అన్వేషించండి

Horoscope Today September 16, 2023: ఈ రాశివారు విలాసాలకు ఎక్కువ ఖర్చు చేస్తారు, సెప్టెంబరు 16 రాశిఫలాలు

Horoscope Today : మేష రాశి నుంచి మీన రాశివరకూ ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.

Horoscope Today  September 16, 2023: (సెప్టెంబరు 16 రాశిఫలాలు)

మేష రాశి
ఈ రాశి ఉద్యోగులకు సౌకర్యాలు పెరుగుతాయి. పార్టీలకు హాజరవుతారు. మంచి ఆహారాన్ని ఆస్వాదిస్తారు. వ్యాపారం బాగానే సాగుతుంది.  సృజనాత్మక పని విజయవంతమవుతుంది.  పని పట్ల ఆసక్తి పెరుగుతుంది. షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేవారు లాభాలు ఆర్జిస్తారు. మీ బిజీ షెడ్యూల్ కారణంగా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు.

వృషభ రాశి 
ఆదాయం పెరుగుతుంది. లాభదాయకమైన అవకాశాలు వస్తాయి. శాశ్వత ఆస్తులు పెద్ద ప్రయోజనాలను అందిస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. మీరు వ్యాపార భాగస్వాముల నుంచి మద్దతు పొందుతారు. ప్రయాణం చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.

మిథున రాశి
మీ ఆత్మగౌరవం చెక్కుచెదరకుండా ఉంటుంది. శుభవార్తలు అందుకుంటారు. ఓ పెద్ద పని చేయాలని భావిస్తారు.  కుటుంబ సభ్యుల పురోగతికి సంబంధించిన వార్తలు వింటారు. కొత్త వ్యాపారం ప్రారంభించే ఆలోచన వాయిదా వేసుకోవడం మంచిది. పాత స్నేహితులను కలుస్తారు. కుటుంబం నుంచి సహకారం ఉంటుంది.

కర్కాటక రాశి
ఈ రాశి విద్యార్థులు చదువులపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. అనవసర ప్రసంగాన్ని వీడాలి. ఏదో విషయంలో ఆందోళన చెందుతారు. ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. వ్యాపారం బాగా సాగుతుంది. ఆదాయంలో నిశ్చయత ఉంటుంది. విచారకరమైన సమాచారం వినే అవకాశం ఉంది. అనవసర ఖర్చులు తగ్గించుకునేందుకు ప్లాన్ చేయండి. 

Also Read: వినాయకుడికి పత్రి పూజ - మరే దేవుడికీ లేదెందుకు!
 
సింహ రాశి 
ఈ రోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయడం వల్ల సంతోషంగా ఉంటారు. పిల్లల విషయంలో ఆందోళన ఉంటుంది. శత్రువులు హాని కలిగించవచ్చు కానీ స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు. లాభదాయకమైన అవకాశాలు వస్తాయి. ప్రయాణ ప్రణాళికలు చేయవచ్చు. ఆనందం ఉంటుంది. ఇష్ట దైవాన్ని పూజించండి.

కన్యా రాశి
ఈ రాశి వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. అప్పులు రికవరీ అవుతాయి. ప్రయాణం బాగా సాగుతుంది. ఉద్యోగులు ప్రశాంతంగా ఉంటారు. 
రోజంతా సంతోషంగా ఉంటారు. ప్రయాణాలు బాగా సాగుతాయి. ముఖ్యమైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి. న్యాయపరమైన అడ్డంకులు ఏర్పడవచ్చు. ఎవ్వరితోనూ అనవసర వాదనలు పెట్టుకోవద్దు.

తులా రాశి
ఈ రాశివారు తెలియని వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు సాగుతాయి.  ఆర్థిక లాభం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో ఉన్న సామరస్యాన్ని కాపాడుకోవడం మంచిది. అనవసర విషయాలపై దృష్టి సారించవద్దు. ఆదాయం బాగానే ఉంటుంది. స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు. ఏ పనిలోనూ తొందరపడొద్దు.

వృశ్చిక రాశి 
వస్తుపరమైన వనరులు , విలాసాలకు ఎక్కువ ఖర్చు ఉంటుంది. ప్రమాదకర కార్యకలాపాలకు దూరంగా ఉండండి. మీ శ్రేయోభిలాషులు మీకు సహకరిస్తారు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.  ఆదాయం తగ్గుతుంది. ఇంట్లో కొంత అశాంతి వాతావరణం ఉండొచ్చు. ఏదో సంక్షోభం మీ చుట్టుముడుతుంది. 

ధనుస్సు రాశి 
ఈ రోజు మీకు గౌరవం లభిస్తుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీకు అవసరమైన సహకారం అందుతుంది.ఓ పెద్ద పని చేయాలని భావిస్తారు..అందలో సక్సెస్ అవుతారు. ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అనవసర రిస్క్ తీసుకోవద్దు. మీ పనితీరు మెరుగుపడుతుంది. 

Also Read: వినాయక పూజ చేయడమే కాదు - ఆ రూపం నుంచి ఏం నేర్చుకోవాలో తెలుసా!

మకర రాశి 
వ్యాపారం బాగా సాగుతుంది. కొత్త వ్యక్తులతో పరిచయం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. మానసిక ఆందోళన తగ్గుతుంది. మీ పిల్లల కార్యకలాపాలపై నిఘా ఉంచండి.  తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. అనుభవజ్ఞుల సలహా లేకుండా కొత్త పనిని ప్రారంభించవద్దు. వృద్ధుల సహకారంతో పనిలో ఆటంకాలు తొలగి లాభదాయకమైన పరిస్థితి ఉంటుంది.

కుంభ రాశి 
వ్యాపారానికి సంబంధించి కొనసాగుతున్న సమస్యలు పరిష్కారమవుతాయి. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబంలో ఆనందం ఉంటుంది. మీరు ఉద్యోగంలో ప్రమోషన్ గురించి సమాచారాన్ని పొందవచ్చు. పనిలో అంకితభావం , ఉత్సాహం ఉంటుంది. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఎవరికీ సలహా ఇవ్వకండి 

మీన రాశి 
ఈ రాశివారికి ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. మీ బంధువుల నుంచి మద్దతు పొందుతారు. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త..ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఈ రోజు తొందరగా అలసిపోయినట్టు అనిపిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

14-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు!
14-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు!
13-08-2026 గురువారం మీ రాశిఫలాలు!
13-08-2026 గురువారం మీ రాశిఫలాలు!
Solar Eclipse 2026: మొబైల్, టీవీలో ప్రత్యక్ష సూర్యగ్రహణాన్ని చూసినా నియమాలు పాటించాలా? తర్వాత స్నానం చేయలా?
మొబైల్, టీవీలో ప్రత్యక్ష సూర్యగ్రహణాన్ని చూసినా నియమాలు పాటించాలా? తర్వాత స్నానం చేయలా?
Solar Eclipse 2026: సూర్య గ్రహణం ఎక్కడెక్కడ కనిపిస్తుంది? విమానం కిటికీ నుంచి సంపూర్ణ సూర్యగ్రహణం ఎలా ఉంటుంది?
ఆగష్టు 12న సూర్య గ్రహణం ఎక్కడెక్కడ కనిపిస్తుంది? విమానం కిటికీ నుంచి సంపూర్ణ సూర్యగ్రహణం ఎలా ఉంటుంది?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget