2nd Solar Eeclipse of Year 2024:ఈ ఏడాది రెండో సూర్యగ్రహణం, రెండో చంద్రగ్రహణం ఎప్పుడొచ్చిందో తెలుసా!
Eclipse 2024: ఈ ఏడాది నాలుగు గ్రహణాలున్నాయి. ఇప్పటికే ఏర్పడిన గ్రహణాలు భారతదేశంలో కనిపించలేదు..ఇకముందు ఏర్పడేవి కూడా భారతదేశంలో కనిపించవు...ఏర్పడబోయే గ్రహణాల డేట్, టైమ్, సూతకాలం ఎప్పుడంటే...
2nd Solar Eeclipse of Year 2024: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహణాలను చాలా ముఖ్యమైనవిగా పరిగణిస్తారు. శ్రీ క్రోధినామ సంవత్సరం (2024-2025) లో మొత్తం నాలుగు గ్రహణాలున్నాయి. ఇందులో 2 సూర్యగ్రహణాలు,2 చంద్ర గ్రహణాలు. వీటిలో మొదటి సూర్యగ్రహణం 2024 ఏప్రిల్ 08 సోమవారం ఏర్పడింది. ఈ గ్రహణం భారతదేశంలో ఎక్కడా కనిపించలేదు. మొదటి చంద్రగ్రహణం 25 మార్చి 2024న సంభవించింది. ఈ ఏడాది రెండో సూర్యగ్రహణం, రెండో చంద్ర గ్రహణం ఎప్పుడొస్తున్నాయి? సూతకాలం ఎప్పుడు? ఇవి భారతదేశంలో కనిపిస్తాయా? ఇక్కడ తెలుసుకోండి..
2024 సంవత్సరంలో రెండో సూర్యగ్రహణం అక్టోబర్ 2న ఏర్పడుతుంది
అక్టోబరు 2 బుధవారం కంకణాకార సూర్యగ్రహణం భారతకాలమానం ప్రకారం రాత్రి 9:13 గంటలకు సంభవిస్తుంది. సూతకాలం అక్టోబర్ 2 న ఉదయం 9:13 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ గ్రహణం అర్జెంటీనా, అట్లాంటిక్ మహాసముద్రం, బ్రెజిల్, చిలీ, పెరూ, అంటార్కిటికా, అర్జెంటీనా, మెక్సికో, న్యూజిలాండ్, ఆర్కిటిక్, ఫిజీ వంటి అనేక దేశాల్లో ఇది కనిపిస్తుంది. ఈ గ్రహణం కూడా భారతదేశంలో కనిపించదు.
Also Read: రాశిఫలాలు (22/05/2024) ఈ రాశులవారికి ఈ రోజు అదృష్టం కలిసొస్తుంది!
2025 మార్చి 14న సంపూర్ణ చంద్రగ్రహణం
ఫాల్గుణ మాసం మార్చి 14న శుక్రవారం చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణం మోజాకో, ఐర్లాండ్, ఫోర్చుగల్, USA, బ్రెజిల్, అర్జెంటీనా, కెనడా, వెనిజులా, టర్కీ, దక్షిణ ఆప్రికా, ఈజిప్టు, రొమేనియా, బల్గేరియా, గ్రీసు, పోలెండ్, హంగేరి, నెదర్లాండ్, బెల్జియం, అల్జీరియా, ఫ్రాన్స్, ఇంగ్లండ్, స్పెయిన్, ఆస్ట్రేలియా దేశాల్లో కనిపిస్తుంది.ఈ గ్రహణం కూడా భారతదేశంలో ఎక్కడా కనిపించదు...దీనికి కూడా సూతకాలం మనం పాటించాల్సిన అవసరం లేదు.
2025 మార్చి 29 పాక్షిక సూర్యగ్రహణం
ఫాల్గుణమాసం అమావాస్య మార్చి 29...2025 శనివారం పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతోంది. ఈ గ్రహణం బెర్ముడా, ఫోర్చుగల్, కెనడా, USA, మొరాకో, గ్రీన్లాండ్, ఐర్లాండ్, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, ఐస్ లాండ్, బెల్జియం, నెదర్లాండ్స్, ఫారోదీవులు, జర్మనీ,డెన్మార్క్, ఫిన్లాండ్, రష్యా, హంగేరి, ఇటలీ, ఫోలాండ్, రొమేనియా, ఉక్రెయిన్, వెనిజులా, వాటికన్ సిటీలో కనిపిస్తుంది. ఇది కూడా భారతదేశంలో కనిపించదు...నియమాలు పాటించాల్సిన అవసరం లేదు.
Also Read: 2025 మే వరకూ మీన రాశిలోనే రాహువు - ఈ రాశులవారికి ప్రతిరోజూ పండుగే!
సాధారణంగా గ్రహణాలు ఏర్పడే దేశాల్లో ప్రకృతి వైపరీత్యాలు, దేశపాలకులకు నష్టాలు, దుస్సంఘటనలు, వాహన -విమాన ప్రమాదాలు, దేశాల మధ్య యుద్ధాలు జరిగి నష్టం కలుగుతుంది. గ్రహణాలు ఏర్పడే దేశాల్లో భూకంపం కూడా సంభవిస్తుంది...
మనదేశంలో గ్రహణం కనిపించినా కనిపించకపోయినా గ్రహణ నియమాలు పాటించాలి అనుకున్నవారు ఆ సమయంలో పూజలు చేయరు. గ్రహణ సమయంలో ఆహారం వండకూడదు, తినకూడదు..గ్రహణ సమయంలో , పూర్తైన వెంటనే బయటకు వెళ్లడం సరికాదు. గ్రహణం ముగిసిన తర్వాత ఇంట్లో దేవుడి విగ్రహాలను శుభ్రంచేయాలి. గ్రహణం తర్వాత చేసే దానాలు అత్యంత పుణ్యఫలం. ఈ సమయంలో గాయత్రి మంత్రం మహామృత్యుంజయ మంత్రాన్ని జపించాలి.
గాయత్రీ మంత్రం
ఓం భూర్భువస్వః తత్స వితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియోయోనఃప్రచోదయాత్
మహామృత్యుంజయ మంత్రం
"ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్"
గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.