అన్వేషించండి

Today Horoscope In Telugu: జూలై 25 రాశిఫలాలు - ఈ రాశులవారికి ఈ రోజు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదురవుతాయి!

Horoscope Prediction 25th july 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Daily Horoscope for july 25th 2024

మేష రాశి

ఈ రోజు  మేషరాశివారికి మిశ్రమఫలితాలున్నాయి. అనవసర వాదనలకు దూరంగా ఉండాలి. మీపట్ల సన్నిహితులు కోపం తెచ్చుకోవచ్చు. వృత్తి ఉద్యోగాలలో మిశ్రమ ఫలితాలుంటాయి.  ఆన్‌లైన్ చెల్లింపులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సమస్యలున్నాయి. 

వృషభ రాశి

 కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి కెరీర్ సంబంధిత అవకాశాలను పొందవచ్చు. ప్రముఖులతో  పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగులు పనిపై శ్రద్ధ వహించాలి. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టొద్దు.చెడు వార్తలు వినాల్సి రావొచ్చు.  

మిథున రాశి

ఈ రోజు కుటుంబ సభ్యులతో విభేదాలు ఉండొచ్చు. ఇంటి పెద్దల నుంచి సలహాలు తీసుకోవడం మంచిది. విద్యార్థులు అర్థవంతమైన ఫలితాలు పొందుతారు. కార్యాలయంలో ఇతరుల తప్పులకు మీరు పరిహారం చెల్లించాల్సి రావొచ్చు. పెండింగ్ లో ఉన్న పనులు మళ్లీ ప్రారంభించండి.  వైవాహిక జీవితం బావుంటుంది. 

కర్కాటక రాశి

ఈ రాశివారు తొందరగా అలసిపోతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిర్మాణ పనుల్లో నిమగ్నమైన వ్యక్తులకు పని పెరుగుతుంది. నిరుద్యోగులు ఉద్యోగంలో స్థిరపడతారు. ప్రభుత్వ ప్రథకాల నుంచి ప్రయోజనాలు పొందుతారు. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తిచేస్తారు. 

Also Read: శ్రావణమాసంలో ఈ రాశులవారిపై శివుడి అనుగ్రహం - సెప్టెంబరు 03 వరకూ మీకు తిరుగులేదు!

సింహ రాశి

ఈ రాశివారు ఒత్తిడికి దూరంగా ఉండాలి. మేధోపరమైన చర్చలలో పాల్గొంటారు. మీ శత్రువులు మీకు హాని కలిగించడానికి ప్రయత్నించవచ్చు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. 

కన్యా రాశి

ఈ రోజు మీకు శుభప్రదంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడంలో నిర్లక్ష్యం వద్దు. నూతన పనులు ప్రారంభించేందుకు ఈ రోజు మంచిది. వ్యాపారంలో ఆకస్మిక ఆర్థిక లాభం ఉంటుంది. నూతన  ఒప్పందంపై సంతకం చేసే అవకాశాలు ఉన్నాయి. 

తులా రాశి

ఈ రాశివారికి మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సన్నిహిత వ్యక్తులతో మంచి సంబంధాలు కొనసాగించండి.  పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతారు. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. కార్యాలయంలో వ్యక్తుల ప్రవర్తన మీకు అనుకూలంగా ఉండదు.

Also Read: మీ సమస్య ఆధారంగా వారంలో ఏ రోజు ఏ దేవుడిని ఎలా పూజించాలి..దానివల్ల వచ్చే ఫలితమేంటి!

వృశ్చిక రాశి
 
వృశ్చిక రాశి వారు అనవసర చర్చల్లో పాల్గొనవద్దు. ప్రభుత్వానికి సంబంధించిన పనుల్లో పురోగతి ఉండదు. ఆర్థిక లావాదేవీలు ఈ రోజు జరపొద్దు. అప్పులు ఇచ్చేముందు జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ రాశి విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు పొందుతారు. మీ మాటతీరు ఎదుటివారిని బాధపెట్టేలా ఉంటుంది

ధనస్సు రాశి

ఈ రాశివారికి ఆర్థిక పరమైన ఇబ్బందులుంటాయి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో అభిప్రాయ బేధాలుంటాయి. భవిష్యత్ గురించి ఆందోళన చెందుతారు. వృత్తిపరమైన సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలి. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. 

మకర రాశి

మకర రాశి వారు ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. వ్యాపారంలో  మంచి ఆర్థిక లాభం ఉంటుంది. లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాలు విజయవంతం అవుతాయి.

Also Read: రాఖీ పౌర్ణమి, కృష్ణాష్టమి, నాగపంచమి సహా 2024 ఆగష్టు నెలలో వచ్చే పండుగలివే..!

కుంభ రాశి

మీ ప్రవర్తన మెచ్చుకోలుగా ఉంటుంది. ఉన్నత పదవులు పొందుతారు.  మీరు మీ మాటలతో అందర్నీ ప్రభావితం చేయగలరు. కొత్త పని చేయాలని ఆలోచిస్తారు. స్నేహితుల కోసం డబ్బు ఖర్చుచేస్తారు. ఈ రోజు పూర్తిచేయాల్సిన పనుల్లో అనిశ్చితి ఉంటుంది. 

మీన రాశి
 
పెండింగ్ లో ఉన్న విషయాలు పరిష్కరించడంలో విజయం సాధిస్తారు. విదేశాలకు వెళ్లే అవకాశాలున్నాయి. వ్యాపారంలో ఖర్చులు పెరుగుతాయి.  మీ సంబాషణ శైలి ఆకర్షణీయంగా ఉంటుంది. సన్నిహితులను కలుస్తారు

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
Russia cancer Vaccine: ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Case Sritej Health Update | 13 రోజుల తర్వాత శ్రీతేజ్ హెల్త్ పై పోలీసుల అప్డేట్ | ABP Desamటీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!జమిలి ఎన్నికలపై జేపీసీ, ప్రతిపక్షాల డిమాండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
Russia cancer Vaccine: ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Look Back 2024: 151 నుంచి 11కు- జగన్ కు చేదు జ్ఞాపకంలా 2024
151 నుంచి 11కు- జగన్ కు చేదు జ్ఞాపకంలా 2024
Weather Today : తెలంగాణపై చలి పిడుగు- వణికిపోతున్న జనం- ఏపీని వెంటాడుతున్న వర్షాల భయం
తెలంగాణపై చలి పిడుగు- వణికిపోతున్న జనం- ఏపీని వెంటాడుతున్న వర్షాల భయం
Keerthy Suresh: సౌత్ కంటే డబుల్... బాలీవుడ్‌లో రెమ్యూనరేషన్ పెంచేసిన కీర్తి సురేష్
సౌత్ కంటే డబుల్... బాలీవుడ్‌లో రెమ్యూనరేషన్ పెంచేసిన కీర్తి సురేష్
Embed widget