ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారంలో నూతన పెట్టుబడుల గురించి ఆలోచిస్తారు...మంచి లాభాలు ఆర్జిస్తారు. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది.  వారం మధ్యలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ వారం ద్వితీయార్థంలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు.  సున్నితమైన అంశాలపై అతిగా ఆలోచించవద్దు.  ఏ విషయంలోనూ చెడును ఊహించవద్దు.  విద్యార్థులకు శుభసమయం. ఓవరాల్ గా చిన్న చిన్న విషయాలు వదిలేస్తే ఈ వారం మీనరాశివారికి సానుకూల ఫలితాలున్నాయి. 

గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget