వాస్తు ప్రకారం అపార్ట్ మెంట్స్ లో బోర్, ట్యాంక్ ఏ దిశగా ఉండాలి!



ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ పడమర వైపు లేదా, నైఋతి మూలన ఉండేలా చూసుకోవాలి పై స్లాబ్‌కు రెండడుగుల ఎత్తులో నిర్మించుకోవాలి. పై స్లాబ్‌ను ఆనుకుని ఉండకూడదు



ఈశాన్యంలో వాటర్‌ ఉండటం వాస్తురీత్యా సమంజసమే అయినా ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ వంటి బరువుల్ని ఈశాన్యం వైపు ఉంచకూడదు



ఆగ్నేయ దిక్కులో ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ను ఎట్టి పరిస్ధితిలో నిర్మించరాదు..ఇది చాలా దుష్ప్రభావాలకు కారణం అవుతుంది.



పడమరదిక్కున ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ను నిర్మించుకోవడం మంచిది. వాయువ్య దిశలో, బిల్డింగ్‌ పైన మధ్య భాగంలో ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ ఎట్టి పరిస్ధితుల్లో నిర్మించకూడదు



బావి, బోర్‌ ఏర్పరచుకునే సమయంలో వాస్తు నిబంధనలు విధిగా పాటించాలంటారు వాస్తు నిపుణులు. స్థలానికి ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యంలోనే బావి కానీ బోర్‌కానీ ఉండాలన్నది వాస్తు నియమం



నీరు పడలేదు కదాని స్థలంలో వేరే చోట్ల బావి గాని, బోర్‌ కానీ త్రవ్వేయటం వాస్తుప్రకారం విరుద్ధమనే చెప్పాలి . ఉత్తర సరిహద్దుకు పడమర దిక్కువైపున ఉన్న అర్ధభాగంలో బావి, బోర్‌ నిర్మాణం జరగకూడదు



ఉత్తర ఈశాన్యంలో బోర్‌ పడకపోతే ఉత్తర సరిహద్దును రెండు భాగాలుగా చేసి, బావి కానీ బోర్‌ కానీ తూర్పు దిక్కుకు ఆనుకుని ఉన్న సగంలో ఏర్పాటు చేసుకోవచ్చు



తూర్పు ఈశాన్యంలో నీరు పడని పక్షంలో తూర్పు సరిహద్దులు రెండుగా విభజించి, ఈశాన్య దిక్కును ఆనుకుని ఉన్న భాగంలో ఎక్కడైన బావి, బోర్‌లు త్రవ్వుకోవచ్చు. తూర్పు ఆగ్నేయాన్ని ఆనుకుని ఉన్న అర్ధబాగంలో బావి, బోర్‌లు ఉండకుండా పూర్తి జాగ్రత్తపడాలి



Note: వాస్తునిపుణులు చెప్పినవి , పుస్తకాల ఆధారంగా తెలుసుకుని రాసిన విషయాలివి. వీటిని ఎంతవరకూ విశ్వసించవచ్చు అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.
Images Credit: Freepik