![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Surya Shani ketu Sanyog: సెప్టెంబరు 17 నుంచి ఈ రాశులవారి జాతకం మారిపోతుంది!
Astrology: సూర్య భగవానుడు ప్రస్తుతం సింహ రాశిలో ఉన్నాడు...ఈ నెల 17 న కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. ఇప్పటికే కుజుడు అదే రాశిలో ఉన్నాడు...ఈ ప్రభావంతో ఈ రాశులవారి జాతకం అద్భుతంగా మారబోతోంది..
![Surya Shani ketu Sanyog: సెప్టెంబరు 17 నుంచి ఈ రాశులవారి జాతకం మారిపోతుంది! surya shani sanyog 2024 surya ketu yuti sun eyes on saturn will change the fate of these zodiac signs Surya Shani ketu Sanyog: సెప్టెంబరు 17 నుంచి ఈ రాశులవారి జాతకం మారిపోతుంది!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/10/8b500b2bafd65ab35216c27451405c511725969405147217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Surya Shani Ketu Sanyog 2024: నవగ్రహాలు 12 రాశులలో సంచరిస్తుంటాయి..వాటి గమనం ఆధారంగా రాశి ఫలితాలను నిర్ణయిస్తారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. నెమ్మదిగా సంచరించే శనీశ్వరుడు రెండున్నరేళ్లకు ఓసారి రాశి మారుతాడు. రాహు , కేతువులు ఏడాది మొత్తం ఒకే రాశిలో సంచరిస్తాయి. మిగిలిన గ్రహాలు దాదాపు నెల రోజులకు ఓసారి రాశి పరివర్తనం చెందుతాయి. ముఖ్యంగా సూర్య భగవానుడు నెలలో రాశిలో అడుగుపెట్టిన సమయాన్ని సంక్రమణం అంటారు. సెప్టెంబరు 17న కన్యా రాశిలో అడుగుపెడతాడు ఆదిత్యుడు. ఇప్పటికే ఇదే రాశిలో కుజుడు సంచరిస్తున్నాడు. ఈ ప్రభావం అన్ని రాశులపైనా పడుతుంది..కొన్ని రాశులవారు విశేష ఫలితాలు పొందుతారు.. ఆ రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: రాధాష్టమి ఎప్పుడొచ్చింది..ఈ రోజు విశిష్టత ఏంటి - పూజావిధానం!
మిథున రాశి
కన్యా రాశిలో సూర్య సంచారం మీకు ఊహించని విధంగా కలిసొస్తుంది. ఎప్పటినుంచో ఎదుర్కొంటోన్న ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఉద్యోగులకు కలిసొచ్చే సమయం. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వ్యాపారులు ఊహించని లాభాలు పొందుతారు. వాహనం లేదా స్థిరాస్తులు కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు.
కర్కాటక రాశి
ఈ రాశివారిపై అర్థాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ...సూర్యభగవానుడి రాశి పరివర్తనం అదృష్టాన్నిస్తుంది. సెప్టెంబరు 17 నుంచి ఏ పని ప్రారంభించినా సక్సెస్ అవుతారు. ఆర్థిక ఇబ్బందులు తగ్గుతూ వస్తాయి..అప్పులు తీరుస్తారు. మీపై మీకు విశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగులకు కార్యాలయంలో బాధ్యతలు పెరుగుతాయి. కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. వ్యాపారంలో లాభాలుంటాయి.
తులా రాశి
మీ రాశి నుంచి సూర్యుడు పన్నెండో స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ ప్రభావంతో తలపెట్టిన పనులన్నీ పూర్తవుతాయి. కెరీర్లో వృద్ధి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. డబ్బు సంపాదించే మూలాలు పెరుగుతాయి. విద్యార్థులు నూతన అధ్యయనాలపై ఆసక్తి చూపిస్తారు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు ఈ నెల రోజులు శుభసమయమే..
Also Read: ఈ వారం ఈ రాశులవారికి ఆర్థిక వృద్ధి - వార ఫలాలు ( సెప్టెంబరు 09 - 15)
వృశ్చిక రాశి
సూర్య సంచారం, కేతువుతో కలయిక...వృశ్చిక రాశివారికి ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తుంది. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. అప్పుల బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యం బావుంటుంది. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది.
మకర రాశి
సూర్యుడు-కేతువు కలయిక మకర రాశివారికి శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబంతో కలసి ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. ఏం ప్రారంభించినా సక్సెస్ మీ సొంతం. ఆరోగ్యం, ఆనందం, ఆర్థికలాభం ఉంటుంది...
Also Read: గణేష్ నిమజ్జనం 11వ రోజే ఎందుకు..ఆ రోజుకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా!
మీన రాశి
సూర్య భగవానుడి సంచారం మీన రాశివారికి యోగాన్నిస్తుంది. గతంలో ఎప్పుడూ లేనంత ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగులు కార్యాలయంలో గౌరవం పొందుతారు. వ్యాపారులు లాభపడాతుర. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేపట్టిన పనులన్నీ పూర్తవుతాయి. సంతోషంగా ఉంటారు. సంతృప్తికరమైన జీవితం గడుపుతారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగాలలో స్థిరపడతారు. కోర్టు వ్యవహారాల్లో చిక్కుకున్నవారికి తీర్పు అనుకూలంగా వస్తుంది.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)