News
News
X

July month horoscope: జూలై నెల ఈ రాశి వారికి అంతా అనుకూలమే

జూలై నెలలో ఏ రాశి వారికి బావుంది… జోతిష్య శాస్త్రంలో అపారమైన అనుభవం ఉన్న పండితులు ఏం చెబుతున్నారో చూద్దామా…

FOLLOW US: 
Share:

జూలై నెల ఈ రాశి వారికి అంతా అనుకూలమే


అప్పుడే ఏడాదిలో సగం రోజులు గడిచిపోయాయ్. నిన్నటి వరకూ అన్ని విధాలుగా కాలం కలిసొచ్చిన వాళ్లంతా మిగిలిన ఆరు నెలలు అలాగే గడవాలని కోరుకుంటే….నిన్నటి వరకూ పెద్దగా కలసిరానివారు…ఇకముందు కాలమైనా బావుండాలని కోరుకుంటున్నారు. మరి ఈ నెలలో ఏ రాశివారికి బావుంది… జోతిష్య శాస్త్రంలో అపారమైన అనుభవం ఉన్న పండితులు ఏం చెబుతున్నారో చూద్దామా…
మేషం 
మేషరాశి వారికి ఈ నెలలో గ్రహసంచారం అనుకూలంగా ఉంది. గడిచిన నెలవరకూ ఎదుర్కొన్న ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. సరైన సమయానికి డబ్బు చేతికందుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికమైనప్పటికీ…తగిన గుర్తింపు లభిస్తుంది. లాయర్లకు, డాక్టర్లకు ఈ నెలంతా అనుకూల సమయమే. ఇంజనీర్లకు, డాక్టర్లకు, ఐ.టి నిపుణులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. వ్యాపారులు, స్వయం ఉపాధివారు పురోగతి సాధిస్తారు. కోర్టు కేసుల్లో చిక్కుకున్న వారికి అనుకూలంగా వచ్చే సూచనలున్నాయ్. సొంత నిర్ణయాల కన్నా కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం ఉత్తమం. 
మిథునం
ఈ రాశివారికి ఈ నెల ప్రశాంతంగానే గడిచిపోతుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందడంతో కొద్దిగా ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్, అధికారుల నుంచి ప్రశంసలు, ప్రోత్సాహకాలు ఉండే అవకాశం ఉంది. అయితే అష్టమ శని కారణంగా ప్రతి పనీ ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నా, తలచిన పనుల్లో కొన్నింటిని పట్టుదలతో పూర్తి చేస్తారు. చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తినా వైద్యుల సహాయంతో బయటపడతారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. సైన్స్, ఐ.టి విద్యార్థులు రాణిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. వ్యాపార రంగంలో లాభాలకు అవకాశం ఉంది.  
కర్కాటకం 
కర్కాటక రాశివారికి గ్రహ సంచారం పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంది. మంచి నిర్ణయాలు తీసుకుని కార్యరూపంలో పెడితే అవి మున్ముందు సత్ఫలితాలనిస్తాయి.  తెగించి కొన్ని మంచి పనులు చేపడతారు. ఆదాయం పెరుగుతుంది. కొత్త పరిచయాలతో భవిష్యత్ కు బాటలు వేసుకుంటారు. ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధాలు కుదురుతాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లోని వారికి పరిస్థితులు కలిసివస్తాయి. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. చెడు స్నేహాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.

సింహం 
ఈ రాశివారికి ఈ నెలంతా హాయిగా, ప్రశాంతంగా సాగిపోతుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి ఉన్నప్పటికీ లక్ష్యాలు పూర్తి చేస్తారు. భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇల్లుగానీ, స్థలం గానీ కొనాలని ప్రయత్నిస్తారు. తలపెట్టిన పనులన్నీ దాదాపు పూర్తవుతాయి. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. బ్యాంకర్లు, వడ్డీ వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్నవారు సత్ఫలితాలు సాధిస్తారు.  కన్య 
కన్యా రాశివారికి వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో అభివృద్ధికి అవకాశం ఉంది.  పై అధికారుల మెప్పు పొందుతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. శని సంచారం కారణంగా మధ్య మధ్య అనారోగ్య బాధలు, అనవసర ప్రయాణాలు తప్పకపోవచ్చ. సహోద్యోగులు కొందరు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. కుటుంబంలో ప్రశాంత పరి స్థితులు నెలకొంటాయి. ప్రేమ వ్యవహారాల్లో దూకుడు వల్ల ఇబ్బంది పడతారు. స్వయం ఉపాధివారు ప్రయోజనం పొందుతారు. ఐ.టి వారికి సమయం అనుకూలంగా ఉంది. అక్రమ సంబంధాలకు దూరంగా ఉండండి.
వృశ్చికం 
కుటుంబానికి సంబంధించిన విషయాల్లో గ్రహ సంచారం అనుకూలంగా ఉంది. మంచి నిర్ణయాలు తీసుకుంటే సత్ఫలితాలనిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో అభివృద్ధి ఉంటుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో చేరి జీవితంలో స్థిరపడతారు. పెళ్లి సంబంధాలు కుదురుతాయి. ఇల్లుగానీ, స్థలంగానీ కొనే అవకాశం ఉంది. శుభ వార్తలు వింటారు. ఈ నెల చాలావరకు ప్రశాంతంగా గడిచిపోతుంది. రియల్ ఎస్టేట్ వారికి, రాజకీ యాలు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అన్నివిధాలా అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో మరో ముందడుగు వేస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.మీనం 
మీనరాశివారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా కొనసాగుతుంది. నిరుద్యోగులకు అనుకూల సమయం. గురువు వ్యయ సంచారం కారణంగా స్థాన చలనానికి అవకాశం ఉంది. విదేశీ ప్రయాణ సూచనలున్నాయి. చాలావరకు అప్పులు తీరుస్తారు. పెళ్లి సంబంధం కుదురుతుంది. విద్యార్థులు  చెడు స్నేహాలకు, వ్యసనాలకు దూరంగా ఉండండి.

