Image Credit: Pixabay
Astrological prediction for September 24th, 2023
మేష రాశి
మీరు తలపెట్టే పనులకు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. వ్యాపారం బాగా సాగుతుంది. స్నేహితులతో సరదా సమయం గడుపుతారు. ప్రోత్సాహకరమైన సమాచారం అందుతుంది. అనవసర ఇబ్బందుల్లో చిక్కుకునే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండాలి. సామాజిక కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది. ఇతరులకు సహాయం చేస్తారు.
వృషభ రాశి
ఆదాయం బాగానే ఉంటుంది. కుటుంబ సహకారం అందుతుంది. వ్యాపారం బాగా సాగుతుంది. ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. ప్రమాదం కారణంగా నష్టపోతారు. పని చేసేటప్పుడు అజాగ్రత్తగా ఉండకండి. చేసే పనులలో ఆటంకాలు ఎదురుకావచ్చు. అనవసర విషయాలపై ఎక్కువ ఆలోచించవద్దు.
మిథున రాశి
కుటుంబంలో సంతోషం ఉంటుంది. బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. సోదరులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమవుతాయి. కుటుంబం గురించి ఆందోళనలు ఉంటాయి. అధికారుల నుంచి మార్గదర్శకత్వం, మద్దతు లభిస్తుంది. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. మాట జాగ్రత్త. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు.
Also Read: Weekly Horoscope 25 September - 01 October 2023: సెప్టెంబరు ఆఖరి వారం ఈ రాశులవారిపై లక్ష్మీ కటాక్షం
కర్కాటక రాశి
పెద్ద ఒప్పందాలు లాభాలను అందిస్తాయి. వ్యాపారం బాగానే సాగుతుంది. ఉపాధి కోసం చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆదాయం పెరుగుతుంది. లావాదేవీల విషయంలో తొందరపడకండి. అవసరమైన వస్తువులు సమయానికి అందకపోవడం వల్ల కోపం ఉంటుంది.
సింహ రాశి
కుటుంబంలో సమస్యలు తీరిపోతాయి. మీకు ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. సృజనాత్మక పని విజయవంతమవుతుంది. మీరు జ్ఞానోదయం పొందిన వ్యక్తి నుండి మార్గదర్శకత్వం పొందుతారు. స్నేహితులతో సరదాగా గడుపుతారు. వ్యాపారం బాగా సాగుతుంది. ఇంట్లో ఆనందం ఉంటుంది.
కన్యా రాశి
ఈ రోజు మీరు బ్యాడ్ న్యూస్ వినే అవకాశం ఉంది. శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. ఆదాయంలో తగ్గుదల ఉంటుంది. వివాదం బాధ కలిగిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపాటు వద్దు. అనవసర సమస్యలు పెరగుతాయి. ఇతరుల మాటలకు ప్రభావితం కావొద్దు.
తులా రాశి
మీరు ప్రభావవంతమైన వ్యక్తి నుంచి మద్దతు పొందుతారు. పూజల పట్ల ఆసక్తి ఉంటుంది. మతపరమైన ప్రయాణం చేయాల్సి రావొచ్చు. మీ నిర్ణయాలు మీరే తీసుకోండి. ఎదుటి వారి మాటలకు ప్రభావితం కావొద్దు. ఇబ్బందుల్లో వ్యతిరేకత ఉంటుంది. ఏదో ఆందోళన ఉంటుంది. తొందరపాటు వల్ల హాని కలుగుతుంది.
Also Read: 25 సెప్టెంబర్- 01 అక్టోబర్ 2023 వారఫలాలు: సెప్టెంబరు ఆఖరివారం ఈ రాశులవారికి అనుకోని ఇబ్బందులు
వృశ్చిక రాశి
ఈ రోజు స్నేహితులతో మంచి సమయం గడుపుతారు. ప్రయాణ ప్రణాళికలు రూపొందిస్తారు. పోగొట్టుకున్న డబ్బు తిరిగి పొందుతారు. ఆరోగ్యం క్షీణించవచ్చు.. జాగ్రత్తగా ఉండండి. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. అదృష్టం కలిసొస్తుంది.
