Love Horoscope Today 23rd November 2022: ఈ రాశివారి మనస్సు చంచలంగా ఉంటుంది
Love Horoscope Today 23rd November 2022: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
Love Horoscope Today 23rd November 2022: ఈ రోజు ఏ రాశివారి ప్రేమ జీవితం ఎలా ఉందో చూద్దాం...
మేష రాశి
ఈ రాశివారికి ప్రేమ వ్యవహారాలకు సంబంధించి హెచ్చు తగ్గులతో కూడిన రోజు అని చెప్పవచ్చు. జీవిత భాగస్వామితో చిన్న చిన్న వివాదాలు ఉన్నప్పటికీ వారు లేకుండా జీవించలేని పరిస్థితి వస్తుంది. కొన్ని సందర్భాల్లో పనికిరాని విషయాలను కూడా ఎక్కువ ఆలోచిస్తారు.
వృషభ రాశి
మీ మనస్సు చంచలంగా ఉంటుంది..దీంతో ఏ పనిలోనూ పూర్తిగా కాన్సన్ ట్రేషన్ పెట్టలేరు. ఒంటరిగా ఫీలవుతారు. ప్రేమ జీవితం కూడా అంత బాగా ఉండదు. కుటుంబంలో చిన్న చిన్న విషయాలకే మాట మాట అనుకుంటారు
మిథున రాశి
కొత్త సంబంధాలు ఏర్పరుచుకోవడానికి అస్సలు మంచి రోజు కాదు. ఇప్పటికే రిలేషన్ షిప్ లో ఉన్నవారు సంతోషంగా ఉంటారు. మనసులో ఎన్నో ఆలోచనలు ఉంటాయి..ప్రేమించిన వారితో మనసులో మాట చెప్పుకోవడం కూడా మీలో ఆందోళన కలిగిస్తుంది
Also Read: 2023లో ఈ రాశివారు అన్నింటా సక్సెస్ అవుతారు, ఏడాది సెకండాఫ్ అద్భుతంగా ఉంటుంది
కర్కాటక రాశి
మీరు ప్రేమించిన వ్యక్తులను సంతోషంగా ఉంచేందుకు కొత్తగా ఏదైనా ఆలోచిస్తారు...కానీ ప్రేమికులు మీ కొత్త ఆలోచనను అస్సలు స్వాగతించరు. మీ అభిప్రాయాన్ని విస్మరించడం వల్ల ఇద్దరి మధ్యా కొంత అసమ్మతి నెలకొంటుంది.
సింహ రాశి
సొంత అభిప్రాయాలు ఎదుటివారిపై రుద్దడం వల్ల జీవిత భాగస్వామి అయినా ప్రేమికుల మధ్య అయినా చిన్న చిన్న మనస్పర్థలు ఉంటాయి. కొన్ని అడ్డంకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దాన్ని అడ్డంకిగా భావించకుండా పరిష్కరించుకోవడం మంచిది.
కన్యా రాశి
ప్రేమ, పిచ్చి, విపరీతత్వం..వీటి మధ్య తేడా తెలుసుకోవడం మంచిది. జీవిత భాగస్వామి అయినా, ప్రేమికులు అయినా ఈ రోజు మీ విషయంలో పిచ్చిగా ఉంటారు...మీ సంబంధానికి అది ఎంతమాత్రం మంచిది కాదని గుర్తించాలి
తులా రాశి
మీ ప్రేమ సంబంధాలను బలోపేతం చేయాలి అనుకుంటే మీ విశ్వాసం కూడా అంతే బలంగా ఉండాలి. ప్రేమికులు చెప్పిన దానికి తలఊపినంత మాత్రాన మీ బంధం బలపడుతుందని అనుకోవద్దు. కొన్ని నిర్ణయాత్మక చర్యలు కూడా తీసుకోవాలి
Also read: 2023లో ఆరంభంలో ఈ రాశివారు మానసికంగా బాధపడతారు, ఆర్థికపరిస్థితి మాత్రం ఆశాజనకం
వృశ్చిక రాశి
మీ ప్రేమ జీవితానికి మార్గం సుగమంగా ఉంటుంది కానీ..మీరు దాన్ని పూర్తి స్థాయిలో అనుభూతి చెందలేరు. జీవిత భాగస్వామి తో ఉన్న వివాదాలు పరిష్కరించుకోవడానికి మిమ్మల్ని మీరు రిఫ్రెష్ చేసుకోవడానికి ఈ రోజు మంచి అవకాశం అని గుర్తించాలి
ధనుస్సు రాశి
ఏ విషయంలో అయినా మీ ఇద్దరిదీ సమాన బాధ్యత ఉంటుంది..ఫలితం కూడా సమానంగా అనుభవించాలి. కొన్ని విషయాల్లో మీ ప్రియమైన వారిని మాత్రమే బాధ్యులను చేయొద్దు. ఇలాంటి విషయంలో జాగ్రత్తలు తీసుకోపోవడం వల్ల ఇద్దరి మధ్యా మాటలు కూడా తగ్గుతాయని గుర్తించాలి
మకర రాశి
ఈ రోజు మకర రాశివారు తమ ప్రేమను చెప్పాలి అనుకుంటే మంచిరోజు. పాత సంబంధాల విషయంలో ఈ రోజు ఉత్సాహంగా ఉంటారు. ప్రేమ జీవితం పట్ల మక్కువ అలాగే ఉంటుంది. సంబంధాల్లో మాధుర్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు
కుంభ రాశి
మీ ప్రేమ జీవితంలో కొన్ని అడ్డంకులు ఉండవచ్చు. ఈ అడ్డంకులను అధిగమించడానికి ధైర్యం చేస్తే మంచిది కానీ ఈ రాశివారు వెనకడుగు వేస్తారు. ఈ ఒక్కవిషయం మార్చుకుంటే మీరు బంధంలో మాధుర్యాన్ని ఫీలవుతారు.
మీన రాశి
ఈ రాశివారి ప్రేమ జీవితంలో ఒడిదొడుకులు ఉంటాయి. కానీ ప్రతిసారీ వాటిని తీవ్రంగా ఆలోచిస్తే ప్రేమ జీవితం సాఫీగా సాగదు. ప్రతి చిన్న విషయాన్ని క్లిష్టతరం చేసేబదులు సరీళకృతం చేసుకోవడం ఉత్తమం.
మేష రాశి నుంచి కన్యా రాశి వరకూ వారఫలాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి....
తులా రాశి నుంచి మీన రాశి వరకూ ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి.....