చాణక్య నీతి: ఈ 8 మంది ఇతరుల దుఃఖాన్ని తెలుసుకోలేరు



రాజా వేశ్యా యమశ్చాగ్నిః చౌరాః బాలక యాచకః
పరదుఃఖం న జానన్తి అష్టమో గ్రామకర్ణకాః



ఎవరెవరు ఎదుటివారి బాధను పట్టించుకోరో వారి గురించి ఈ శ్లోకంలో వివరించాడు ఆచార్య చాణక్యుడు



రాజు, వెలయాలు, యముడు, అగ్ని, దొంగ, పిల్లవాడు, బిచ్చగాడు, గ్రామకరణం ఈ ఎనిమిది మందీ ఎదుటివారి బాధను అస్సలు పట్టించుకోరట



రాజుకి అసలు దుఃఖం ఎలా ఉంటుందో తెలియదు. రాచకార్యాలు నడిపే రాజు కఠినంగా ఉన్నప్పుడే చాలా సమస్యలను ఎదుర్కోగలడు, పరిష్కరించగలడు. అందరి కష్టాలు, నష్టాలు తెలుసుకుంటూ పోతే పాలన చేసేదెప్పుడు.



వేశ్యకి ఎవరి కష్టాలతోనో పనేముంటుంది. ఆమెకు డబ్బుతోనే పని, ఎవరి ఇల్లు కూలితే ఆమెకేంటి.



దొంగకి దొంగిలించడమే వృత్తి. తనకు కావాల్సిన డబ్బు, నగలపై దృష్టి పెడతాడు కానీ ఆ ఇంట్లో వాళ్లు ఎంత బాధపడతారో ఆలోచించడు కదా



చిన్న పిల్లాడికి ఏమీ తెలియదు. తనకు ఏం కావాలో అది సాధించుకోవడమే పని. అందుకే తమ పని అయ్యేవరకూ ఏడుస్తూనే ఉంటారు



అడుక్కునేవాడికి అందరి ముందూ చేయిచాచడమే పని. ఎవరు ఏమనుకంటే తనకేంటి



ఇంకొందరికి ఇద్దరి మధ్య తగవులు పెట్టడమే పని. వాళ్లు వాళ్లు ఎలా కొట్టుకుచస్తారో పట్టదు. ఎదుటివారి మధ్య వివాదం చూసి వీరిలో ఆనందం ఉప్పొంగుతుంది



ఇతరుల దుఃఖాన్ని యమధర్మరాజు కూడా చూడడు. ఎదుటివారి బాధను యమధర్మరాజు పరిగణలోకి తీసుకుంటే తన పాశానికి పని చెప్పలేడు.



Images Credit: Pinterest