News
News
X

March Horoscope 2023: మార్చి నెలలో ఈ రాశులవారికి వ్యవహార జయం, ఆర్థిక లాభం

March Rasi Phalalu 2023: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

FOLLOW US: 
Share:

March Horoscope 2023:  మార్చి నెలలో ఈ ఆరు రాశులవారికి చిన్న చిన్న ఇబ్బందులు మినహా అన్నీ అనుకూల ఫలితాలే ఉన్నాయి...అనుకున్న పనులు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది

మేష రాశి  (అశ్వని, భరణి, కృత్తిక 1 పాదం)

మార్చి నెల మేషరాశివారికి మిశ్రమఫలితాలున్నాయి.ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. అయితే ఆ ఖర్చులన్నీ శుభకార్యాలకోసమే అవుతుంది. శుభవార్త వినే అవకాశం ఉంది. సంతానం కారణంగా చిన్న చిన్న ఇబ్బందులుంటాయి. శత్రువులు యాక్టివ్ గా ఉంటారు..మీరు అప్రమత్తంగా ఉండాలి. జీవిత భాగస్వామితో తగాదాలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన సొమ్ము వస్తుంది. స్నేహితుల సహాయంతో అనుకున్న పనులు పూర్తిచేస్తారు.

కన్యా రాశి  (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు)

మార్చి నెలలో కన్యారాశివారికి శుభాశుభాలు మిశ్రమంగా ఉంటాయి. నెలలో మొదటి అర్థభాగం చాలా అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థికంగా, వృత్తిపరంగా కలిసొస్తుంది. వ్యవహారాల్లో జయం, నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. ద్వితీయార్థంలో అష్టమ శుక్రుడు ప్రభావంవల్ల ఇంటా బయటా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోకతప్పదు..కానీ అవన్నీ వచ్చినట్టే వచ్చి  త్వరలోనే సమసిపోతాయి.ఉద్యోగులకు శుభసమయం. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. 

Also Read: వార ఫలాలు, మార్చి మొదటి వారం ఈ రాశివారు తమ ఇష్టానికి విరుద్ధంగా వ్యవహరించాల్సి వస్తుంది!

తులా రాశి  (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పాదాలు)

ఈ నెలలో అన్నిరంగాల వారికి చేయూత లభిస్తుంది. చేసే వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. ఆరోగ్యం బావుంటుంది. ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. ఉత్సాహంగా ఉంటారు. ఇప్పటి వరకూ వెంటాడుతున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. సంతోషకర వార్తలు వింటారు. అయినప్పటికీ ఏదో విషయంలో మానసికంగా బాధపడతారు, మనోధైర్యాన్ని కోల్పోతారు. కుటుంబంలో మాటలుపడతారు

వృశ్చిక రాశి  (విశాఖ 4 పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

వృశ్చిక రాశివారికి మార్చినెల పరిస్థితులు కాస్త అటు ఇటుగా ఉంటుంది. అన్ని పనుల్లో మిశ్రమ మిశ్రమ ఫలితాలే ఉన్నాయి.  వ్యాపారులు లాభపడతారు. మీ మాటకు ప్రాధాన్యత పెరుగుతుంది. ధైర్యసాహసాలతో ఉంటారు. వాహనం కొనుగోలు చేయాలన్న మీ ఆలోచన నెరవేరుతుంది. శత్రులపై పైచేయి సాధిస్తారు. సంతానం కారణంగా సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత ఉండదు. అనవసర వివాదానికి దూరంగా ఉండండి. మాటతూలి బంధాన్ని బలహీనపర్చుకోవద్దు. ప్రారంభించిన పనులకు అడ్డంకులు ఏర్పడతాయి. 

