Weekly Horoscope: ఈ వారం ఈ రాశులవారికి ఆర్థిక వృద్ధి - వార ఫలాలు ( సెప్టెంబరు 09 - 15)
Weekly Horoscope In Telugu: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈ వారం మీ రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
Weekly Horoscope - September 9th to 15th 2024
మేష రాశి
మేష రాశి వారికి ఈ వారం ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వారం మధ్యలో ఆర్థికంగా లాభపడతారు కానీ వారాంతంలో అనుకోని ఖర్చులుంటాయి. చేపట్టిని పనులు సక్సెస్ ఫుల్ గా పూర్తవుతాయి. మీ మనోధైర్యమే మిమ్మల్ని రక్షిస్తుంది. వ్యాపారంలో కష్టపడి పనిచేయాలి..ఇతరులపై ఆధారపడకుండా నిర్ణయాలు తీసుకోండి. కుటుంబ సభ్యుల సహకారం తీసుకోండి. వారాంతంలో గుడ్ న్యూస్ వింటారు.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలుంటాయి. చర్చలలో పాల్గొనేటప్పుడు, కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి..ఆలోచనాత్మకంగా మాట్లాడాలి, సహనంగా వ్యవహరించాలి. నిరుద్యోగులకు మరికొంతకాలం నిరాశ తప్పదు కానీ కష్టపడితే అందుకు తగిన ఫలితం అందుకుంటారు. కుటుంబ సభ్యుల సలహాలతో నిర్ణయాలు తీసుకోండి. అనవసర విషయాలపై ఎక్కువ శ్రద్ధ వహించవద్దు.
మిథున రాశి
మిథున రాశివారికి ఈ వారం ఉత్తమ ఫలితాలున్నాయి. వచ్చిన అవకాశాలను వినియోగించుకోండి. ఈ వారంలో మీరు తీసుకునే నిర్ణయాలపై మీ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చేయాల్సిన పనులను వాయిదా వేయవద్దు. ప్రతి విషయంపై అవగాహన పెంచుకోవడం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యక్తిగత, వృత్తి జీవితానికి సంబంధించిన సమస్యల నుంచి బయటపడేందుకు కుటుంబం, సన్నిహితుల సహకారం మీకుంటుంది. భావోద్వేగాలకు దూరంగా ఉండడం మంచిది.
Also Read: గణేష్ నిమజ్జనం 11వ రోజే ఎందుకు..ఆ రోజుకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా!
కర్కాటక రాశి
మీ మాటతీరు ఆకర్షణీయంగా ఉంటుంది. ఇంటా బయటా గౌరవం గుర్తింపు పెరుగుతుంది. నూతన పెట్టుబడుల విషయంలో తొందరపాటు తగదు. ఆర్థికంగా బలపడేందుకు ఇది అనుకూలమైన సమయం. మీ తెలివితేటలతో మంచి ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగులు ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. అనుకున్న పనులన్నీ ప్రణాళిక ప్రకారం పూర్తవుతాయి. ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేయండి..మంచి ఫలితాలు సాధిస్తారు. కార్యాలయంలో అపార్థాలకు అవకాశం ఇవ్వొద్దు.
సింహ రాశి
ఈ వారం ఈ రాశివారిపై దైవానుగ్రహం ఉంటుంది. ప్రతికూల ఆలోచనలు అదుపుచేసేందుకు ప్రయత్నించండి. ఉద్యోగులు, వ్యాపారులు చేసే పనిపట్ల నిబద్ధతగా వ్యవహరించాలి. ప్రణాళిక ప్రకారం పనులు పూర్తిచేయండి..వాయిదా వేయొద్దు, ఎవరికీ అప్పగించవద్దు. ఆర్థికపరంగా అభివృద్ధి చెందే సమయం ఇది. కుటుంబ బాధ్యతలను విస్మరించవద్దు.