ధనుస్సు రాశి
ఈ రాశివారి ఉద్యోగులకు కార్యాలయంలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. మీపై వ్యతిరేకత ఉంటుంది..అజాగ్రత్తగా ఉండొద్దు. వ్యాపారం మీరు అనుకున్నట్టే సాగుతుంది. నూతన ప్రణాళికలు అమలు చేస్తారు. కార్యాలయంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. వాహనం జాగ్రత్తగా నడపాలి ప్రమాద సూచనలున్నాయి.
మకర రాశి
లావాదేవీల విషయంలో తొందరపాటు వల్ల నష్టం జరుగుతుంది. ఒకరి మాటలు విని అనవసర ఆగ్రహానికి గురవొద్దు. అనవసరమైన ఖర్చు ఉంటుంది. పాత వ్యాధి తిరిగబెట్టొచ్చు. ప్రమాదకర కార్యకలాపాలకు దూరంగా ఉండండి. ఏదో ఆందోళనలో ఉంటారు.
కుంభ రాశి
ఈ రోజు మీరు ఏదో గందరగోళ స్థితిలో ఉంటారు. మీ తెలివితేటలను ఉపయోగించండి. కొత్త పనులు చేయడానికి ప్రణాళికలు రూపొందించబడతాయి. సోదరుల నుండి మద్దతు లభిస్తుంది. లాభం పెరుగుతుంది. అదృష్టం మీ వైపు ఉంటుంది. సంతోషంగా ఉంటుంది. జంట నడకకు వెళతారు. పనులు సాఫీగా సాగుతాయి.
మీన రాశి
మీరు కొత్త వెంచర్ ప్రారంభించాలని భావిస్తారు. ఓ బహుమతి పొందుతారు. ఎప్పటి నుంచో వెంటాడుతున్న ఓ పెద్ద సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సన్నిహితుల సలహాలు ఉపయోగకరంగా ఉంటాయి. కొత్త స్నేహితులు ఏర్పడతారు. ఆదాయం పెరుగుతుంది.
Christmas Celebrations 2023: ఈ దేశంలో క్రిస్మస్ ట్రీకి సాలెగూళ్లు వేలాడదీస్తారు, ఒక్కో దేశంలో ఒక్కో ప్రత్యేకత!
Daily Horoscope Today Dec 05, 2023 : కెరీర్, వ్యాపారం, ఉద్యోగంలో ఏ రాశివారికి అదృష్టం కలిసొస్తుంది - డిసెంబరు 05 రాశిఫలాలు
Revanth Reddy Astrology 2023 : ఇదీ రేవంత్ రెడ్డి జాతకం - అందుకే అఖండ విజయం- రాజయోగం!
Election Result 2023 Astrology: ఎన్నికల ఫలితాల్లో ఈ రాశులవారికి విజయం - వారికి అపజయం, గ్రహాలు చెప్పే ఎగ్జిట్ పోల్ ఇదే!
Horoscope Today December 23rd, 2023: ఈ రాశులవారికి ఆనందం - ఆ రాశులవారికి ఆందోళన, డిసెంబరు 03 రాశిఫలాలు
BRS Chief KCR: ఓటమి తరువాత తొలిసారి పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కేసీఆర్ భేటీ
Chandrababu Srisailam Tour: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా
Bigg Boss 7 Telugu: అమర్, ప్రశాంత్‌ల మధ్య ‘ఆడోడు’ గొడవ, విచక్షణ కోల్పోయి మరీ మాటల యుద్ధం!
Election Code: ముగిసిన ఎన్నికలు - ఎన్నికల కోడ్ ఎత్తేసిన కేంద్ర ఎన్నికల సంఘం
/body>