తినే ముందు కంచం లేదా ఆకు చుట్టూ నీళ్లెందుకు చల్లాలి!
ఆహారం ఉన్న కంచం లేదా ఆకు చుట్టూ పరిషేచనం (నీళ్లు చల్లడం) చేయడం పూర్వకాలం నుంచి కొనసాగుతోంది. ఇప్పటికీ చాలా మంది ఈ నియమాన్ని పాటిస్తున్నారు.
మనం ఇలా చేసినప్పుడు, మనం తినే ప్రదేశంలో ప్రతికూలత ప్రవేశించకుండా కంచం చుట్టూ నీటి రేఖ ఏర్పడుతుంది.
తినడానికి ముందు కంచం చుట్టూ నీరు చల్లడం ద్వారా ఆహారం అందించే అన్నపూర్ణ దేవికి, మన ఇష్ట దైవానికి మనం గౌరవం చూపడంతో పాటు వారికి మన కృతజ్ఞతలు తెలియజేయడం
పూర్వకాలంలో అందరూ నేలపై కూర్చుని తినేవారు. అనేక క్రిమి కీటకాలు నేలపై తిరుగుతుంటాయి. కంచం నుంచి వాటిని దూరంగా ఉంచడానికి లేదా కంచంలోకి అవి ప్రవేశించకుండా నిరోధించడానికి, దాని చుట్టూ నీరు చల్లేవారు.
పూర్వ కాలం మట్టి నేల ఉండేది. నీరు చల్లడం ద్వారా మట్టిని తడి చేస్తుంది, ధూళి గాలిలో ఎగరడానికి అనుమతించదు. ఫలితంగా మన కంచంలోని ఆహారం శుభ్రంగా ఉంటుంది.
మంచం మీద కూర్చొని తినకూడదు, త్రాగకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. అలా చేయడం వలన లక్ష్మీ దేవి కోపించి దారిద్య్రం మిమ్మల్ని చుట్టుముడుతుంది.
హిందూ మతంలోని శాస్త్రాలు లేదా గ్రంధాలలో మనిషికి మేలు చేసే ఆలోచనలు ఎన్నో ఉన్నాయి, వాటి వెనుక శాస్త్రీయ కారణం ఉంది.
శాస్త్రాలలోని నియమాలను పాటించడం ద్వారా మనకు మంచి ఆరోగ్యం, ఆరోగ్యకరమైన ఆలోచనలు కలుగుతాయి.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు