అన్వేషించండి

Sagittarius Horoscope 2023: 7 నెలలు రకరకాల ఇబ్బందులు, 5 నెలలు ఆర్థిక ప్రయోజనాలు, 2023లో ధనస్సు రాశి వార్షిక ఫలితాలు

Dhanusu Raasi horoscope 2023: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

Sagittarius Horoscope 2023: ధనస్సు రాశివారు ఈ ఏడాది శుభవార్తలు వింటారు, సాధించాలి అనుకున్న పనులు ఇబ్బందులున్నా పూర్తిచేస్తారు.  వివాహ జీవితం బావుంటుంది,ప్రేమ విషయంలోనూ సానుకూల ఫలితాలుంటాయి...ఇకా 2023 ధనస్సు రాశివారికి ఎలాఉందంటే...

  • 2023లో ఈ రాశివారి ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆదాయాన్ని పెంచుకునేందుకు అనుకూలమైన పరిస్థితి ఉంటుంది. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్, ఆగస్, సెప్టెంబరు నెలలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి..ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవాలి
  • ఏడో స్థానంలో సూర్యుడి సంచారం వల్ల వివాహితుల జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామిపట్ల ప్రేమ రెట్టింపు అవుతుంది. మీ ప్రతి పనిలోనూ మీకు మీ జీవితభాగస్వామి తోడు ఉంటుంది. కుటుంబం పట్ల బాధ్యత పెరుగుతుంది.
  • 2023లో ఆరోగ్యపరంగా చూస్తే..ఆజాగ్రత్త అనారోగ్యాన్ని పెంచుతుంది...దానికి మూల్యం చెల్లించుకునేకన్నా ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండడం మంచిది. పొట్టకు సంబంధించిన ఇబ్బందులు రావొచ్చు...
  • ప్రేమికులు అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సిన సమయం ఇది. సంవత్సరం ప్రారంభంలో రాహువు 5వ ఇంట్లో ఉన్నాడు. ఏడాదిలో మొదటి అర్థభాగం వివాదాలతో మీ బంధం నడిచినా ఆ తర్వాత బావుంటుంది
  • ఈ ఏడాది ధనస్సు రాశివారు వృత్తి, ఉద్యోగాల్లో కొంత జాగ్రత్త అవసరం. సంవత్సరం ప్రారంభం మీకు అనుకూలంగా ఉంటుంది కానీ ఆ తర్వాత సమస్యలు తప్పవు.
  • ఉద్యోగంలో మార్పు మీకు అనుకూలంగా ఉంటుంది కానీ దానివల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.
  • ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఉద్యోగం మారే అవకాశం ఉంది...అయితే వీలైనంత వరకూ మారకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే మళ్లీ  అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు సానుకూల ఫలితాలు పొందుతారు.

Also Read: 2023 లో ఈ 3 రాశులవారిని దురదృష్టం వెంటాడుతుంది

2023లో ధనస్సు రాశి మాసఫలితాలు

  • జనవరిలో ధనుస్సు రాశి వారి 5వ ఇంట రాహువు సంచారం వల్ల కొంత గందరగోళంగా ఉంటారు. ప్రతి విషయం గురించి లోతుగా ఆలోచించాలి. గందరగోళంలో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు.
  • ఫిబ్రవరి నెలలో మీ బలం, ధైర్యం పెరుగుతుంది. ఉద్యోగులు మంచి పేరు సంపాదించుకుంటారు. సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది. తలపెట్టిన పనిలో విజయం సాధిస్తారు
  • మార్చి నెలలో మీ వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొంటారు. వ్యాపారంలో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది, తోబుట్టువుల నుంచి మద్దతు తీసుకుంటారు
  • ఏప్రిల్‌లో ఓ మోస్తరు ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే ఈ నెలలో బృహస్పతి ఐదో స్థానంలో సంచరిస్తుంది..ఈ సమయంలో సూర్యుడు రాహువుతో కలసి ఐదో స్థానంలోనే ఉంటాడు...ఫలితంగా కొన్ని దుష్ప్రభావాలుంటాయి
  • మే నెలలో కూడా మీకు కొన్ని సమస్యలు తప్పవు..జీవితంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ప్రేమికుల మధ్య సమస్యలు పెరుగుతాయి. ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది.. ఆగస్టు వరకూ కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది
  • సెప్టెంబరులో ఆరోగ్య పరంగా కొంత మార్పు వస్తుంది. ఆర్థికంగా కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఏ పనీ కోపంతో చేయవద్దు. మీపై కుట్రలు జరిగే అవకాశం ఉంది జాగ్రత్త. 
  • అక్టోబరు నెల ఆర్థిక పరిస్థితి మెరుగుపరుస్తుంది. అప్పులు తీర్చగలుగుతారు. మీ శారీరక బలం పెరుగుతుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబంతో సమయం గడపడం సాధ్యమవుతుంది.
  • నవంబర్, డిసెంబరు మీకు బాగా కలిసొస్తాయి. ఆర్థికంగా పుష్కలంగా వృద్ధి చెందే సమయం ఇది. మీ ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. నిర్ణయం తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది.

