ఆలయాలకు ఇవి దానం చేస్తే సిరిసంపదలు కలుగుతాయి ఆలయానికి భక్తులు రావడం విరాళాలు ఇవ్వడం చూస్తుంటాం. మరి ఆలయాలకు ఏఏ వస్తువులు దానం చేస్తే ఎలాంటి ఫలితం పొందుతారో తెలుసా ఆలయ ప్రాంగణాన్ని అంతట పరిశుభ్రంగా ఉంచడం, ఆలయానికి రంగులు వేయడం వంటివి చేస్తే దేవుని అనుగ్రహానికి పాత్రులవుతారు ఆలయానికి గంటను దానం చేయడం వల్ల గొప్ప కీర్తి లభిస్తుంది దేవుడు గుడికి శంఖం దానం చేయడం వల్ల సిరిసంపదలు దేవుడు అందిస్తాడు నువ్వులను దానం చేసిన వారికి చేసిన పాప కర్మలు నశిస్తాయి ఆలయ ప్రాంగణంలో పందిర్లు నిర్మించడం వల్ల మానసిక ప్రశాంతత సిద్ధిస్తుంది ఆలయానికి లోహాలు దానం చేయడం వల్ల కోరికలు తీరుతాయి ఆలయ ప్రాంగణంలో అన్నదానం చెయ్యడం వల్ల రాబోయే పది తరాల వారికి మంచి జరుగుతుంది ఆలయానికి అద్దం దానం చేయడం ద్వారా మంచి రూపం లభిస్తుంది Images Credit: Pinterest