కన్యా రాశి
ఈ వారం మీ ఆర్థికపరిస్థితి అద్భుతంగా ఉంటుంది కానీ ఖర్చులు కూడా అలానే ఉంటాయి. ఈ వారం మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్ ని నిర్ణయిస్తాయి. అనుకోకుండా అప్పులు చేయాల్సి రావొచ్చు. సహనం, ఓర్పుతో వ్యవహరించాలి. సృజనాత్మక ఆలోచనలు పెరుగుతాయి. వ్యాపారంలో ఇబ్బందులు ఉంటాయి కానీ చివరి నిముషంలో పూర్తవుతాయి. దైవానుగ్రహం మీపై ఉంటుంది.
తులా రాశి
ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం ఇది. స్నేహితులు, సన్నిహితుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. నూతన వ్యాపారం ప్రారంభించాలనే ప్రయత్నాలు సఫలం అవుతాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసంతో అడుగువేయండి మీకు మంచి జరుగుతుంది
Also Read: శరన్నవరాత్రులు ఎప్పటి నుంచి మొదలు.. దసరా ఏ రోజు వచ్చింది - ఇంద్రకీలాద్రిపై అమ్మవారి అలంకారాలివే!
వృశ్చిక రాశి
ఎప్పటి నుంచో వెంటాడుతున్న సమస్యల నుంచి ఈ వారం మీకు ఉపశమనం లభిస్తుంది. శత్రువులపై మీరు పైచేయి సాధిస్తారు. మీరు ఏర్పరుచుకున్న లక్ష్యాలను సాధించే దిశగా అడుగులు ముందుకువేయండి. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆత్మీయులతో సంప్రదించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలి.
ధనస్సు రాశి
ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం.. అడ్డంకులు ఎదురైనా కానీ ప్రారంభించిన పనులు మధ్యలోనే ఆపేయవద్దు. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అనవసర భావోద్వేగానికి లోనుకావొద్దు. ఉద్యోగులు పని విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల సూచనలు పాటించడం ద్వారా మీకు మంచి జరుగుతుంది. కుటుంబ సభ్యుల సూచనలు మీకు అవసరమవుతాయి. నూతన పెట్టుబడులు పెట్టేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించడం మంచిది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చు...
మకర రాశి
ఈ వారం మీకు అదృష్టం కలిసొస్తుంది. చేపట్టిన పనులు అనుకున్న వెంటనే పూర్తవుతాయి. మీ బాధ్యతలు మీరు సంపూర్ణంగా నిర్వర్తించండి. భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులు చదువుపై సంపూర్ణంగా శ్రద్ధ వహించాలి. స్థిరాస్తులు కొనుగోలు చేయాలన్న ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. కుటుంబానికి సమయం కేటాయిస్తారు.
కుంభ రాశి
ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలుంటాయి. ఆర్థికవృద్ధికి అవకాశం ఉంటుంది. అనవసర ఖర్చులు పెరగుకుండా బడ్జెట్ ను ప్లాన్ చేసుకోవాలి. అయితే ముఖ్యమైన పనుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఉద్యోగులు పని విషయంలో రాజీ పడొద్దు.. ఉన్నతాధికారుల సలహాలు స్వీకరించండి. సొంత నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు తప్పవు. చేయని తప్పులకు నిందలు పడాల్సి రావొచ్చు..అప్రమత్తంగా వ్యవహరించండి. వివాదాలకు దూరంగా ఉండాలి.
మీన రాశి
ఈ రాశివారికి ఈ వారం అదృష్టం కలిసొస్తుంది. ఉద్యోగులు మంచితనంతో శుభఫలితాలు పొందుతారు. మీ కీర్తి పెరుగుతుంది...పురస్కారాలు లభిస్తాయి. ప్రారంభించిన పనులు ప్రణాళిక ప్రకారం పూర్తిచేయండి. ఆర్థికాభివృద్ధి బావుంటుంది కానీ మిమ్మల్ని తప్పుదారి పట్టించేవారున్నారు జాగ్రత్త. వ్యాపారులకు కలిసొచ్చే సమయం ఇది. నూతన పెట్టుబడులకు ఇదే సరైన సమయం. స్థిరాస్తులు వృద్ధి చేస్తారు..
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.