Jupiter mars conjunction: 12 ఏళ్ల తర్వాత కుజుడు, గురు గ్రహాల కలయిక - ఈ రాశులవారికి డబ్బే డబ్బు
Jupiter mars conjunction:జూలై 12న వృషభరాశిలో గురు,కుజుడు కలిసిపోతారు.ఈ రెండు గ్రహాల కలయిక వల్ల ఏ రాశుల వారికి శుభ ఫలితాలు లభిస్తాయో వివరంగా తెలుసుకుందాం.
Jupiter mars conjunction: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలన్నీ ఒక నిర్దిష్ట విరామం అనంతరం రాశిచక్రాలను మారుస్తుంటాయి. ఇది మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశులపై శుభ, అశుభ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. కాగా ఈ ఏడాది జులై నెలా చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే జూలై 12న కుజుడు తన రాశిని మార్చి వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రాశిలో బృహస్పతి గ్రహం ఇప్పటికే ఉంది.
జూలై 12న (శుక్రవారం).. శుక్రుడు తన యాజమాని వృషభంలో బృహస్పతి, కుజ గ్రహాలను కలవనుంది. ఈ రెండు గ్రహాలు ఆగస్టు 26 వరకు కలయికలో ఉంటాయి. దాదాపు 12 ఏళ్ల క్రితం ఈ తరహా కూటమి ఏర్పడింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, బృహస్పతి, కుజుడు ఒకరికొకరు స్నేహితులు. అందువల్ల ఈ రెండు గ్రహాల కలయిక కొన్ని రాశిచక్రాలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కుజుడు వృషభరాశిలో కూర్చొని బృహస్పతి దగ్గరకు చేరుకుంటాడు. ఈ ఏడాది ప్రత్యేకత ఏమిటంటే.. సుమారు 12 ఏళ్ల తర్వాత గురు, కుజుడు కలుస్తున్నారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృషభ రాశిలో కుజుడు, గురు గ్రహం సంయోగం ఏర్పడటం వల్ల కొన్ని రాశుల వారికి మేలు జరుగుతుంది. సంపద పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. వ్యాపార పరంగా పనులన్నీ విజయవంతం అవుతాయి. మీ కెరీర్‌లో గొప్పవిజయాన్ని అందుకుంటారు. ఈ కలయిక ఏ రాశులవారికి అదృష్టాన్ని తీసుకువస్తుందో తెలుసుకుందాం.
మేషరాశి:
అంగారకుడు మేషరాశికి అధిపతి. బృహస్పతి మీ ఇంటికి అధిపతి. ఈ రెండు గ్రహాలు కూడా మీకు డబ్బును సంపాదించే మార్గాలను చూపిస్తాయి. ఈ కలయిక వల్ల మీరు ఆర్థికంగా లాభపడతారు. ఉద్యోగం మారాలనుకుంటే.. మీకు కావాల్సిన ప్రదేశం నుంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి వారికి పూర్వీకుల ఆస్తుల వల్ల కూడా లాభాలు వస్తాయి. ఈ రాశికి చెందిన వ్యాపారులు కూడా లాభాలను పొందుతారు. అంతేకాదు మీరు నలుగురిలో ప్రత్యేకంగా ఉంటారు. సామాజిక స్థాయిలో మీకు గౌరవం లభిస్తుంది.
కర్కాటకం:
బృహస్పతి-కుజుడు గ్రహాల ప్రభావంతో పెండింగ్ లో ఉన్న పనులన్నీంటిని పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం బాగుంటుంది. తోబుట్టువుల నుంచి ప్రయోజనం పొందుతారు. ఆర్థిక పరిస్థితి కూడా బలపడుతుంది. ఈ రాశికి చెందిన వారు ప్రయాణాలు చేస్తే ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారు. ఈ సమయంలో మీ కోరికలు నెరవేరే అవకాశం ఉంది.
సింహం:
కుజుడు, బృహస్పతి కలయిక సింహరాశివారికి అనేక విధాలుగా అదృష్టాన్ని కలిగిస్తుంది. కుజుడు, బృహస్పతి మీ రాశికి అధిపతి అయిన సూర్యుని స్నేహితులు. ఈ రెండింటినీ మీ కర్మ గృహంలో ఉంచడం వల్ల ఉద్యోగంలో ఉన్నతస్థాయికి చేరుకుంటారు. మీరు చేసిన పనికి గుర్తింపు లభిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వ్యక్తులు మంచి ఫలితాలను పొందగలరు. మీ తండ్రితో మీ సంబంధం మరింత బలంగా మారుతుంది. మీరు ఆర్థిక సమస్యలకు పరిష్కారం కనుగొంటారు. రాజకీయ రంగంలో ఉన్న ఈ రాశి వ్యక్తులు కొన్ని పెద్ద విజయాలు సాధిస్తారు.
కన్య:
బృహస్పతి, కుజుడు కలయిక ఉంటుంది. అదృష్టం కన్యారాశివారి వైపు ఉంటుంది. మీరు వ్యాపారవేత్త అయితే, ఒక పెద్ద డీల్‌ను పొందే అవకాశం ఉంటుంది. మీరు మీ పని విధానంలో అద్భుతమైన మార్పులను కూడా చూడవచ్చు. అయితే, ఇతరులకు హాని కలిగించే చర్యలకు దూరంగా ఉండాలి. ఈ సమయంలో అతిథులు మీ ఇంటికి వచ్చే అవకాశం ఉంది. మీరు కొన్ని కారణాల వల్ల ఆందోళన చెందుతుంటే, మీరు ఈరోజు దాని పరిష్కారాన్నిపొందుతారు.
Vastu tips in telugu: మీ ఇంట్లో ఫ్యామిలీ ఫొటోలు ఎటు వైపు పెడుతున్నారా? ఈ పొరపాట్లు చేయకండి