అన్వేషించండి

Horoscope Today 01 December 2024: కార్తీక అమావాస్య రోజు ఈ రాశులవారికి అనారోగ్య సూచన!

Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Horoscope Today 01st December 2024

మేష రాశి

ఈ రోజు వ్యాపారంలో సహోద్యోగులతో విభేదాలు రావచ్చు. రోజంతా బిజీగా ఉంటారు. కుటుంబ సభ్యుల విషయంలో చాలా ఆందోళన ఉంటుంది. పనికిరాని సమస్యలపై మీ సమయాన్ని వృథా చేయకండి. మైగ్రేన్‌ రోగులు జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలకు దూరంగా ఉండాలి.

వృషభ రాశి

ఈ రోజు మీరు ప్రభావవంతమైన వ్యక్తులతో స్నేహంగా ఉంటారు. వ్యాపార సమస్యలు తొలగిపోతాయి. స్నేహితులను కలుస్తారు. ఇంట్లో కార్యాలయంలో పనిచేయాల్సి వస్తుంది. తొందరగా అలసిపోతారు. ఉద్యోగులు శుభవార్త వింటారు.  

మిథున రాశి

మీరు తొందరపాటుకు దూరంగా ఉండాలి. వ్యాపారంలో అప్పులు చేయొద్దు.ఇంట్లో ఉన్న వృద్ధుల ఆరోగ్యంపై ఆందోళన ఉంటుంది. సోమరితనం వల్ల పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. ఈ రోజు విద్యార్థులకు మంచి రోజు..పోటీ పరీక్షలు రాసేవారు విజయం సాధిస్తారు. 

Also Read: మీ ఇంట్లో పురుడు, మరణం.. ఈ రెండు సందర్భాల్లో అయోధ్య రామ మందిరంలోకి రావొద్దు!

కర్కాటక రాశి

ఈ రోజు మీకు చాలా గొప్పగా ఉంటుంది. కార్యాలయంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది. జీవిత భాగస్వామి సలహా నుంచి ప్రయోజనం పొందుతారు. వ్యాపారంలో భాగస్వాములకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. మీ ప్రవర్తనతో అందరూ సంతోషిస్తారు. అన్ని పనులు ప్రణాళికాబద్ధంగా జరుగుతాయి. మీరు ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా శ్రద్ధగా పనిచేస్తారు

సింహ రాశి

నూతన వ్యాపార ఒప్పందాలకు ఈరోజు సంతకం చేయవచ్చు. క్రమంగా మీరు వ్యాపారంలో పెద్ద లాభాలను పొందుతారు. వైవాహిక జీవితంలో సంతోషం పెరుగుతుంది. మీ మొండి స్వభావం గురించి ఆత్మపరిశీలన చేసుకోవడం ముఖ్యం. కార్యాలయంలో పోటీ వాతావరణం ఉంటుంది.

కన్యా రాశి 

ఈ రోజు మీ ఆదాయ వనరులు పెరుగుతాయి. మానసికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. భూములు, ఆస్తుల విషయంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. తలనొప్పితో ఇబ్బంది పడతారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. 

తులా రాశి
 
ఈ రోజంతా సంతోషంగా గడుస్తుంది. అడగకుండా ఎవరకీ సలహాలు ఇవ్వొద్దు. పనిఒత్తిడి వల్ల అలసిపోతారు. చేపట్టిన పనులు పూర్తిచేయడంలో సక్సెస్ అవుతారు. మానసికంగా దృఢంగా ఉంటారు. ఉద్యోగం, వ్యాపారంలో కష్టానికి తగిన ఫలితం పొందుతారు.

Also Read: 12 ఏళ్లకోసారి విభీషణుడు సందర్శించే ఆలయం ఇది.. ధనుర్మాసంలో స్వామి వైభవం చూసితీరాల్సిందే!

వృశ్చిక రాశి

ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. అపరిచితులను ఎక్కువగా నమ్మవద్దు.  ఇతరుల భావాలకు గౌరవం ఇస్తారు. ఆదాయన్ని మించిన ఖర్చులు చేయడం సరికాదు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు

ధనస్సు రాశి

ఈ రోజు వ్యాపారానికి చాలా మంచి రోజు కాదు. ఇంటి శుభ్రత, మరమ్మత్తులపై శ్రద్ధ చూపిస్తారు. మితిమీరిన ఉత్సాహంతో అనవసర ఖర్చులు చేస్తారు. అత్తమామలతో సత్సంబంధాలుంటాయి. అవివాహితులకు వివాహ సూచనలున్నాయి. 

మకర రాశి

ఈ రోజు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రభుత్వ నిబంధనలను పాటించండి. ధార్మిక, శుభకార్యాలకు ధనాన్ని వెచ్చిస్తారు. మీ ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఒకరి మాటలపై స్పందించే ముందు ఆలోచించాలి.

Also Read: శబరిమల యాత్ర ఎప్పటి నుంచి ప్రారంభమైంది .. అయ్యప్ప స్వామి మొదటి ఆదాయం ఎంతో తెలుసా!