ధనస్సు రాశి  (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పాదం)

మార్చి నెల ధనస్సు రాశివారికి బావుంటుంది. అనారోగ్య సమస్యలు తీరిపోతాయి. చేసేపనిలో ధైర్యంగా అడుగేస్తారు. శుభకార్యాలకు హాజరవుతారు. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితులు ఇప్పుడిప్పుడే ఓ కొలిక్కి వస్తాయి.  కఠినమైన సమస్య ఎదురైనా అలవోకగా పరిష్కరించుకుంటారు. ధనలాభం ఉంటుంది. కుటుంబ సమస్యలు తీరిపోతాయి. ఈ నెలంతా సంతోషంగా ఉంటారు.

Also Read: ఈ వారం ఈ రాశులవారికి చాలా ముఖ్యమైనది అవుతుంది

మకర రాశి  (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)

మకర రాశివారికి చెందిన వారు ఈ నెలలో అన్ని రంగాల్లో రాణిస్తారు. ఆరోగ్యం బావుంటుంది. ఇంట్లో పెండింగ్ ఉన్న శుభకార్యం పూర్తిచేసేందుకు అడుగు ముందుకేస్తారు. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. శత్రువులపై ఆధిక్యత సాధిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఊహించని విరోధాలు మిమ్మల్ని ఇబ్బందిపెడతాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. మాట విసరకండి. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి.

Published at : 28 Feb 2023 06:02 AM (IST) Tags: 12 zodiac signs March Horoscope 2023 in telugu Your March Horoscope Is Here Virgo Horoscope March 2023 March Monthly Horoscope

సంబంధిత కథనాలు

Weekly Horoscope (03-09 April): ఈ రాశులవారు ఈ వారం ఏ విషయంలోనూ తొందరపడొద్దు, ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్త!

Weekly Horoscope (03-09 April): ఈ రాశులవారు ఈ వారం ఏ విషయంలోనూ తొందరపడొద్దు, ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్త!

వారఫలాలు ( ఏప్రిల్ 03 నుంచి 09 ): ఈ వారం ఈ రాశులవారికి అదృష్టం కలిసొస్తుంది, ఆశించిన పురోగతి సాధిస్తారు

వారఫలాలు ( ఏప్రిల్ 03 నుంచి 09 ): ఈ వారం ఈ రాశులవారికి అదృష్టం కలిసొస్తుంది, ఆశించిన పురోగతి సాధిస్తారు

ఏప్రిల్ 2 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్ లో ప్రయోజనకరంగా ఉంటుంది

ఏప్రిల్ 2 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్ లో ప్రయోజనకరంగా ఉంటుంది

Astrology: మీది ఈ రాశుల్లో ఒకటా- ఇక మీ కష్టాలు తీరినట్టే

Astrology: మీది ఈ రాశుల్లో ఒకటా- ఇక మీ కష్టాలు తీరినట్టే

Hanuman Jayanti 2023 Hanumath Vijayotsavam: ఏప్రిల్ 6 హనుమాన్ జయంతి కాదు - హనుమాన్ విజయోత్సవం!

Hanuman Jayanti 2023 Hanumath Vijayotsavam: ఏప్రిల్ 6 హనుమాన్ జయంతి కాదు - హనుమాన్ విజయోత్సవం!

టాప్ స్టోరీస్

Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్

Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్

Kadiam Srihari: ఎన్నికల్లో నన్ను వాడుకుంటారు, ఈ మీటింగ్‌లకు మాత్రం పిలవరు - ఎమ్మెల్సీ కడియం వ్యాఖ్యలు

Kadiam Srihari: ఎన్నికల్లో నన్ను వాడుకుంటారు, ఈ మీటింగ్‌లకు మాత్రం పిలవరు - ఎమ్మెల్సీ కడియం వ్యాఖ్యలు

MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం

MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం

IPL Match Hyderabad: హైదరాబాద్‌లో IPL సందడి - టీఎస్ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటనలు

IPL Match Hyderabad: హైదరాబాద్‌లో IPL సందడి - టీఎస్ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటనలు