Saturn Transit 2024 - 2025 : శని సంచారంతో ఈ రాశులవారికి ఆర్థిక, మానసిక సమస్యలు - మరి పరిష్కారం ఏంటి!
Saturn Year 2024 - 2025 : కుంభ రాశిలో తిరోగమనంలో ఉన్న శనిదేవుడు కార్తీక పౌర్ణమి నుంచి సాధారణ స్థితికి వస్తాడు. ఫలితంగా కొన్ని రాశులవారికి ఆర్థిక, మానసిక ఇబ్బందులు తప్పవు. మరి పరిష్కారం ఏంటి?
Most Effective Remedies of Shani: జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి చాలా ప్రాధాన్యత ఉంది.ఏటా వార్షిక రాశి ఫలాలు చూసుకునేటప్పుడు కూడా శని సంచారాన్నే ప్రధానంగా తీసుకుంటారు. శని సంచారం మంచి స్థానంలో ఉంటే ఆ జాతకుడికి అన్నింటా కలిసొస్తుంది..శని అష్టమం, అర్ధాష్టమం, జన్మం, పదోస్థానాల్లో ఉంటే అన్నింటా అడ్డంకులు, అశాంతి, అనారోగ్యం, లేనిపోని తగాదాలు తప్పవు. రెండున్నరేళ్లకు ఓ రాశిమారే శని దేవుడు ప్రస్తుతం ఉన్న తిరోగమన దశ నుంచి కుంభ రాశిలో సాధారణ స్థితిలో సంచరిస్తాడు. ఫలితంగా కొన్ని రాశులవారికి శని ప్రభావం నుంచి ఉపశమనం లభిస్తే మరికొన్ని రాశుల వారికి అష్టకష్టాలు తప్పవు. కుంభ రాశిలో శని సంచారం ప్రత్యక్షంగా కొన్ని రాశులపై, పరోక్షంగా మరికొన్ని రాశులవారిపై ప్రభావం చూపిస్తుంది.
Also Read: శని తిరోగమనం - ఈ 3 రాశులవారికి శని వదిలిపోతుంది .. రెండున్నరేళ్లు వీళ్లకు కష్టాలే కష్టాలు!
నవంబరు రెండో వారాంతంలో రాశి మారే శని ప్రభావం ముఖ్యంగా కర్కాటక రాశి, సింహ రాశి, కన్యా రాశి, మీన రాశులవారిపై ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశులవారికి ఆర్థిక ఇబ్బందులు తప్పవు, చేపట్టిన పనులు పూర్తైనట్టే ఉంటాయి కానీ ఆఖరి నిముషంలో నిరాశే మిగులుతుంది. మానసికంగా కుంగిపోతారు. అయితే ఈ రాశులవారికో శుక్రుడు, బృహస్పతి అనుగ్రహం ఉన్న రాశులవారికి శని నుంచి కొంత ఉపశమనం ఉంటుంది. అది మీ వ్యక్తిగతజాతకంలో ఉండే గ్రహాల స్థానంపై ఆధారపడి ఉంటుంది.
ప్రస్తుతం కుంభరాశిలో తిరోగమనం నుంచి సాధారణ స్థితిలో సంచరించే శని వచ్చే ఏడాది మార్చి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ సమయంలో మేషరాశివారిపై ప్రత్యక్షంగా శని ప్రభావం పడుతుంది. రెండున్నరేళ్లపాటూ మీన రాశివారితో పాటూ మేష రాశివారు కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, ఉద్యోగ పరంగా సమస్యలు చుట్టుముడతాయి. నూతన పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచన ఈ సమయంలో వాయిదా వేసుకోవడమే మంచిది..
మీనంలోకి శని ప్రవేశించిన సమయంలో మకర రాశివారికి ఉపశమనం ఉంటుంది. కుంభ రాశి నుంచి శని రాశి మారడం వల్ల ఈ రాశివారికి కూడా కొన్నాళ్లుగా వెంటాడుతున్న సమస్యల నుంచి బయటపడినట్టు అనిపిస్తుంది.
Also Read: శుక్రుడి సంచారం కారణంగా ఈ రాశులవారికి అనారోగ్యం, అధిక ఖర్చులు, అన్నింటా అడ్డంకులు!
శని గ్రహం అనుగ్రహం పొందాలంటే పాటించాల్సినవి ఇవే..
కష్టపడే తత్వమే శని ప్రభావం నుంచి ఉపశమనం కల్పిస్తుంది. కష్టానికి ప్రతీకగా చెప్పే చీమలకు పంచదార వేస్తే శని ప్రభావం తగ్గుతుందని చెప్పడం వెనుకున్న ఉద్దేశం కూడా ఇదే
ప్రతి శనివారం , ముఖ్యంగా త్రయోదశి కలిసిన శనివారం శనికి తైలాభిషేకం చేయించాలి
ఆలయాల్లో, బయటా పేదలకు దాన ధర్మాలు చేయాలి... అన్నదానం, వస్త్రదానం మీ స్తోమతకు తగ్గట్టు చేయొచ్చు
శనివారం రోజు రావిచెట్టుకి నీళ్లు సమర్పించి దీపం వెలిగించి నమస్కరించండి
శివుడిని, ఆంజనేయుడిని పూజించేవారిపై శని ప్రభావం తక్కువ ఉంటుంది
Also Read: ధనస్సు లోకి శుక్రుడు - డిసెంబరు 02 వరకూ ఈ రాశులవారికి అన్నీ శుభఫలితాలే!
నిత్యం శని గాయత్రి జపించండి
ఓం ఖగథ్వజాయ విద్మహే ఖఢ్గ హస్తాయ ధీమహి
తన్నో మంద: ప్రచోదయాత్
ఓం శనైశ్వరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి
తన్నో: మంద: ప్రచోదయాత్
శని శాంతి మంత్రం
క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ణసమస్రజమ్
ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరమ్
నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ నీహార
వర్ణాంజనమేచకాయ శ్రుత్వా రహస్యం భవకామదశ్చ
ఫలప్రదో మే భవ సూర్యపుత్రం నమోస్తు ప్రేతరాజాయ
కృష్ణదేహాయ వై నమః శనైశ్చరాయ కౄరాయ
శుద్ధబుద్ధి ప్రదాయనే
య ఏభిర్నామభి: స్తౌతి తస్య తుష్టా భవామ్యహమ్
మదీయం తు భయం తస్య స్వప్నేపి న భవిష్యతి
''క్రోడం నీలాంజన ప్రఖ్యం..'' అనే శ్లోకాన్ని 11 సార్లు పఠించిన తర్వాత కింది శ్లోకాన్ని 11 సార్లు పఠించాలి
శన్యారిష్టే తు సంప్రాప్తే
శనిపూజాంచ కారయేత్
శనిధ్యానం ప్రవక్ష్యామి
ప్రాణి పీడోపశాంతయే