కుంభ రాశి 

వ్యాపారానికి సంబంధించి వ్యూహాలు రూపొందించడానికి ఈరోజు గొప్ప రోజు. గతంలో చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగం మారాలి అనుకుంటే ప్రయత్నాలు ప్రారంభించండి. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి. చేసే పనిలో ఉత్సాహంగా ఉంటారు.

మీన రాశి

ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి విషయంలో కోపంగా వ్యవహరిస్తారు. ఎవరి విషయంలోనూ పక్షపాతాన్ని కలిగి ఉండకండి.  మీ బాధ్యతలను సకాలంలో పూర్తి చేయగలరు. ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉంటుంది. సందిగ్ధ పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. అనవసర విషయాలపై శ్రద్ధ పెట్టకండి.

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఈ ఏడాదిలోనే తెలంగాణలో ఉప ఎన్నికలు: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఈ ఏడాదిలోనే తెలంగాణలో ఉప ఎన్నికలు: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
AP DSC Notification 2025: గతంలో డీఎస్సీకి అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాలా.. ఇదిగో క్లారిటీ
గతంలో DSCకి అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాలా.. ఇదిగో క్లారిటీ
MI vs CSK Highlights: సీఎస్కేపై రివేంజ్ తీర్చుకున్న ముంబై.. రోహిత్, సూర్య విశ్వరూపం - జడ్డూ, దూబే హాఫ్ సెంచరీలు వృథా
సీఎస్కేపై రివేంజ్ తీర్చుకున్న ముంబై.. రోహిత్, సూర్య విశ్వరూపం - జడ్డూ, దూబే హాఫ్ సెంచరీలు వృథా
CM Revanth Reddy: త్వరలో హైదరాబాద్‌లో ఎకో టౌన్ ఏర్పాటు, జపాన్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
త్వరలో హైదరాబాద్‌లో ఎకో టౌన్ ఏర్పాటు, జపాన్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MI vs CSK Match HighLights IPL 2025 | చెన్నై సూపర్ కింగ్స్ పై 9వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ సూపర్ విక్టరీPBKS vs RCB Match Highlights IPL 2025 | పంజాబ్ కింగ్స్ పై 7 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం | ABP DesamMI vs CSK Match Preview IPL 2025 | నేడు వాంఖడేలో ముంబైని ఢీకొడుతున్న చెన్నై | ABP DesamPBKS vs RCB Match preview IPL 2025 | బెంగుళూరులో ఓటమికి పంజాబ్ లో ప్రతీకారం తీర్చుకుంటుందా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఈ ఏడాదిలోనే తెలంగాణలో ఉప ఎన్నికలు: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఈ ఏడాదిలోనే తెలంగాణలో ఉప ఎన్నికలు: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
AP DSC Notification 2025: గతంలో డీఎస్సీకి అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాలా.. ఇదిగో క్లారిటీ
గతంలో DSCకి అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాలా.. ఇదిగో క్లారిటీ
MI vs CSK Highlights: సీఎస్కేపై రివేంజ్ తీర్చుకున్న ముంబై.. రోహిత్, సూర్య విశ్వరూపం - జడ్డూ, దూబే హాఫ్ సెంచరీలు వృథా
సీఎస్కేపై రివేంజ్ తీర్చుకున్న ముంబై.. రోహిత్, సూర్య విశ్వరూపం - జడ్డూ, దూబే హాఫ్ సెంచరీలు వృథా
CM Revanth Reddy: త్వరలో హైదరాబాద్‌లో ఎకో టౌన్ ఏర్పాటు, జపాన్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
త్వరలో హైదరాబాద్‌లో ఎకో టౌన్ ఏర్పాటు, జపాన్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
Odela 3: 'ఓదెల 3' ట్విస్ట్ రివీల్ చేసిన సంపత్ నంది... తిరుపతి ఆత్మ మళ్ళీ ఎందుకు వచ్చిందంటే?
'ఓదెల 3' ట్విస్ట్ రివీల్ చేసిన సంపత్ నంది... తిరుపతి ఆత్మ మళ్ళీ ఎందుకు వచ్చిందంటే?
EX MP GV Harsha kumar: చంద్రబాబు ప్రభుత్వం కంటే జగన్ సర్కార్ 1000 రెట్లు బెటర్ - మాజీ ఎంపీ హర్షకుమార్‌ ఆగ్రహం
చంద్రబాబు ప్రభుత్వం కంటే జగన్ సర్కార్ 1000 రెట్లు బెటర్ - మాజీ ఎంపీ హర్షకుమార్‌ ఆగ్రహం
Retired Karnataka DGP Murder: కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ దారుణహత్య- భార్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆమె మీద అనుమానం !
కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ దారుణహత్య- భార్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆమె మీద అనుమానం !
AP DSC Notification 2025: ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ప్రారంభం- పూర్తి వివరాలివే
ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ప్రారంభం- పూర్తి వివరాలివే
Embed widget