Surya Gochar 2022: నవంబరు 17న రాశిమారుతున్న సూర్యుడు, ఈ రాశులవారికి బాగా కలిసొస్తుంది
నోట్: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
Surya Gochar 2022: గ్రహాలు ఒక్కో నెల ఒక్కో రాశిలో సంచరిస్తాయి. కొన్ని సార్లు అదే రాశిలో వక్రం లేదా తిరోగమనం చెందుతాయి. అయితే ఏ గ్రహం రాశిమారినా ఆ ప్రభావం 12 రాశులవారిపైనా ఉంటుంది. కొందరికి అనుకూల ఫలితాలుంటే మరికొందరికి ప్రతికూల ఫలితాలుంటాయి. ప్రతికూల ఫలితాలు కూడా కొందరికి ఆరోగ్యంపై మరికొందరికి ఉద్యోగంపై ఇంకొందరికి సంసార బంధాలపై ఉంటాయి. నవగ్రహాల రాజు అయిన సూర్యభగవానుడు ఈ నెల 17న రాశిమారుతున్నాడు. తులా రాశినుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. డిసెంబరు 16న మళ్లీ రాశిమారతాడు...సూర్యుడు వృశ్చిక రాశిలో సంచరించే సమయంలో ఈ రాశులవారికి అదృష్టం కలిసొస్తుంది.
మిథున రాశి
వృశ్చిక రాశిలో సూర్య సంచారం మిథున రాశివారికి అదృష్టాన్ని తెస్తుంది. ఈ ప్రభావంతో మీ శత్రువులు నాశనం అవుతారు. ఈసమయంలో మంచి ఉద్యోగ అవకాశం పొందుతారు. విదేశాలకు వెళ్లాలి అనుకునేవారికి ఇదే మంచి సమయం.ఆదాయం పెరుగుతుంది. కళలు, సంగీతం పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు. మీపై కుట్ర చేయాలి అనుకున్నవారికి నిరాశే మిగులుతుంది.
Also Read: మీ నక్షత్రం...మీ రాశి....ఏ నక్షత్రానికి ఏ అక్షరాలో ఇలా తెలుసుకోండి...
కన్య రాశి
సూర్య సంచారం సమయంలో కన్యారాశివారు ప్రయాణాలవల్ల లాభపడతారు. మీ మాటతీరుతో అందర్నీ ఆకట్టుకుంటారు. టెక్నాలజీ రంగాలతో అనుబంధం ఉన్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఈ రవాణాలో, మీ ప్రసంగం ప్రభావం పెరుగుతుంది మరియు మీరు పురోగతిని పొందవచ్చు. అన్నదమ్ముల సహకారం వల్ల మనసు ఆనందంగా ఉంటుంది. ఈ సమయంలో, మీ తండ్రి మరియు గురువుల సహాయంతో పని జరుగుతుంది.
కర్కాటక రాశి
మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి. అధిక కోపాన్ని తగ్గించుకోవాలి. ఉన్నత విద్య, పరిశోధన సహా కెరీర్ గ్రోత్ కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఇల్లు మారే సూచనలు కనిపిస్తున్నాయి. మనసులో ప్రశాంతత, సంతోషం ఉంటుంది. మీపై మీరుపూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. తల్లిదండ్రుల నుంచి డబ్బులు కలిసొస్తాయి.
Also Read: ఈ యూనివర్శిటీలో సిలబస్ ఉండదు...కోర్సుకి కాలపరిమితి లేదు…పరీక్షలుండవు.. నేర్చుకున్న విద్యే కొలమానం…
వృశ్చిక రాశి
సూర్య సంచారం వల్ల ఈ రాశివారు ఇంటాబయటా గౌరవాన్ని పొందుతారు. ధైర్యం పెరుగుతుంది.. తండ్రి నుంచి మంచి మద్దతు లభిస్తుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. మీ మేధస్సులతో అందరినీ ఆకట్టుకుంటారు.వాహన సౌఖ్యం పెరుగుతుంది. మీ కుటుంబంతో కలిసి తీర్థయాత్రకు వెళ్ళవచ్చు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రాజకీయ నేతల ఆశయాలు నెరవేరుతాయి. ఉద్యోగులకు శుభసమయం.
మకర రాశి
సూర్య సంచారం వ్యాపారంలో మీకు లాభాన్నిస్తుంది. తోబుట్టువుల నుంచి మద్దతు లభిస్తుంది మనసు ఉల్లాసంగా ఉంటుంది. కుటంబంలో సంతోష వాతావరణం ఉంటుంది. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. ప్రేమికులు అపార్థాలకు దూరంగా ఉండాలి. వివాదాల్లో అస్సలు తలదూర్చకండి.
మీన రాశి
వృశ్చికరాశిలో సూర్య సంచారం మీనరాశివారికి కలిసొస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థికి పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. స్నేహితల నుంచి మంచి సహకారం లభిస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్...నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబంలో మీ గౌరవం పెరుగుతుంది. .