Mangal Gochar 2025: తులా రాశిలోకి మంగళుడు - ఎవరికి లాభం, ఎవరికి నష్టం, ఎవరు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?
Mars Transit In Libra On 2025 : సెప్టెంబర్ 13న కుజుడు కన్యా రాశి నుంచి తులా రాశిలోకి ప్రవేశిస్తాడు. 12 రాశులపై ఈ ప్రభావం, ధన లాభం, వివాదాలు, ఆరోగ్యం గురించి తెలుసుకోండి.

Mars Transit 2025: మంగళుడు సెప్టెంబర్ 12న కన్యారాశి నుంచి తులా రాశిలోకి ప్రవేశిస్తాడు. జ్యోతిష్య శాస్త్రంలో అగ్ని తత్వానికి ప్రతినిధిగా, క్రూర గ్రహంగా పరిగణించే మంగళుడు సాహసం, శక్తి, పట్టుదల , పోరాటానికి చిహ్నంగా ఉంటాడు.
మంగళుడు తులా రాశిలో అక్టోబర్ 26 వరకూ ఉంటాడు. ఈ గ్రహం జీవితంలో చురుకుదనం , పరాక్రమాన్ని తెస్తుంది.. అయితే బలహీనంగా లేదా అశుభంగా ఉండటం వలన వ్యక్తి ఆరోగ్యం, సంబంధాలు , ఆర్థిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
ఒక వ్యక్తి జాతకంలో మంగళ గ్రహం స్థానం చాలా ముఖ్యమైనది. మంగళుడు బలహీనంగా లేదా అశుభ స్థానంలో ఉంటే, ఒత్తిడి, కుటుంబ కలహాలు, ఆరోగ్య సమస్యలు , ఆర్థిక నష్టం వంటి అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి.
జ్యోతిష్య శాస్త్రంలో మంగళ గ్రహాన్ని శక్తి, ధైర్యం, పరాక్రమం , దృఢ సంకల్పానికి కారకంగా భావిస్తారు. మంగళ గ్రహానికి భూమితో కూడా సంబంధం ఉంది. ఏ జాతకుల జాతకంలో మంగళ గ్రహం శుభ స్థానంలో ఉంటారో, ఆ వ్యక్తి సాహసోపేతమైనవాడు, నాయకత్వం వహించగలడు చాలా ఉత్సాహంగా ఉంటాడు.
జాతకంలో మంగళుడు వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు వ్యక్తిలో దూకుడు, పోరాటం, ఆత్రుత కలిగి ఉంటాడు. వైదిక జ్యోతిష్య శాస్త్రంలో మంగళుడు శక్తి, ధైర్యం, దూకుడు, దృఢ సంకల్పానికి చిహ్నంగా ఉంటాడు.
మంగళుడు సంచారం వల్ల దేశం, ప్రపంచంపై ప్రత్యేక ప్రభావం కనిపిస్తుంది. దీనితో పాటు, 12 రాశుల వారిపై కూడా ప్రభావం కనిపిస్తుంది.
జ్యోతిష్య శాస్త్రంలో మంగళుడిని అన్ని గ్రహాలకు అధిపతిగా ఉంటాడు.మంగళుడు మేష రాశి , వృశ్చిక రాశికి అధిపతిగా పరిగణిస్తారు. మకర రాశిలో మంగళుడు ఉచ్ఛస్థితికి చేరుకుంటాడు, అయితే కర్కాటక రాశిలో మంగళుడు నీచస్థితికి చేరుకుంటాడు.
సూర్యుడు, చంద్రుడు , బృహస్పతితో స్నేహం ఉంది. బుధుడితో మాత్రం మంగళుకిడి శత్రుత్వం. శుక్రుడు - శనితో సమాన సంబంధం ఉంది. మంగళ దేవుడు పరాక్రమం, చురుకుదనం, ధైర్యం, ఆత్మవిశ్వాసం, ఓర్పు, దేశభక్తి, బలం, రక్తం, ఆకాంక్ష ఆయుధ విద్యకు అధిపతిగా పరిగణిస్తారు. అగ్ని తత్వం కలిగి ఉండటం వల్ల మంగళుడు అన్ని జీవులకు జీవశక్తినిస్తాడు...ఇది ఉత్సాహం ధైర్యానికి ప్రేరణగా ఉంటుంది.
మంగళుడి శుభ-అశుభ ప్రభావం
తులారాశిలో మంగళుడి ప్రవేశం.. ఉపాధి రంగాలలో వృద్ధి ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది శుభసూచకం.
ఆహార పదార్థాల ధరలు సాధారణంగా ఉంటాయి. కూరగాయలు, నూనెగింజలు , పప్పుధాన్యాల ధరలు తగ్గుతాయి. వ్యాపారంలో వేగం ఉంటుంది. బంగారం వెండి ధరలు పెరుగుతాయి.
రాజకీయాల్లో హెచ్చు తగ్గులు ఉంటాయి. ప్రకృతి వైపరీత్యాలతో పాటు అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, గ్యాస్ ప్రమాదాలు, విమాన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ అస్థిరత అంటే రాజకీయ వాతావరణం ఎక్కువగా ఉంటుంది.
ప్రపంచవ్యాప్తంగా సరిహద్దుల్లో ఉద్రిక్తత మొదలవుతుంది. మంగళుడి కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో గాలితో కూడిన వర్షాలు కురుస్తాయి. భూకంపాలు లేదా ఇతర ప్రకృతి వైపరీత్యాలు వచ్చే అవకాశం ఉంది.
పూజలు, దానాలు చేయండి
మంగళుడి అశుభ ప్రభావాలను నివారించడానికి హనుమంతుడిని పూజించాలి. ఎర్ర చందనం పెట్టుకోవాలి.
రాగి పాత్రలో గోధుమలను ఉంచి దానం చేయాలి. ఎరుపు రంగు దుస్తులను దానం చేయండి. మసూర్ పప్పును దానం చేయండి. తేనె తిని ఇంటి నుంచి బయలుదేరండి. హనుమాన్ చాలీసా పఠించండి. మంగళవారం రోజున కోతులకు బెల్లం , శనగలు తినిపించండి.
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.





















