అన్వేషించండి

Weekly Horoscope 19 to 25 June 2023: ఈ రాశులవారికి ఐశ్వర్యం, ఆనందం, ఆరోగ్యం - జూన్ 19 నుంచి 25 వరకూ వారఫలాలు

Weekly Horoscope : ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

Weekly Horoscope 19 to 25 June 2023:  ఈ వారం  ఏ రాశివారికి ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.

మేష రాశి
మేష రాశి వారికి ఈ వారం శుభ ఫలితాలు లభిస్తాయి. ప్రేమ , విలాసాలకు సమయం కేటాయిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది, మనస్సు కూడా సంతోషంగా ఉంటుంది. ఆర్థిక విషయాలలో కొంత గందరగోళం ఉండవచ్చు. ఏదైనా డాక్యు మెంట్స్ పై  సంతకం చేసే ముందు ఒకసారి తనిఖీ చేయండి. వ్యక్తిగత జీవితంలో నూతన ప్రణాళికలు ఏర్పడతాయి. కుటుంబ సంబంధాలలో సానుకూల మార్పులు ఉంటాయి. నూతన గృహ కొనుగోలుకు ప్రణాళికలు రూపొందిస్తారు. మీ ప్రసంగం ఆకర్షణీయంగా ఉంటుంది. లక్కీ కలర్ బ్రౌన్.

వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ వారం కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నియమాలు పాటించండి. అతివేగం అస్సలు పనికిరాదు. ఆఫీసులో వచ్చిన అవకాశం వలన  దీర్ఘకాలంలో ధనలాభం కలుగుతుంది. ఏదైనా ఫలితం కోసం ఎదురుచూస్తే విజయం సాధిస్తారు. వ్యక్తిగత జీవితంలో వివేకాన్ని ఉపయోగించడం, ఇతరులకు అభిప్రాయాలు విలువ ఇవ్వడం. అప్పుడే మీరుజీవితం లో విజయంసాధించే దిశగా ముందుకు వెళ్ల గలుగుతారు. ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి, అసంపూర్తిగా ఉన్న పనులను త్వరగా పూర్తి చేస్తారు. లక్కీ కలర్: పసుపు

మిథున రాశి
మిథున రాశి వారు ఈ వారం మిశ్రమ ఫలితాలుంటాయి. విజయాన్ని సానుకూలంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. దేని గురించైనా టెన్షన్ ఉండవచ్చు, ధ్యానం చేయడం మర్చిపోవద్దు, పనిప్రాంతంలో మీ మర్యాదపూర్వక ప్రవర్తన వల్ల ప్రయోజనం పొందుతారు. జూనియర్లతో మంచి సంబంధాలు ఏర్పడతాయి, వ్యక్తిగత జీవితంలో ఒడిదొడుకులు ఉండవచ్చు. ఇతరులు మిమ్మల్ని తప్పుదారి పెట్టే అవకాశం ఉంది జాగ్రత్త. సంబంధ బాంధవ్యాలకు సమయం కేటాయించండి. అనవసరమైన పనుల్లో సమయాన్ని వృథా చేయకండి. రోజూ  సూర్యభగవానుడికి నీటిని దారపోయండి. లక్కీ కలర్ పింక్

Also Read: పురాణాల్లో ఈ వీరులంతా 'నాన్నకు ప్రేమతో' బ్యాచ్!

కర్కాటక రాశి
ఈ రాశి వారికి ఈ వారం అదృష్టం లభిస్తుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. అనేక లక్ష్యాల కారణంగా ఒత్తిడి ఏర్పడుతుంది. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తప్పుడు నిర్ణయాల వల్ల నష్టాలు ఎదురవుతాయి. అనవసర ఖర్చులు చేయకండి. వ్యక్తిగత జీవితంలో ఒడిదొడుకులు ఎదురవుతాయి. డబ్బు గురించి ఎవరితోనైనా వివాదం ఉండవచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఈ వారం మీ అదృష్టం బాగానే ఉంటుంది. అనేక ఇబ్బందులను మీరే నివారించుకుంటారు. లక్కీ కలర్ వయొలెట్

సింహ రాశి
సింహ రాశి వారికి ఈ వారం అన్నిటా  లాభాలు, ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు. పని ప్రదేశంలో కాలక్రమేణా సానుకూల మార్పులు ఉంటాయి. తొందరపడి ఏ నిర్ణయాన్ని తీసుకోవద్దు. వ్యక్తిగత జీవితంలో అనవసరమైన సవాళ్లు ఎదురవుతాయి. గట్టి  ప్రయత్నం చేస్తే మంచి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. భవిష్యత్తు ప్రణాళికకు సమయం అనుకూలంగా ఉంటుంది. లక్కీ కలర్ ఆరెంజ్

కన్యా రాశి 
కన్యా రాశి వారికి ఈ వారం చుట్టూ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. చాలా ఉత్సాహంగా ఉంటారు, అసంపూర్తిగా ఉన్న పనులు దైవ ఆశీస్సులతో పూర్తవుతాయి. కార్యాలయంలో మీ జూనియర్లతో దురుసుగా ప్రవర్తించకండి, కోపాన్ని నియంత్రించుకోవాలి,  ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నించాలి. మీరు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆర్థిక నిర్ణయం తీసుకుంటారు. ఇతరులు మిమ్మల్నితప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తారు అప్రమత్తంగా ఉండండి. మీ స్వంత నిర్ణయాలు తీసుకోండి. నిజాయితీ, కృషి ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది, ప్రయత్నిస్తూ ఉండండి. లక్కీ కలర్ ఎరుపు

తులా రాశి
ఈ వారం అవగాహనతో మెలగండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి,  ఆలోచనలను సానుకూలంగా ఉంచుకోవాలి. అనుకూల పరిస్థితులను క్రియేట్ చేసుకోండి. పని చేసే చోట అనేక కొత్త అవకాశాలు మీ జీవితంలో సానుకూల మార్పులను తీసుకువస్తాయి. వ్యక్తిగత జీవితంలో మీ కంటే చిన్నవారితో మంచి ప్రవర్తన కొనసాగించండి. ఎవరి మాటను విస్మరించకండి. మీ విజయాలతో ప్రేరణ పొంది ముందుకు సాగండి. లక్కీ కలర్: నీలం

వృశ్చిక రాశి
ఈ వారం షార్ట్ కట్స్ కు దూరంగా ఉండాలి, ఆరోగ్యం బాగుంటుంది. మీ చుట్టుపక్కల వారితో సత్సంబంధాలు నెలకొంటాయి. పని ప్రదేశంలో ఇతరుల పట్ల అసూయ పడకండి. మీ పనిపై శ్రద్ధ వహించండి. ధ్యానం చేయండి. వ్యక్తిగత జీవితంలో సంతోషంగా ఉంటారు . కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఎవరినీ నిరాశపరచవద్దు, పనిని నిజాయితీగా పూర్తి చేయండి. లక్కీ కలర్ బ్రౌన్.

Also Read: వస్తున్నాయ్ వస్తున్నాయ్ జగన్నాథ రథ చక్రాల్, గర్భగుడి నుంచి జనం మధ్యకు జగన్నాథుడు!

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి ఈ వారం దైవ మార్గదర్శకత్వం లభిస్తుంది, ఆరోగ్యంలో ఒడిదొడుకులు ఉంటాయి. బయట భోజనం చేయొద్దు. హుషారుగా ఉండండి. పనిప్రాంతంలో కీర్తిని పొందుతారు, సూర్యభగవానుని ఆరాధన మంచి చేస్తుంది. వ్యక్తిగత జీవితంలో సంతోషం ఉంటుంది. భాగస్వామితో సంబంధాలు బలపడతాయి, దైవానుగ్రహం లభిస్తుంది, జీవితంలో స్థిరత్వం వస్తుంది.  ప్రయాణం లాభసాటిగా సాగుతుంది. దేవుడిని నమ్మండి. లక్కీ కలర్ మెరూన్

మకర రాశి
మకర రాశి వారికి ఈ వారం శుభవార్త అందుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. గందరగోళానికి దూరంగా ఉండాలి. ఎవరి మాటలను మనసులో పెట్టుకోకండి. ఉద్యోగ సంబంధ విషయాలలో కొత్త ప్రణాళికలు వేసి అనుకున్నది సాధిస్తారు. దైవ సహాయం అందుతుంది. వ్యక్తిగత జీవితంలో గౌరవం పెరుగుతుంది. అకస్మాత్తుగా కుటుంబ సభ్యుల నుంచి ధనం అందుతుంది. త్వరలో మీరు ఒక వేడుకలో పాలుపంచుకుంటారు. జీవితంలో ఓ కొత్త అవకాశం మీకు ఆనందాన్ని ఇస్తుంది. లక్కీ కలర్ వైట్

కుంభ రాశి
కుంభ రాశి వారు ఈ వారం ఓపికగా ఉండాలి, భాగస్వామితో విభేదాల కారణంగా టెన్షన్ ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అనవసర ఖర్చులు చేయకూడదు. ఆఫీసులో గౌరవం పెరుగుతుంది. మీ లక్ష్యాన్ని సాధిస్తారు. దైవానుగ్రహం పొందుతారు. వ్యక్తిగత జీవితంలో ఎవరి మాటలను మనసుకి తీసుకోకండి. మీ గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.లక్కీ కలర్  వయొలెట్

మీన రాశి
మీన రాశి వారికి ఈ వారం జీవితంలో స్పష్టత లభిస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది . విశ్లేషణాత్మక శక్తి బలంగా ఉంటుంది, ఈ రోజు మీ మనస్సును చెప్పేది చేయండి.  కార్యాలయంలో సరి అయిన మద్దతు లేకపోవడం వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది, వ్యక్తిగత జీవితంలో ఆనందం ఉంటుంది. మీరు పిల్లలతో కొంత సమయాన్ని గడుపుతారు, పిల్లలకోసం ఎదురు చూసే  వారికి త్వరలో శుభవార్త అందుతుంది. శివారాధన మీ అదృష్టాన్నిఇనుమడింప  చేస్తుంది. లక్కీ కలర్ సీ గ్రీన్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ustad Zakir Hussain Passed Away: తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Best Chess Apps: ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ustad Zakir Hussain Passed Away: తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Best Chess Apps: ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
TSPSC Group 2 Exam: సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
Manchu Manoj Vs Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
YSRCP On One Nation One Election: 2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
Embed widget