అన్వేషించండి

Horoscope Today 22 November 2024: ఈ రాశుల ఉద్యోగులు సమస్యల నుంచి బయటపడతారు

Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Horoscope Today November 22, 2024

మేష రాశి

ఈ రోజు మీరు మీ జీవనశైలిలో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. మీ స్వంత వ్యాపారంపై ఎక్కువ శ్రద్ధ వహించండి. ఇతరుల పనుల్లో అస్సలు జోక్యం చేసుకోవద్దు. మానసిక స్థితి, ఆర్థిక పరిస్థితులు కొంత ప్రతికూలంగా ఉండవచ్చు.

వృషభ రాశి

ఈ రోజు  ఈ రాశి వ్యాపారులు కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు...కానీ సామర్థ్యంతో వాటిని అధిగమిస్తారు. మీ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకునేందుకు ప్రయత్నించండి.  మీకు హాని కలిగించే పనులు చేయవద్దు. ఉద్యోగులు, విద్యార్థులకు మిశ్రమ ఫలితాలున్నాయి.

మిథున రాశి

ఈ రోజంతా బిజీగా ఉంటారు. పిల్లల నుంచి గుడ్ న్యూస్ వింటారు. ముఖ్యమైన పనులు అనుకోకుండా వాయిదా పడతాయి. ఆర్థిక పరిస్థితిలో పెద్దగా మార్పు ఉండదు. కుటుంబంలో వృద్ధులు అనారోగ్యం బారినపడతారు.

Also Read: శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులు వర్చువల్ క్యూ బుకింగ్ ఆన్ లైన్లో ఇలా ఈజీగా చేసేసుకోండి!

కర్కాటక రాశి

ఈ రోజు అధికారులతో మీ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగలరు. కుటుంబంలో మీ గౌరవం పెరుగుతుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఉద్యోగంలో సమస్యలు తీరుతాయి. మీరు మీ పనిని విస్తరించాలని ఆలోచిస్తారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు.

సింహ రాశి

ఈ రోజంతా మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. వ్యాపార పనులపై ప్రయాణం చేయాల్సి ఉంటుంది. న్యాయపరమైన వివాదాల్లో విజయం సాధించవచ్చు. సహోద్యోగులతో మీ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. మీ కుటుంబానికి పూర్తి సమయం ఇవ్వండి 

కన్యా రాశి 

ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపిస్తారు. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఏదైనా తీవ్రమైన సమస్యను కుటుంబ సభ్యులతో డిస్కస్ చేస్తారు. మీరు చేపట్టిన పనులను ఓ ప్లాన్ ప్రకారం పూర్తిచేసేందుకు ప్రయత్నించండి. ఏ విషయంలోనూ రిస్క్ తీసుకోవద్దు

తులా రాశి

ఈ రోజు కార్యాలయంలో అసమ్మతి ఏర్పడవచ్చు...ఈ విషయంపై కొంత కుంగుబాటు ఉంటుంది...కానీ.. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో నార్మల్ అవుతారు. వ్యాపారంలో వినూత్న ప్రయోగాలు చేస్తారు. అవివాహితులకు వివాహ సూచనలున్నాయి. ఈ రోజంతా సాధారణంగా ఉంటుంది. 

Also Read: మీలో ఈ మార్పులు రానప్పుడు మీరు మళ్లీ మళ్లీ అయ్యప్ప మాల వేయడం వృధా!

వృశ్చిక రాశి

ఈ రోజు మీ వైవాహిక జీవితం మెరుగుపడుతుంది. పిల్లల సమస్యలను పరిష్కరించడానికి పరిష్కారాలు చూడండి. ప్రేమికులకు శుభదినం. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తారు. ఆరోగ్యం బావుంటుంది

ధనస్సు రాశి

ఈ రోజు ఈ రాశివారు మంచి ఆహారాన్ని ఆస్వాదిస్తారు. కుటుంబంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది. పెద్ద పెద్ద ప్రాజెక్టుల బాధ్యత తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. అనుకోని ప్రయాణం చేయాల్సి రావొచ్చు. ఆరోగ్యం బావుంటుంది. ఆదాయం పెరుగుతుంది. 

మకర రాశి

ఈ రోజు మీరు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి తగ్గుతుంది. ఉద్యోగులకు కార్యాలయంలో పని ఒత్తిడి ఉంటుంది. మీ దినచర్యను మార్చుకోవద్దు. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త..

Also Read: శబరిమల వెళ్లే భక్తులకు ఆరోగ్య చిట్కాలు - ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి!

కుంభ రాశి

ఈ రోజు మీ మనస్సు ఏదో విషయం గురించి ఆందోళన చెందుతుంది. మీ సమస్యలు అందరికి చెప్పకండి.  అనవసరమైన పనులలో మీ సమయాన్ని వృధా చేయవద్దు. కెరీర్ విషయంలో పెద్దగా మార్పులు చేయకండి. మీరు తప్పుడు ధోరణులకు దూరంగా ఉండాలి. 

మీన రాశి

కొత్త విషయాలు నేర్చుకోవడంపై ఆసక్తి చూపిస్తారు. స్నేహితులతో పాత విషయాల గురించి చర్చిస్తారు. కంప్యూటర్ రంగానికి చెందిన వ్యక్తులు పెద్ద ప్రాజెక్టులు పొందే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. 

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

Also Read: కడప దర్గాకి రామ్ చరణ్ - అయ్యప్ప మాలధారులు మసీదు, దర్గాలకు వెళ్లొచ్చా!

 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
Vaammo Vaayyo Song Lyrics : ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
Vaammo Vaayyo Song Lyrics : ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
Venezuela : వెనిజులా రాజధాని కారకాస్‌పై క్షిపణి దాడి! పలు చోట్ల విధ్వంసం!
వెనిజులా రాజధాని కారకాస్‌పై క్షిపణి దాడి! పలు చోట్ల విధ్వంసం!
Maoist Latest News: ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
Hyundai Creta నుంచి Tata Sierra వరకు - కొత్త Seltos ముందు బలంగా నిలబడే కారు ఏది?
కొత్త Kia Seltos - ధర, స్పెసిఫికేషన్లలో ఇతర కార్ల కంటే బెటర్‌గా ఉందా?
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Embed widget