దాదాపు అన్ని మతాలల్లోనూ అన్ని సంస్కృతుల్లోనూ బల్లులు ప్రత్యేకమైన ప్రతీకాత్మకత కలిగిన జీవులు. ఆధ్యాత్మిక సంకేతాలుగా కూడా భావిస్తారు.
ఇంట్లో బల్లి కనిపించిందంటే మీ ఇల్లు సురక్షితమైంది, ఆశ్రయం ఇచ్చేందుకు అనువైందని అర్థం. వ్యక్తిగా మీరు అన్ని రకాలుగా అంగీకారయోగ్యమైన వారని అర్థం.
ఇంట్లో బల్లి కనిపించడం రాబోయే అదృష్టానికి, సంపదకు సంకేతంగా చాలా సంస్కృతుల్లో నమ్ముతారు. చైనీయులు బల్లిని బేబీ డ్రాగన్ గా భావిస్తారు. ఇది సంపద, కీర్తి, ప్రతిష్టలకు సంకేతంగా భావిస్తారు.
పాత మిత్రులు లేదా ఆత్మీయుల వ్యక్తుల గుర్తుగా కూడా బల్లి కనిపించవచ్చు. కొన్ని దేశాలలో ఇంట్లో ఆత్మీయుల మరణం తర్వాత బల్లి కనిపిస్తే శుభశకునంగా భావిస్తారు.
కష్టంలో ఉన్నపుడు బల్లి కనిపిస్తే మీరు మీ కష్టాన్ని విజయవంతంగా గట్టెక్కుతారని అర్థం.
బల్లి తన మనుగడ కోసం జరిగే పోరాటంలో అవసరమైతే తోక వదులుకుంటుంది. ఇది జీవితం త్యాగాన్ని ఆశిస్తుందని చెప్పటానికి సంకేతం.
ఇంట్లో బల్లి కనిపిస్తే ఒక్కోసారి రాబోయే ప్రమాదానికి హెచ్చరిక కూడా కావచ్చు. మీరు తోక తెగిపోయిన బల్లిని మీ ఇంట్లో గమనిస్తే అది మీరు జీవితం కోసం చాలా కష్టపడుతున్నారనేందుకు ప్రతీక.
కొత్తగా మీ జీవితంలోకి వచ్చే వారు మీకు చెడు చేసే వారా మంచి చేసే వారా అనేది బల్లి సంకేతంలో కనిపిస్తుందని గుర్తుంచుకోవాలి.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం పుస్తకాల నుంచి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు ImagesCredit: Freepik