Published at : 08 Jul 2021 06:31 PM (IST) Tags: July month horoscope Horoscope Telugu horoscope

సంబంధిత కథనాలు

Mysterious Temples in India: శాస్త్రవేత్తలకు అంతుచిక్కని ఆలయాలివి, అడుగడుగునా మిస్టరీలే!

Mysterious Temples in India: శాస్త్రవేత్తలకు అంతుచిక్కని ఆలయాలివి, అడుగడుగునా మిస్టరీలే!

Maha Shivaratri 2023: మహాశివరాత్రి ఎప్పుడొచ్చింది, సర్వం ఈశ్వరమయం అంటారెందుకు!

Maha Shivaratri 2023: మహాశివరాత్రి ఎప్పుడొచ్చింది, సర్వం ఈశ్వరమయం అంటారెందుకు!

Love Horoscope Today 02 February 2023: ఈ రాశివారు జీవిత భాగస్వామితో ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు

Love Horoscope Today 02 February 2023: ఈ రాశివారు జీవిత భాగస్వామితో ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు

Horoscope Today 02nd February 2023: ఈ రాశివారికి తమ పనిపై కన్నా పక్కవారి పనిపై శ్రద్ధ ఎక్కువ, ఫిబ్రవరి 2 రాశిఫలాలు

Horoscope Today 02nd February 2023: ఈ రాశివారికి తమ పనిపై కన్నా పక్కవారి పనిపై శ్రద్ధ ఎక్కువ, ఫిబ్రవరి 2 రాశిఫలాలు

Vishnu Sahasranamam : విష్ణు సహస్రమానాల్లో ఏ శ్లోకం ఎలాంటి ఫలితాన్నిస్తుందంటే!

Vishnu Sahasranamam : విష్ణు సహస్రమానాల్లో ఏ శ్లోకం ఎలాంటి ఫలితాన్నిస్తుందంటే!

టాప్ స్టోరీస్

Telangana budget 2023 : కొత్త పన్నులు - భూముల అమ్మకం ! తెలంగాణ బడ్జెట్‌లో ఆదాయ పెంపు మార్గాలు ఇవేనా ?

Telangana budget 2023 :  కొత్త పన్నులు -  భూముల అమ్మకం ! తెలంగాణ బడ్జెట్‌లో ఆదాయ పెంపు మార్గాలు ఇవేనా ?

Hari Hara Veera Mallu: హరి హర వీర మల్లు మొదటి పాట ఎప్పుడు? - అప్‌డేట్ ఇచ్చిన ఎం.ఎం.కీరవాణి!

Hari Hara Veera Mallu: హరి హర వీర మల్లు మొదటి పాట ఎప్పుడు? - అప్‌డేట్ ఇచ్చిన ఎం.ఎం.కీరవాణి!

Pawan Kalyan On Anam : డీజీపీ బాధ్యత తీసుకోకపోతే కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు - ఆనం, కోటంరెడ్డి ఇష్యూపై పవన్ కల్యాణ్ హెచ్చరిక

Pawan Kalyan On Anam : డీజీపీ బాధ్యత తీసుకోకపోతే కేంద్ర హోంశాఖకు  ఫిర్యాదు - ఆనం, కోటంరెడ్డి ఇష్యూపై పవన్ కల్యాణ్ హెచ్చరిక

YS Sharmila Gift To KCR : సీఎం కేసీఆర్ కు షూస్ గిఫ్ట్ పంపిన షర్మిల, తమతో ఒక్కరోజు పాదయాత్ర చేయాలని సవాల్

YS Sharmila Gift To KCR : సీఎం కేసీఆర్ కు షూస్ గిఫ్ట్ పంపిన షర్మిల, తమతో ఒక్కరోజు పాదయాత్ర చేయాలని సవాల్