Shani Dev: 12 రాశులపై శని కోపం, శిక్షలు ఎలా ఉంటాయి? మీరాశి ప్రకారం మీరు మార్చుకోవాల్సిన లక్షణం ఏంటో తెలుసా!
Shani: శని దేవుడు 12 రాశులపై వేర్వేరు ప్రభావం చూపిస్తాడు. ఏ రాశిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఎవరికి ఎలాంటి శిక్షలు ఉంటాయో తెలుసుకోండి.

Shani Dev: శని దేవుడి దృష్టి ఎవరిపై ఉంటే వారి జీవితంలో హెచ్చు తగ్గులు వేగంగా వస్తాయి. శని శుభ స్థానంలో ఉంటే రాజయోగం కూడా ఉంటుంది. శని ఆగ్రహం పెరిగితే వ్యక్తి కఠినమైన పరీక్ష ఎదుర్కోవలసి వస్తుంది.
జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడిని న్యాయ దేవతగా చెబుతారు.. అలాగే దండాధికారి అని కూడా పిలుస్తారు. ఎందుకంటే శని మంచి పనులకు ఫలితాలను ఇస్తూనే చెడు పనులకు శిక్షిస్తాడు. కానీ వివిధ రాశులపై శని దేవుడి కోపం , శిక్ష కూడా భిన్నంగా ఉంటుంది. కాబట్టి మీ రాశి ప్రకారం శని దేవుడి శిక్ష నుంచి తప్పించుకోవడానికి మీరు ఏ పనులకు దూరంగా ఉండాలో తెలుసుకోండి.
| శని కోపం ఏ రాశిపై ఎలా ఉంటుంది |
| రాశి (రాశి గుర్తులు) | శని శిక్ష |
| మేషం | ఈ రాశి వారిపై కుజుడి ప్రభావం ఉంటుంది. అందుకే వీరు తొందరపాటు, కోపిష్టులుగా ఉంటారు. శని దేవుడు మేష రాశి వారిపై కోపించినట్లయితే, ఆ వ్యక్తి పదేపదే కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. కోపం పెరుగుతుంది, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. కెరీర్‌లో అడ్డంకులు పెరుగుతాయి. ధన నష్టం లేదా పెద్ద పెట్టుబడిలో నష్టం కలిగే అవకాశం ఉంది. |
| వృషభం | వృషభ రాశి వారు సోమరితనం ,మొండిగా ఉంటారు. ఈ రాశి వారి స్వభావం శని దేవుడిని అసంతృప్తికి గురి చేస్తుంది. వృషభ రాశిపై కోపించిన శని ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేస్తాడు. చాలాసార్లు శని ఆరోగ్యం సంబంధిత సమస్యలను కూడా పెంచుతాడు. |
| మిథునం | ఈ రాశి వారు ఎక్కువగా మాట్లాడటం , అస్థిరమైన మనస్సు శని దేవుడికి నచ్చదు. మిథున రాశి వారిపై శని కోపించినట్లయితే, ఉద్యోగం,వ్యాపారం రెండింటిలోనూ మంచి ఫలితాలు ఉండవు. ప్రమోషన్ కూడా ఆగిపోవచ్చు, వ్యాపారంలో లాభం తగ్గుతుంది.. |
| కర్కాటకం | కర్కాటక రాశి వారు భావోద్వేగాలకు లోనవుతారు . శని దేవుడు వారిని ప్రత్యేకంగా పరీక్షిస్తాడు. కర్కాటక రాశిపై శని ప్రభావం మానసిక ఒత్తిడి , సమస్యలను పెంచుతుంది. శని తిరోగమనంలో ఉంటే, అప్పులు పెరిగే ప్రమాదం ఉంది. |
| సింహం | ఈ రాశి వారి అహంకారం, ప్రదర్శన మెరుపు శని కోపాన్ని పెంచుతుంది. సింహ రాశి వారికి శని కోపం ప్రతిష్ట ఆత్మవిశ్వాసం దెబ్బతీస్తుంది. అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయాలు భారీగా మారవచ్చు. |
| కన్య | మీరు నిరంతరం ఎవరినైనా విమర్శిస్తే మీపై శని దేవుడి ఆగ్రహం ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కన్యా రాశి వారికి శని ఆగ్రహం సంబంధాలలో దూరం తెస్తుంది. ఆరోగ్యం క్షీణించవచ్చు . ఉద్యోగంలో అస్థిరత ఏర్పడవచ్చు. |
| తుల | శని ప్రభావం మీ రాశిపై ఉన్నప్పుడు అదృష్టం దూరమవుతుంది. ప్రణాళికలు విఫలం కావచ్చు, ప్రయాణాలు వాయిదా పడవచ్చు . కెరీర్‌లో అడ్డంకులు పెరుగుతాయి. వైవాహిక జీవితంలో కూడా సమస్యలు రావచ్చు. |
| వృశ్చికం | ప్రతీకారం తీర్చుకునే భావన కలిగిన ఈ రాశి వారిపై శని ప్రభావం అధికంగా ఉంటుంది. వృశ్చిక రాశిపై శని దేవుడి కోపం చాలా తీవ్రంగా పరిగణించబడుతుంది. |
| ధనుస్సు | మీ అధిక ఆత్మవిశ్వాసం , నిర్లక్ష్యపు అలవాటు శవిని కోపానికి గురి చేస్తుంది. ధనుస్సు రాశి వారు శని ద్వారా అదృష్ట రంగంలో పరీక్షను ఎదుర్కొంటారు. విద్య, పోటీ , ఉద్యోగం అన్నింటిలోనూ అడ్డంకులు రావచ్చు. |
| మకరం | ఇది శని సొంత రాశి. కానీ తప్పు జరిగితే శిక్ష కూడా తక్కువ కాదు. యజమాని శని కోపించినప్పుడు, మకర రాశి వారిపై పని భారం భరించలేనిదిగా మారుతుంది. కెరీర్‌లో పోరాటం చాలా కాలం పాటు కొనసాగవచ్చు. |
| కుంభం | మకరం తర్వాత, కుంభం కూడా శని రెండవ సొంత రాశి. కానీ చెడు పనులకు భారీ శిక్షను అనుభవించవలసి ఉంటుంది. కుంభ రాశిపై శని సామాజిక జీవితం... ఆదాయం రెండింటినీ ప్రభావితం చేస్తుంది. స్నేహితులు లేదా సన్నిహితుల నుంచి మోసం పొందవచ్చు. |
| మీనం | భ్రమలు , ఊహల్లో మునిగిపోయేవారిపై శని ఆగ్రహం ఉంటుంది. మీన రాశి వారు బలహీన మనస్సు కలిగి ఉంటారు . శని కోపించినప్పుడు సంబంధాలలో అపార్థాలు పెరగవచ్చు. |
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.





















