![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Mercury Transit in Taurus 2024 : వృషభ రాశిలోకి బుధుడు - ఈ రాశులవారికి ఆర్థికంగా అదృష్టమే కానీ వ్యక్తిగత జీవితంలో సమస్యలు తప్పవు!
Mercury Transit 2024: మే 09 న మేషరాశిలోకి ప్రవేశించిన బుధుడు..మే 28న వృషభంలోకి అడుగుపెడతాడు. జూన్ 13 వరకూ ఇదే రాశిలో సంచరిస్తాడు..ఈ ప్రభావం కొన్ని రాశుల వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపిస్తుంది...
![Mercury Transit in Taurus 2024 : వృషభ రాశిలోకి బుధుడు - ఈ రాశులవారికి ఆర్థికంగా అదృష్టమే కానీ వ్యక్తిగత జీవితంలో సమస్యలు తప్పవు! Mercury Transit in Taurus 2024 Its Impact on these zodiac sign love and marriage life Mercury Transit in Taurus 2024 : వృషభ రాశిలోకి బుధుడు - ఈ రాశులవారికి ఆర్థికంగా అదృష్టమే కానీ వ్యక్తిగత జీవితంలో సమస్యలు తప్పవు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/24/9a2371bf416f2036ea34010ef8fae1db1716517418233217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Mercury Transit in Taurus 2024: గ్రహాల రాకుమారుడుగా చెప్పే బుధుడు ఈ నెలలో రెండోసారి రాశిమారుడుతున్నాడు. మే నెల ఆరంభంలో మేషరాశిలో ప్రవేశించిన బధుడు ఈ నెల చివర్లో వృషభ రాశిలోకి అడుగుపడతాడు. బధుడి రాశిపరివర్తనం మీ రాశిపై అనుకూల ప్రభావం చూపితే శారీరకంగా బలంగా లేకపోయినా మానసికంగా దృఢంగా ఉంటారు. మంచి తెలివితేటలు కలిగి ఉంటారు..శత్రువులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు. బధుడి సంచారం ప్రతికూల దిశలో ఉంటే చిన్న చిన్న విషయాలకు కూడా మానసికంగా కుంగిపోతారు.
మేష రాశి
వృషభ రాశిలో బుధుడి సంచారం మేష రాశివారికి మంచి ఫలితానిస్తంది. ఈ సమయంలో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. శత్రువులు ఎంత బలంగా ఉన్నప్పటికీ వాళ్లకి చెక్ పెట్టడంలో సక్సెస్ అవుతారు. ఆరోగ్యం బావుంటుంది. చాలాకాలంగా వ్యాపారంలో పెండింగ్ లో ఉన్న డబ్బు చేతికందుతుంది. ఉద్యోగులుకు మంచి ఫలితాలే ఉన్నాయి కానీ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అయితే జీవిత భాగస్వామితో మాటపట్టింపులు ఉంటాయి జాగ్రత్త. కాస్త ఓపికగా వ్యవహరించడం మంచిది.
మిథున రాశి
వృషభ రాశిలో బుధుడి సంచారం సమయంలో మీ వ్యక్తిగత జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు తప్పవు. మీ ప్రియమైనవారితో సమస్యలు వస్తాయి. మానసికంగా కుంగిపోతారు. ఈ సమయంలో అనవసర వాదనలకు దూరంగా ఉండడం మంచిది.
Also Read: ఈ రోజు రాశిఫలాలు (24/05/2024)
సింహ రాశి
సింహ రాశి వారి వ్యక్తిగత జీవితంపై...బుధుడు ప్రతికూల ప్రభావం చూపిస్తాడు. వృషభ రాశిలో బుధుడు సంచరిస్తే సమయంలో బంధాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వివాదాలు, మానసిక సమస్యలు తప్పవు.
వృశ్చిక రాశి
వృషభ రాశిలో బుధుడి పరివర్తనం వృశ్చికరాశి వారి వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపిస్తుంది. మీ భాగస్వామిని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. అయితే సమస్యను పెంచుకునే కన్నా కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా పరిష్కారం లభిస్తుంది.
ధనుస్సు రాశి
బుధుడి ప్రభావం ధనస్సు రాశి వైవాహిక జీవితంపై చూపిస్తుంది. అనవసర వాదనలు, వివాదాలు ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నవారు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలి. ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి.
Also Read: ఈ ఏడాది రెండో సూర్యగ్రహణం, రెండో చంద్రగ్రహణం ఎప్పుడొచ్చిందో తెలుసా!
మకర రాశి
వృషభ రాశిలో బుధుడి ప్రవేశం..మకర రాశివారి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. ఆహారం విషయంలో అశ్రద్ధగా ఉండొద్దు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మరింత శ్రద్ధగా చదవాలి. ఈ సమయంలో వ్యాపారంలో మీకు ఆర్థిక లాభాలుంటాయి.
కుంభ రాశి
కుంభ రాశివారికి బుధుడి సంచారంలో ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగుల పనితీరు మెరుగుపడుతుంది. అయితే కుటుంబంలో సమస్యలు ఇబ్బంది పెడతాయి. వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే సమస్యలను కూర్చుని మాట్లాడుకోవడంద్వారా పరిష్కరించుకోవడం మంచిది. పరిస్థితులు చక్కబడతాయని వదిలేస్తే చేజారిపోయే ప్రమాదం ఉందని గుర్తించాలి.
Also Read: 2025 మే వరకూ మీన రాశిలోనే రాహువు - ఈ రాశులవారికి ప్రతిరోజూ పండుగే!
గమనిక:ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)