Mercury and Saturn Conjunction: ఒకే రాశిలో రెండు స్నేహపూర్వక గ్రహాలు..ఈ 3 రాశులవారికి పట్టిందల్లా బంగారమే!
Astrology: 2025లో కీలక గ్రహాలు తమ స్థానాన్ని మార్చుకోనున్నాయి. ఇదే సమయంలో వేరే గ్రహాలతో కలసి రాశి పరివర్తనం చెందుతున్నాయి. ఈ ప్రభావం అన్ని రాశులపైనా ఓ రేంజ్ లో ఉంటుంది.

Mercury and Saturn Conjunction 2025: గ్రహాలు రాశులమారిన ప్రతిసారీ కొన్ని రాశులవారికి అనుకూల, కొన్ని రాశులవారికి ప్రతికూల, మరికొన్ని రాశులవారికి మిశ్రమ ఫలితాలు పొందుతారు. కొన్ని రాశులవారికి మాత్రం అదృష్టం ఓ రేంజ్ లో ఉంటుంది. కొన్ని గ్రహాల పరివర్తనం సమయంలో... చేపట్టిన పనులన్నీ సక్సెస్ ఫుల్ గా పూర్తవుతాయి. నూతన పెట్టుబడులు కలిసొస్తాయి. ఆరోగ్యం బావుంటుంది. ఆదాయం మెరుగుపడుతుంది. శుభవార్తలు వింటారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. అవివాహితులకు వివాహం నిశ్చయం అవుతుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది.
Also Read: 2025 మొత్తం మేషరాశివారిపై శని ప్రభావం.. ఇబ్బందులతో సావాసం!
2025 మార్చి ఎండింగ్ వరకూ శని కుంభ రాశిలో సంచరిస్తాడు.. ఆ తర్వాత మీన రాశిలోకి మారుతాడు. అయితే నెల రోజులకో రాశిలో పరివర్తనం చెందే బుధుడు ప్రస్తుతం వృశ్చిక రాశిలో ఉన్నాడు. జనవరి 05న వృశ్చికం నుంచి ధనస్సు రాశిలోకి ... ఆతర్వాత జనవరి 23న మకర రాశిలోకి .. ఫిబ్రవరి 09న కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ నెలాఖరు వరకూ కుంభరాశిలోనే ఉంటాడు బుధుడు. ఈ సమయంలో శని దేవుడు కూడా కుంభ రాశిలోనే ఉంటాడు. శని-బుధుడిని స్నేహపూర్వక గ్రహాలుగా చెబుతారు. ఈ రెండూ ఒకే రాశిలో సంచరించే సమయంలో కొన్ని రాశులవారికి అదృష్టం ఓ రేంజ్ లో ఉంటుంది. ఈ యోగం వల్ల ఆయా రాశులవారు జాక్ పాట్ కొడతారు..
మేష రాశి
2025 ఆరంభంలోనే మేష రాశివారికి శుభఫలితాలుంటాయి. ఏడాదిలో మొదటి మూడు నెలలు అద్భుతంగా ఉంది. ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది. చేపట్టిన ప్రతి పనిలోనూ సక్సెస్ అందుకుంటారు. అదృష్టం కలిసొస్తుంది. ఉద్యోగం, వ్యాపారం, విద్య అన్నిరంగాలవారికి అనుకూల సమయం.
Also Read: వృషభ రాశి వార్షిక ఫలితాలు 2025 - ఒక్క నెల మినహా ఏడాది మొత్తం వృషభ రాశివారికి అద్భుతంగా ఉంటుంది
మకర రాశి
బుధుడు, శని గ్రహాల కలయిక మకర రాశివారికి అన్న విధాలుగా కలిసొచ్చే ఫలితాలను అందించనుంది. ఈ సమయంలో ఎవ్వరూ ఊహించని విధంగా కెరీర్లో సక్సెస్ అవుతారు. ఫ్యూచర్ కోసం సరికొత్త ప్రణాళికలు వేసుకుంటారు. జీవితానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. గొప్ప గొప్ప వ్యక్తులను కలుస్తారు. చేసిన అప్పులు తీర్చేస్తారు..ఆదాయం పెంచుకోవడంలో సక్సెస్ అవుతారు. ఆర్థిక పరిస్థితి ఊహించనివిధంగా మెరుగుపడుతుంది. ఆరోగ్యం బావుంటుంది. అన్నీ సంతోషాలే...
కుంభ రాశి
నూతన ఏడాది 2025 లో శని-బుధుడు కలయిక కంభ రాశివారికి అదృష్టం తీసుకొస్తోంది.మీ రాశిలోనే ఈ రెండు గ్రహాల సంచారం అద్భుతంగా కలిసొస్తుంది. గ్రహాల రాకుమారుడైన బుధుడు స్నేహితుడైన శనితో కలసి మీకు భారీ లాభాలు అందించబోతున్నాడు. ఉద్యోగులు పదోన్నతికి సంబంధించిన సమాచారం వింటారు. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. ఆదాయం మెరుగుపడుతుంది. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
బుధుడు
ప్రియంగు కలికాశ్యామం | రూపేణా ప్రతిమం బుధం
సౌమ్యం సత్వగుణోపేతం | తం బుధం ప్రణమామ్యహం ||
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
Also Read: 6 నెలలు చికాకులు 6 నెలలు ప్రశాంతత .. గృహం , వాహన యోగం - మిథున రాశి వార్షిక ఫలితాలు 2025!





