Also Read: 2023లో ఈ 5 రాశులవారు సక్సెస్ కి కేరాఫ్, కొన్నేళ్లుగా పడుతున్న కష్టాల నుంచి ఊహించనంత ఉపశమనం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Fake Videos Cases: కంచ గచ్చిబౌలి ఫేక్ వీడియోలపై సర్కార్ సీరియస్ -  హైకోర్టులో పిటిషన్
కంచ గచ్చిబౌలి ఫేక్ వీడియోలపై సర్కార్ సీరియస్ - హైకోర్టులో పిటిషన్
Stock market: స్టాక్ మార్కెట్‌లో మహాపతనం  - 20 లక్షల కోట్ల సంపద ఆవిరి - అంతా ట్రంప్ పుణ్యమే
స్టాక్ మార్కెట్‌లో మహాపతనం - 20 లక్షల కోట్ల సంపద ఆవిరి - అంతా ట్రంప్ పుణ్యమే
HCU Students: కంచ గచ్చిబౌలి భూవివాదంలో హెచ్సీయూ విద్యార్థులపై కేసులు ఎత్తివేత! చర్యలు ప్రారంభించిన ప్రభుత్వం
కంచ గచ్చిబౌలి భూవివాదంలో హెచ్సీయూ విద్యార్థులపై కేసులు ఎత్తివేత! చర్యలు ప్రారంభించిన ప్రభుత్వం
Stock market memes: బ్లాక్ మండేతో కోట్లు నష్టపోయినా ఈ మీమ్స్ చూస్తే మాత్రం నవ్వకుండా ఉండలేరు - స్టాక్ మార్కెట్ క్రాష్ సోషల్ మీడియా కామెడీ
బ్లాక్ మండేతో కోట్లు నష్టపోయినా ఈ మీమ్స్ చూస్తే మాత్రం నవ్వకుండా ఉండలేరు - స్టాక్ మార్కెట్ క్రాష్ సోషల్ మీడియా కామెడీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tilakvarma removed Mumbai Indians Name | ముంబై ఇండియన్స్ పేరును తొలగించిన తిలక్ వర్మ | ABP DesamJasprit Bumrah Re Entry | బుమ్రాను గాల్లోకి ఎత్తి మరీ ప్రకటించిన పొలార్డ్ | ABP DesamMI vs RCB Match preview IPL 2025 | పదేళ్ల గడిచిపోయాయి..ఇప్పటికైనా దక్కేనా.? | ABP DesamSiraj Bowling in IPL 2025 | ఐపీఎల్ లో వంద వికెట్ల క్లబ్ లోకి దూసుకొచ్చిన హైదరాబాదీ సిరాజ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fake Videos Cases: కంచ గచ్చిబౌలి ఫేక్ వీడియోలపై సర్కార్ సీరియస్ -  హైకోర్టులో పిటిషన్
కంచ గచ్చిబౌలి ఫేక్ వీడియోలపై సర్కార్ సీరియస్ - హైకోర్టులో పిటిషన్
Stock market: స్టాక్ మార్కెట్‌లో మహాపతనం  - 20 లక్షల కోట్ల సంపద ఆవిరి - అంతా ట్రంప్ పుణ్యమే
స్టాక్ మార్కెట్‌లో మహాపతనం - 20 లక్షల కోట్ల సంపద ఆవిరి - అంతా ట్రంప్ పుణ్యమే
HCU Students: కంచ గచ్చిబౌలి భూవివాదంలో హెచ్సీయూ విద్యార్థులపై కేసులు ఎత్తివేత! చర్యలు ప్రారంభించిన ప్రభుత్వం
కంచ గచ్చిబౌలి భూవివాదంలో హెచ్సీయూ విద్యార్థులపై కేసులు ఎత్తివేత! చర్యలు ప్రారంభించిన ప్రభుత్వం
Stock market memes: బ్లాక్ మండేతో కోట్లు నష్టపోయినా ఈ మీమ్స్ చూస్తే మాత్రం నవ్వకుండా ఉండలేరు - స్టాక్ మార్కెట్ క్రాష్ సోషల్ మీడియా కామెడీ
బ్లాక్ మండేతో కోట్లు నష్టపోయినా ఈ మీమ్స్ చూస్తే మాత్రం నవ్వకుండా ఉండలేరు - స్టాక్ మార్కెట్ క్రాష్ సోషల్ మీడియా కామెడీ
YS Sharmila: పులిబిడ్డ పులిబిడ్డే - జగన్‌కో మరోసారి షర్మిల స్ట్రాంగ్ కౌంటర్
పులిబిడ్డ పులిబిడ్డే - జగన్‌కో మరోసారి షర్మిల స్ట్రాంగ్ కౌంటర్
Andhra Health:  టెన్షన్ ఆడవారికి - షుగర్ మగవాళ్లకి - ఏపీలో ప్రజల ఆరోగ్య పరిస్థితులపై సంచలన రిపోర్టు
టెన్షన్ ఆడవారికి - షుగర్ మగవాళ్లకి - ఏపీలో ప్రజల ఆరోగ్య పరిస్థితులపై సంచలన రిపోర్టు
Samantha: 'ఎక్స్' లోకి సమంత రీ ఎంట్రీ - ఫస్ట్ పోస్ట్ ఏం చేశారో తెలుసా?
'ఎక్స్' లోకి సమంత రీ ఎంట్రీ - ఫస్ట్ పోస్ట్ ఏం చేశారో తెలుసా?
LPG Cylinder Price: దేశవ్యాప్తంగా గ్యాస్‌ వినియోగదారులకు షాక్ - సిలిండర్‌పై రూ. 50 పెంపు 
దేశవ్యాప్తంగా గ్యాస్‌ వినియోగదారులకు షాక్ - సిలిండర్‌పై రూ. 50 పెంపు 
Embed widget