Venus Transits Libra 2024: తులా రాశిలోకి విలాసాల అధిపతి.. ఈ రాశులవారి జీవితాల్లో ఇక అంతా సంతోషమే!
Shukra Tula Gochar 2024: ప్రస్తుతం కన్యారాశిలో ఉన్న శుక్రుడు..సెప్టెంబరు 18 న తులా రాశిలోకి పరివర్తనం చెందుతాడు...అక్టోబరు 13 వరకూ ఈ రాశిలో సంచరిస్తాడు.. ఈ ప్రభావం మీ రాశిపై ఎలా ఉంటుందో తెలుసా...
![Venus Transits Libra 2024: తులా రాశిలోకి విలాసాల అధిపతి.. ఈ రాశులవారి జీవితాల్లో ఇక అంతా సంతోషమే! shukra tula gochar Venus Transits Libra 18 September 2024 Impact on 12 Zodiacs know in details Venus Transits Libra 2024: తులా రాశిలోకి విలాసాల అధిపతి.. ఈ రాశులవారి జీవితాల్లో ఇక అంతా సంతోషమే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/11/d63cf20534adc78a84632a29fdf945c21726043116486217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Venus Transits Libra 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడిని విలాసాలకు అధిపతిగా చెబుతారు. జాతకంతో శుక్రుడి సంచారం బావుంటే చాలు.. చివరకు శని గ్రహం కూడా వెనక్కు తగ్గాల్సిందే. ఐశ్వర్యం, ఆనందం, సౌందర్యం, ఇంద్రియాలను సంబంధించిన సంతోషాన్నిస్తాడు శుక్రుడు. ప్రస్తుతం కన్యా రాశిలో ఉన్న శుక్రుడు..సెప్టెంబరు 18 నుంచి తులా రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ ప్రభావం 12 రాశులపైనా ఉంటుంది.. దాదాపు అన్ని రాశులవారికి శుక్రుడు శుభఫలితాలనే ఇస్తున్నాడు..మరి మీ రాశి ఫలితం ఏంటో ఇక్కడ తెలుసుకోండి..
మేష రాశి
తులా రాశిలో శుక్రుడి సంచారం మేష రాశివారి జీవితంలో ప్రశాంతతని ఇస్తాడు. మిమ్మల్ని సవాలు చేసే సందర్భాలు ఉండవచ్చు కానీ ఓవరాల్ గా ఈ నెల రోజుల సమయం మీకు బాగా కలిసొస్తుంది. మీ దూకుడికి కొంచెం కళ్లెం వేయండి.
వృషభ రాశి
తులా రాశిలో శుక్రుడి సంచారం వృషభ రాశివారికి శుభ ఫలితాలను ఇవ్వడం లేదు. ఈ సమయంలో మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. వృత్తి, ఉద్యోగం, కుటుంబ జీవితంలో కొన్ని చికాకులు తప్పవు. ఆరోగ్యం విషయంలోనూ అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది.
Also Read: సెప్టెంబరు 17 నుంచి ఈ రాశులవారి జాతకం మారిపోతుంది!
మిథున రాశి
శుక్ర సంచారం మిథున రాశివారికి శుభ ఫలితాలను ఇస్తుంది. కెరీర్లో అభివృద్ధి చెందుతారు కానీ శత్రువుల పట్ల చాలా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన సమయం ఇది. వ్యక్తిగత జీవితంలో కలతలు తొలగించుకునేందుకు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి.
కర్కాటక రాశి
తులా రాశిలో శుక్ర సంచారం కర్కాటక రాశివారిని ఆర్థికంగా ఓ మెట్టు ఎక్కిస్తుంది. అనుకోని ఖర్చులున్నా కానీ ఆదాయం మెరుగుపడుతుంది. ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. అయితే మీ ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే..
సింహ రాశి
శుక్ర సంచారం సింహ రాశివారికి కలిసొచ్చే టైమ్. అయితే ఉద్యోగం మారాలి అనుకుంటే మాత్రం ఆ ఆలోచన ప్రస్తుతానికి వాయిదా వేసుకోవడం మంచిది. వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉంటుంది. కొత్త ప్రయోగాలు చేయకుండా మీ పని మీరు చేసుకెళ్లండి..మంచి ఫలితాలు సాధిస్తారు
కన్యా రాశి
తులా రాశిలో శుక్రుడి సంచారం కన్యా రాశివారి వ్యాపారులకు ఆర్థిక వృద్ధిని ఇస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఓ వెలుగు వెలుగుతారు. అయితే కొత్తగా పెట్టుబడులు పెట్టేముందు మరోసారి ఆలోచించండి. మీ మాటలో అహంకారాన్ని తగ్గించుకోకుంటే కుటుంబ బంధాలు దెబ్బతింటాయ్
Also Read: ఈ వారం ఈ రాశులవారికి ఆర్థిక వృద్ధి - వార ఫలాలు ( సెప్టెంబరు 09 - 15)
తులా రాశి
శుక్రుడు సంచరిస్తున్నది మీ రాశిలోనే..అందుకే ఈ నెల రోజులు మీకు తిరుగులేదంతే. ఉద్యోగ జీవితం, వ్యక్తిగత జీవితం అద్భుతంగా ఉంటుంది. అయితే ఆహారం, ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ప్రత్యర్థులతో జాగ్రత్త.
వృశ్చిక రాశి
తులా రాశిలో శుక్ర సంచారం ఈ రాశివారికి గోల్డెన్ టైమ్...కావాల్సిందల్లా స్థిరమైన ఆలోచన. వృత్తి, వ్యాపారం, ఉద్యోగంలో లాభాలు చూస్తారు. విదేశాలకు వెళ్లాలి అనుకునే ప్రయత్నం ఫలిస్తుంది. కుటుంబ జీవితం సంతృప్తికరంగా ఉంటుంది...వ్యక్తిగత సంబంధాలు మెరుగుపడేందుకు మీ తీరుతో కొన్ని మార్పులు అవసరం..
మకర రాశి
శుక్రుడి సంచారం మకర రాశివారికి శుభ ఫలితాలను ఇవ్వడం లేదు. దాదాపు నెల రోజుల పాటూ వృత్తి, వ్యాపారం, ఉద్యోగంలో ఇబ్బందులు తప్పవు. అనుకోని సమస్యలు వెంటాడుతాయి. అవగాహనలోపం వల్ల సహోద్యోగులతో సమస్యలు తప్పవు. వ్యక్తిగత జీవితంలో సమస్యలు ఎదురవుతాయి. ఈ సమయంలో సహనం, ఓపిక చాలా అవసరం...
ధనస్సు రాశి
మీ జీవితంలో మంచి రోజులు మొదలయ్యే సమయం ఇది. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులు ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. అయితే కుటుంబానికి సమయం కేటాయించడం చాలా అవసరం.
Also Read: గణేష్ నిమజ్జనం 11వ రోజే ఎందుకు..ఆ రోజుకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా!
కుంభ రాశి
కుంభ రాశి వారి జీవితంలో కొత్త వెలుగులు ఇస్తాడు శుక్రుడు. ప్రేమ, వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలలో సమయపాలన చాలా అవసరం అని గుర్తించాలి. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు.
మీన రాశి
తులా రాశిలో శుక్రుడి సంచారం మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఆర్థిక స్థిరత్వం ఉంటుంది..అవసరానికి డబ్బు చేతికందుతుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. కానీ మీ ప్రవర్తనలో కఠినత్వం ఎదుటివారిని బాధపెడుతుంది.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)