By: RAMA | Updated at : 23 Dec 2022 06:30 AM (IST)
Edited By: RamaLakshmibai
Image Credit: Freepik
2023 Unlucky Zodiac Signs: పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పేసి కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్నప్పుడు ఎన్నో ఆశలుంటాయి. గడిచిన ఏడాదిలో మంచి జరిగితే అదే మంచి కొత్త ఏడాదిలో కూడా కంటిన్యూ అవ్వాలని...చెడు జరిగితే ఆ చెడుకి పాత ఏడాదితో ఫుల్ స్టాప్ పడి న్యూ ఇయర్లో అంతా మంచే జరగాలని కోరుకుంటారంతా. అయితే ఎవరికి వారు మంచి జరగాలని కోరుకోవడం సహజం...అయితే..అందుకు గ్రహస్థితి కూడా అనుకూలించాలి అంటారు పండితులు. గ్రహాలు నెలకోసారి రాశి మారుతుంటాయి. ఆ ప్రభావం అన్ని రాశులపైనా ఉంటుంది. కొందరికి అనుకూల ఫలితాలుంటే మరికొన్ని రాశులవారికి ప్రతికూల ఫలితాలుంటాయి. అయితే కొన్ని గ్రహాల ప్రభావం ఏడాదంతా వెంటాడుతాయి. అలా 2023లో కొన్ని రాశులవారికి అంతగా బాలేదు. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే 2023లో ఈ రాశులవారు అదృష్టానికి దూరంగా దురదృష్టానికి దగ్గరగా ఉంటారని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు
మేష రాశి
మేష రాశివారికి 2023 అంతగా అనుకూల ఫలితాలనివ్వదు. అలాగని పూర్తిగా ప్రతికూల ఫలితాలనే ఇస్తుందనే భయం అవసరం లేదు కానీ 2022తో పోలిస్తే ఈ ఏడాది కొన్ని సమస్యలు ఎదుర్కోకతప్పదు. పనిపట్ల ఉండే అజాగ్రత్త వీళ్లకి సమస్యలు తెచ్చిపెడుతుంది. ఉద్యోగులకు సమస్యలు తప్పవు, వ్యాపారులు నూతన పెట్టుబడులు కొత్త ప్రణాళికల గురించి ఆలోచించకపోవడమే మంచిది. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు కొంత ఇబ్బంది పెడతాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అవివాహితులకు ఈ ఏడాది కూడా వివాహం జరగదు. మీ వ్యక్తిగత జాతకంలో గ్రహస్థితిని బట్టి ఫలితాలు కొంత మారొచ్చు కూడా...
Also Read: 2023లో అయినా ఈ రాశివారికి ఆహా అనిపించే రోజు ఉంటుందా! వృశ్చిక రాశి వార్షిక ఫలితాలు
మకరరాశి
మకరరాశి వారికి కూడా 2023 అంతగా కలసిరాదు. ఈ రాశివారు వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. వివాదాల్లో చిక్కకుంటారు. రిలేషన్ షిప్ లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశులవారి గురించి వారి వారి కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతారు. ఏ పని చేసినా సానుకూల ఫలితాలు పొందలేరు. నిజమైన ప్రేమను చూపించినా అది ఎవ్వరికీ అర్థంకాదు. అవివాహితులు ఎలాగోలా పెళ్లైతే చాలు అనే ఆలోచనకు వచ్చేస్తారు. మనోధైర్యంతో ముందుకు వెళ్లడమే కానీ గ్రహబలం మీకు అంతగా కలసిరాదు..
Also Read: 2023లో ఈ 5 రాశులవారు సక్సెస్ కి కేరాఫ్, కొన్నేళ్లుగా పడుతున్న కష్టాల నుంచి ఊహించనంత ఉపశమనం
కుంభ రాశి
2023లో దురదృష్టవంతుల జాబితాలో కుంభరాశి వారుకూడా ఉన్నారు. ఈ ఏడాది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం తప్పదు. ఖర్చులు తగ్గించకపోతే ఈ పరిస్థితులు మరింత దిగజారుతాయి. ఉద్యోగులు పని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ఏదీ ప్లాన్ చేసుకోలేరు..ఏం చేయాలి అనుకున్నా కొన్ని అడ్డంకులు తప్పవు. ఒంటరిగా ఉండలేరు..కుటుంబంతో సంతోషంగా ఉండలేరు అనే పరిస్థితిలో ఉంటారు. అప్పులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి...దీంతో సమస్యలు మరింత పెరుగుతాయి.
Bhishma Pratigya Mahabharat: భీష్మ ప్రతిజ్ఞ అంటే ఏంటి - ఇంతకీ భీష్ముడు ఏం సందర్భంలో ఏమని ప్రతిజ్ఞ చేశాడు!
Bhishma Ashtami 2023:అందరూ కృష్ణుడిని తలుచుకుంటే కృష్ణుడు ఎవర్ని స్మరించాడో తెలుసా!
Srimad Bhagavatam:పెళ్లి ఆలస్యం అయ్యే అమ్మాయిలు రుక్మిణీ కళ్యాణం - మరి పెళ్లికాని అబ్బాయిలు ఏం చదవాలంటే!
Weekly Horoscope 30 January to 5 February 2023: ఈ వారం ఈ రాశులవారికి అనుకూలం, ఆ రాశులవారికి ప్రతికూలం- జనవరి 30 నుంచి ఫిబ్రవరి 5 రాశి ఫలాలు
Horoscope Today 29th January 2023: ఈ రాశులవారు ఈరోజు ఏం చేసినా మంచి ఫలితమే వస్తుంది, జనవరి 29 రాశిఫలాలు
మొన్న బాలకృష్ణ, నేడు చిరంజీవి - వివాదాలకు కేరాఫ్ గా సక్సెస్ మీట్లు? ఇంతకీ ఏమైంది?
Nara Lokesh Yatra: తాళిబొట్లు తాకట్టు పెట్టించిన వ్యక్తి సీఎం, ఎంత మోసగాడో అర్థం చేసుకోండి - లోకేశ్ వ్యాఖ్యలు
BRS Nanded Meeting: నాందేడ్‌లో బీఆర్ఎస్ సభ, ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
Delhi Khalistan Attacks : దిల్లీలో ఖలిస్థానీ స్లీపర్ సెల్స్, ఉగ్రదాడులకు ప్లాన్- నిఘా సంస్థల హెచ్చరిక